DQL Global Ranking: డిజిటల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్.. ఆ విషయంలో చైనా కంటే భారత్‌ ముందంజ

(ప్రతీకాత్మక చిత్రం)

DQL Global Ranking:ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్యలో భారత్​ 95వ స్థానంలో ఉంది. ఈ సంఖ్య ప్రపంచ సగటు ఇంటర్నెట్​ వినియోగం కంటే తక్కువనే చెప్పవచ్చు. అయితే కోవిడ్-19 లాక్​డౌన్​ సమయంలో ఇంటర్నెట్​ వినియోగం పెరిగింది.

  • Share this:
DQL Global Ranking 2021: అన్ని రంగాల్లోనూ డిజిటలైజేషన్‌ విధానాన్ని అందిపుచ్చుకుంటున్న భారత్‌.. మరో ఘనత సాధించింది. డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ (Digital Quality of Life-DQL) తాజా ర్యాంకింగ్​లో మన దేశం ప్రపంచంలో 59 స్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 110 దేశాలకు ర్యాంకులు కేటాయించగా భారత్​ 59 వ స్థానంలో నిలిచింది. ప్రపంచ దేశాల్లో నెట్​వర్క్​ కవరేజీపై ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ సర్ఫ్‌షార్క్ (Surfshark) ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఐదు ప్రాథమిక డిజిటల్ సెక్యూరిటీ పారామీటర్లపై ర్యాంకులను కేటాయించింది. భారత్​ ఈ-గవర్నమెంట్‌లో​ 33వ ర్యాంక్​, ఈ-సెక్యూరిటీలో 36వ ర్యాంక్​, ఇంటర్నెట్ ధరలో 47వ ర్యాంక్​, ఇంటర్నెట్ క్వాలిటీలో 67వ స్థానాలను దక్కించుకుంది. ఈ-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మాత్రం వెనుకబడిపోయింది. ఈ విభాగంలో 91వ స్థానానికి పడిపోయింది.

మొత్తం మీద, డిజిటల్​ క్వాలిటీ ఆఫ్​ లైఫ్​ ఇండెక్స్​ (డీక్యూఎల్​)–2020 తో పోలిస్తే భారత ర్యాంకింగ్​ కాస్త పడిపోయిందనే చెప్పవచ్చు. 2020లో 59 స్థానంలో ఉండగా.. ఇప్పుడు 61వ స్థానానికి పడిపోయింది. అయితే ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్​ మెరుగైన స్థానంలోనే ఉంది. ఆసియాలో 17వ స్థానం, దక్షిణ ఆసియా ప్రాంతంలో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది కంటే భారతదేశ ఈ-సెక్యూరిటీ 76% మెరుగుపడింది. ఈ–సెక్యూరిటీ విషయంలో భారత్​ చైనాను ఢీకొట్టి మెరుగైన స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

Microsoft Surface: మైక్రోసాఫ్ట్ సర్ఫేస్‌ ఈవెంట్‌.. సరికొత్త ఆవిష్కరణలు.. అద్భుతమైన ఫీచర్లు

డీక్యూఎల్​ ర్యాంకింగ్​పై సర్ఫ్‌షార్క్ సీఈఓ వైతాటాస్ కజియుకోనిస్ మాట్లాడుతూ ‘‘భారత్​కు సరిహద్దుగా ఉన్న బంగ్లాదేశ్‌తో పోలిస్తే నాలుగు డిజిటల్ పారామీటర్లలో భారత్​ మెరుగ్గా ఉంది. ఒక్క ఈ–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ర్యాంకింగ్​ విషయంలో తప్ప మిగతా అన్ని పారామీటర్స్​లో బంగ్లాదేశ్​ కంటే మెరుగైన స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్​లో భారత్​ ప్రపంచ సగటు కంటే 30% తక్కువకు పడిపోయింది” అని చెప్పారు.

Redmi 9 Activ: సైలెంట్‌గా స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన రెడ్‌మీ... ఫీచర్స్ ఇవే

భారత్​లో సరాసరి డేటా వేగం 12.33 Mbps గా నమోదైంది. మరోవైపు, ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్యలో భారత్​ 95వ స్థానంలో ఉంది. ఈ సంఖ్య ప్రపంచ సగటు ఇంటర్నెట్​ వినియోగం కంటే తక్కువనే చెప్పవచ్చు. అయితే కోవిడ్-19 లాక్​డౌన్​ సమయంలో ఇంటర్నెట్​ వినియోగం పెరిగింది. ప్రతి దేశంలో వర్క్​ ఫ్రమ్​ హోమ్​, ఆన్​లైన్​ క్లాసెస్​ అమలయ్యాయి. తద్వారా గతంతో పోలిస్తే ఇంటర్నెట్​ వినియోగం గణనీయంగా పెరిగింది.

Detel e-bike: రూ.40 వేలకే ఎలక్ట్రిక్ టూవీలర్... డీటెల్ ఈజీ ప్లస్ ఫీచర్స్ ఇవే

* డిజిటల్​ క్వాలిటీలో అమెరికాదే పైచేయి..
సైబర్ సెక్యూరిటీ సంస్థ సర్ఫ్‌షార్క్ డీక్యూల్​ ర్యాంకింగ్​ను ప్రకటించడం వరుసగా ఇది మూడో సారి. భారత్​తో సహా ఇతర దేశాలు డిజిటల్‌ విప్లవంలో ఎలా రాణిస్తున్నాయో అంచనా వేసేందుకు ఈ అధ్యయనాన్ని చేపట్టింది. డిజిటల్ పురోగతి దేశ శ్రేయస్సుపై ఎలా ప్రభావం చూపుతుంది? ఎలా మెరుగుపర్చుకోవాలి? అనే విషయాలపై సమగ్రంగా విశ్లేషణ అందించింది.

ఈ DQL ర్యాంకింలో డెన్మార్క్​ వరుసగా రెండోసారి 1 వ స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా రెండో స్థానంలో, ఫిన్లాండ్ 3 వ స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్, యుఎస్, ఇథియోపియా, కంబోడియా, కామెరూన్, గ్వాటెమాల, అంగోలా దేశాలు వరుసగా చోటు దక్కించుకున్నాయి. ఇక, డిటిటల్ క్వాలిటీలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఆసియాలో దక్షిణ కొరియా అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
Published by:Shiva Kumar Addula
First published: