భార‌త్‌, పాక్ విదేశాంగ మంత్రుల భేటీ ఖ‌రారు

ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశాల సంద‌ర్భంగా భార‌త్‌, పాక్ విదేశాంగ మంత్రుల స‌మావేశం జ‌ర‌గ‌నుంది. భార‌త్‌తో మ‌ళ్లీ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌ధాని మోడీకి పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాసిన నేప‌థ్యంలో ఈ భేటీ ఖరారు కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

news18-telugu
Updated: September 20, 2018, 9:23 PM IST
భార‌త్‌, పాక్ విదేశాంగ మంత్రుల భేటీ ఖ‌రారు
ఇమ్రాన్ ఖాన్, మోదీ(File)
  • Share this:
భార‌త్‌, పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రులు వ‌చ్చే వారం భేటీ కాబోతున్నారు. ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశాల్లో భాగంగా న్యూయార్క్‌లో ఈ భేటీ జ‌ర‌గ‌నుంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్ర‌తినిధి రావేశ్ కుమార్ ధృవీక‌రించారు.అయితే ఇందుకు సంబంధించి తేదీ, స‌మ‌యం ఇంకా ఖ‌రారు కాలేద‌ని తెలిపారు.

ఇది కేవ‌లం స‌మావేశం మాత్ర‌మే అని, ఇవి చ‌ర్చ‌లు కావ‌ని విదేశాంగ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఎజెండాను ఇంకా ఖరారు చేయ‌లేద‌ని వెల్ల‌డించింది. ఈ స‌మావేశం వ‌ల్ల పాకిస్థాన్ విష‌యంలో త‌మ విధానం మారిన‌ట్టు అనుకోవాల్సి అవ‌స‌రం లేద‌ని రావేశ్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

భార‌త్‌తో కాశ్మీర్, ఉగ్ర‌వాదం స‌హా అనేక అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని పాకిస్థాన్ కొత్త ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి లేఖ రాశారు. ఈ నేప‌థ్యంలో ఈ స‌మావేశం ఏర్పాటు కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. 2015లో ఇరు దేశాల మ‌ధ్య ధ్వైపాక్షిక చ‌ర్చ‌లు ఆగిపోయిన నేప‌థ్యంలో... ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మ‌ధ్య స‌మావేశంలో మ‌ళ్లీ చ‌ర్చ‌ల‌కు సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుందా అని ఆస‌క్తి నెల‌కొంది.
Published by: Kishore Akkaladevi
First published: September 20, 2018, 9:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading