ఇండియా నేపాల్ బంధాన్ని ఎవరూ విడదీయలేరు.. రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు

సోమవారం ఓ వర్చువల్‌ ర్యాలీలో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్.. ఇరు దేశాల మధ్య ఏవైనా అపార్థాలు ఉంటే చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: June 15, 2020, 2:23 PM IST
ఇండియా నేపాల్ బంధాన్ని ఎవరూ విడదీయలేరు.. రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
రాజ్‌నాథ్ సింగ్
  • Share this:
ఇండియా, నేపాల్ మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా తమ ప్రాంతాలుకుగా పేర్కొంటూ కొత్త మ్యాప్ విడుదల చేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ క్రమంలో నేపాల్‌తో ఉన్న సంబంధాలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా-నేపాల్ బంధం ‘రోటీ - బేటీ’ లాంటిదని.. దీన్ని ప్రపంచంలో ఏ శక్తీ విచ్ఛిన్నం చేయలేదని వ్యాఖ్యానించారు. సోమవారం ఓ వర్చువల్‌ ర్యాలీలో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్.. ఇరు దేశాల మధ్య ఏవైనా అపార్థాలు ఉంటే చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.


నేపాల్‌తో సామాజిక, భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలే కాకుండా ఆధ్యాత్మిక బంధం కూడా ఉంది. నేపాల్‌ పట్ల భారతీయుల్లో ఎలాంటి చేదుభావం లేదు. రహదారి నిర్మాణం విషయంలో నేపాల్‌లో కొంత అపార్థం నెలకొంది. లిపూలేఖ్‌ కనుమ ప్రాంతంలో బీఆర్‌వో నిర్మిస్తున్న రహదారి చాలా వరకు భారత సరిహద్దులోనే ఉంది. భారత్‌ - నేపాల్‌ మధ్య బంధం ఎంతో అసాధారణమైనది. ఈ సమస్యను సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందాం.
రాజ్‌నాథ్ సింగ్


భారత భూభాగాలైన లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ ఇటీవల నేపాల్ కొత్త మ్యాప్ తీసుకొచ్చింది. దానికి నేపాల్ పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. నేపాల్ కొత్త మ్యాప్‌లో ఏడు ప్రావిన్స్‌లు, 77 జిల్లాలు, 753 స్థానిక పరిపాలన డివిజన్లు పొందుపరిచారు. అందులో లింపియాధురా, కాలాపాని, లిపు లేక్ కూడా ఉన్నాయి. లిపు లేక్ పాస్ అనేది కాలాపానిలో ఓ భాగం. 2019 నవంబర్‌లో భారత్ విడుదల చేసిన అధికారిక మ్యాప్‌లో దాన్ని భారత భూభాగంగా చూపింది. దీనిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాలాపాని అనేది ఉత్తరాఖండ్‌లోని పితోర్ గఢ్ జిల్లాలో భాగమని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు నేపాల్ మాత్రం కాలాపాని అనేది ధార్చులా జిల్లాలో భాగం అని పేర్కొంది.
First published: June 15, 2020, 2:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading