INDIA PAKISTAN EXCHANGE LISTS OF NUCLEAR FACILITIES AND INDIA CHINA EXCHANGE SWEETS ON NEW YEAR DAY MKS
New Year 2022: గేరు మార్చిన భారత్.. పాకిస్తాన్కు అణు కేంద్రాల జాబితా.. చైనాకు స్వీట్లు..
పాక్, చైనాతో భారత్ దౌత్యం
ఉగ్రవాదుల కార్ఖానాగా పాకిస్తాన్ ను ప్రపంచ వేదికలపై ఎండగట్టినా.. చైనా చేతిలో భారత సైనికులు చనిపోయినా ఇంచు భూమిని కూడా లాక్కోలేదన్నా.. ఏళ్లపాటు కొనసాగిన ఉద్రిక్తతలకు తెర దించేసి ప్రయత్నంగా భాతర్ తనదైన వ్యూహాలను అనుసరిస్తున్నది. కొత్త ఏడాది తొలిరోజే..
పొరుగు దేశాలతో దౌత్య నీతికి సంబంధించి భారత్ గేరు మార్చింది. దాయాది పాకిస్తాన్, డ్రాగన్ చైనా దేశాల పట్ల అనూహ్య విధానాలను అవలంభిస్తున్నది. ఉగ్రవాదుల కార్ఖానాగా పాకిస్తాన్ ను ప్రపంచ వేదికలపై ఎండగట్టినా.. చైనా చేతిలో భారత సైనికులు చనిపోయినా ఇంచు భూమిని కూడా లాక్కోలేదన్నా.. ఏళ్లపాటు కొనసాగిన ఉద్రిక్తతలకు తెర దించేసి ప్రయత్నంగా భాతర్ తనదైన వ్యూహాలను అనుసరిస్తున్నది. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పుల విరమణకు ఏడాది కావొస్తుండటం, డ్రాగన్ తో విభేదాలు సైతం ప్రస్తుతానికి క్షీణదశకు చేరిన దరిమిలా కొత్త ఏడాది ప్రారంభాన్ని భారత్ ఘనంగా మొదలుపెట్టింది. పాకిస్తాన్ కు కీలక పత్రాలను, చైనాతో స్వీట్లను ఇచ్చిపుచ్చుకుంది. వివరాలివి..
కొత్త ఏడాది తొలి రోజైన శనివారం భారత్-పాకిస్తాన్, భారత్-చైనా సరిహద్దుల్లో అనూహ్య దృశ్యాలు చోటుచేసుకున్నాయి. గడిచిన ఐదారేళ్లలో పెద్దగా కనిపించని సఖ్యత ఇరు దేశాల సైన్యాల మధ్య కనిపించింది. భారత్-పాకిస్తాన్లు శనివారం తమ అణుకేంద్రాలు, ఖైదీల వివరాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇరు దేశాలు ఒకరి అణు కేంద్రంపై మరొకరు దాడులు చేయకుండా 31 ఏళ్ల క్రితం జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఈ ఏడాది కూడా ఇరు దేశాలు కొనసాగించాయి.
ఒకరి జైళ్లలో మగ్గుతున్న మరో దేశపు ఖైదీల వివరాలను కూడా భారత్, చైనా చేతులు మార్చుకున్నాయి. భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ పునరుద్ధరణ జరిగి వచ్చే నెలకు ఏడాది పూర్తి కానుండటంతో కశ్మీర్లోని పూంఛ్ జిల్లా వాస్తవాధీన రేఖ(ఎల్ఓసీ) వద్ద ఇరు దేశాల బలగాలు మిఠాయిలు పంచుకున్నాయి. మరోవైపు
కొత్త ఏడాది సందర్భంగా సరిహద్దుల వద్ద భారత్, చైనా బలగాలు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నాయి. తూర్పు లదాక్ లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన 18 నెలల తర్వాత రెండు దేశాల సైనికులూ తొలిసారిగా మిఠాయిలు పంచుకున్నాయి. రెండేళ్ల కిందట గాల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలో భారత జవాన్లు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. నేటికీ డ్రాగన్ దూకుడు కొనసాగిస్తూ, వీలైన చోటల్లా ఆక్రమణకు ప్రయత్నిస్తున్నట్లు తరచూ వార్తలు వస్తుంటాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆక్రమణలను ధృవీకరించడంలేదు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.