Top 10 most polluted countries : దేశంలో కాలుష్య పరిస్థితులు నానాటికీ మరింత దిగజారుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ సహా ఉత్తర భారతంలో కాలుష్య స్థాయిలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. భారత్ లో కాలుష్యం గతంతో పోలిస్తే కొంత మెరుగుపడిందని స్విస్ ఐక్యూఎయిర్ తాజాగా విడుదల చేసిన "ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2022(World air quality report 2022)" తెలిపింది. SWISS సంస్థ IQAir "వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2022 ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారతదేశం 8వ స్థానంలో నిలిచింది. అయితే గతంలోని 5వ స్థానం నుండి తాజాగా 8వ స్థానానికి పడిపోయిన కారణంగా భారతదేశం తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంది. ఇక,అత్యంత కాలుష్య నగరాల జాబితాలో 50 నగరాల్లో 39 భారతదేశంలో ఉన్నాయి. 30,000 గ్రౌండ్ ఆధారిత మానిటర్ల ఆధారంగా 131 దేశాల నుండి డేటాను సమగ్రపరచిన తర్వాత సంస్థ తన నివేదికను విశ్లేషించింది.
ఈ రిపోర్ట్ ప్రకారం..చాద్, ఇరాక్, పాకిస్థాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, బుర్కినా ఫాసో, కువైట్, ఇండియా, ఈజిప్ట్ మరియు తజికిస్థాన్ టాప్ 10 అత్యంత కాలుష్య దేశాలుగా ఉన్నాయి. కాగా ఆస్ట్రేలియా, ఎస్టోనియా, ఫిన్లాండ్, గ్రెనడా, ఐస్లాండ్ మరియు న్యూజిలాండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)నిర్థేశించిన PM2.5 గైడ్ లైన్ ని మీట్ అయ్యాయి (వార్షిక సగటు 5 Aug/m3 లేదా అంతకంటే తక్కువ).
అమ్మ బాబోయ్ : నీలి తిమింగలం గుండె బరువు 181 కిలోలు..3 కి.మీ దూరం నుండి హార్ట్ బీట్ వినిపిస్తది!
వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2022 భారతదేశం గురించి ఏమి వెల్లడిస్తుంది
భారతదేశంలో..PM2.5 కాలుష్యంలో దాదాపు 20-35 శాతం రవాణా రంగం కాంట్రిబ్యూట్ చేస్తుంది. పారిశ్రామిక యూనిట్లు, బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు మరియు బయోమాస్ దహనం వంటివి గాలి నాణ్యతను దిగజార్చడానికి ఇతర వనరులు.
ప్రపంచంలోని టాప్ 50 అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ 4వ స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ లోని లాహోర్ అత్యంత కాలుష్య నగరంగా ఉండగా, చైనాలోని హోటాన్ రెండవ స్థానంలో ఉంది. రాజస్థాన్‌లోని భివాడి మూడో స్థానంలో ఉంది. ఢిల్లీ పీఎం2.5 స్థాయి సురక్షిత పరిమితి కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువని నివేదిక పేర్కొంది. ఢిల్లీ ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఉంది మరియు నివేదిక 'గ్రేటర్' ఢిల్లీ మరియు న్యూఢిల్లీ రాజధాని మధ్య తేడాను చూపింది. రెండూ టాప్ 10లో ఉన్నాయి. గత సంవత్సరాల్లో నమోదైన సగటు PM2.5 స్థాయిలతో పోలిస్తే గురుగ్రామ్‌లో 34 శాతం క్షీణతతో ఫరీదాబాద్‌లో 21 శాతానికి తగ్గిందని నివేదిక పేర్కొంది. ఢిల్లీ ఎనిమిది శాతం క్షీణించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Air Pollution, Delhi pollution, Pollution