హోమ్ /వార్తలు /జాతీయం /

బార్డర్‌లో టెన్షన్...ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు మంగళవారం సెలవు

బార్డర్‌లో టెన్షన్...ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు మంగళవారం సెలవు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India-Pakistan Tension | భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండడంతో పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి 5 కిలో మీటర్ల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు మంగళవారం సెలవు ప్రకటించారు.

    భారత్-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు తొలగకపోవడంతో నియంత్రణ రేఖ వెంబడి గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. పాకిస్థాన్ రేంజర్లు ఎప్పుడు ఎక్కడ తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తారోనని దినదినగండంగా గడుపుతున్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన జరిగిననాటి నుంచి నియంత్రణ రేఖ వెంబడి గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులే గడుపుతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దాడుల అనంతరం ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పాక్ రేంజర్లు భారత సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరుపుతూ, మోటార్ షెల్స్ దాడులతో విరుచుకపడుతున్నారు.


    పాకిస్థాన్‌కి చెందిన డ్రోన్‌ను రాజస్థాన్‌లో భారత వైమానిక దళం కూల్చివేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండడంతో పూంచ్ జిల్లాలో  నియంత్రణ రేఖ వెంబడి ఐదు కిలో మీటర్ల పరిధిలో గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించాయి. అయితే 12వ తరగతి వార్షిక పరీక్షలు యధాతథంగా జరుగుతాయని, విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాలని పూంచ్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

    First published:

    Tags: India VS Pakistan, Indian Air Force, Jammu and Kashmir, Pulwama Terror Attack

    ఉత్తమ కథలు