Home /News /national /

INDIA MILITARY PROWESS DISPLAYED IN REPUBLIC DAY 2022 PARADE AT RAJPATH PREZ KOVIND PM MODI IN ATTENDANCE MKS

Republic Day 2022: భారత సైనిక శక్తి ప్రదర్శన.. ఘనంగా గణతంత్ర పరేడ్.. విశేషాలివే..

రిపబ్లిక్ డే పరేడ్

రిపబ్లిక్ డే పరేడ్

భారత 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గ్రామల్లోని గల్లీలు మొదలుకొని ఢిల్లీ రాజ్ పథ్ వరకు జాతీయ పండుగ సంబురాలు మిన్నంటేలా జరుగుతున్నాయి. ప్రధాన వేడుకలా భావించే రిపబ్లిక్ డే పరేడ్ లో భారత సైనిక శక్తి పాటవ ప్రదర్శన ఆకట్టుకుంది.

ఇంకా చదవండి ...
భారత 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గ్రామల్లోని గల్లీలు మొదలుకొని ఢిల్లీ రాజ్ పథ్ వరకు జాతీయ పండుగ సంబురాలు మిన్నంటేలా జరుగుతున్నాయి. ప్రధాన వేడుకలా భావించే రిపబ్లిక్ డే పరేడ్ లో భారత సైనిక శక్తి పాటవ ప్రదర్శన ఆకట్టుకుంది. రాజ్ పథ్ వద్ద బుధవారం ఉదయం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం రాష్ట్రపతితోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీలు రిపబ్లిక్ డే వేడుకలను ప్రారంభించారు.

రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా దేశంలో విశిష్ఠ సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలను ప్రదానం చేశారు. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్మూకశ్మీర్ ఏఎస్ఐ బాబురామ్ కు అశోక్ చక్ర పురస్కారాన్ని ఆయన కుటుంబసభ్యులకు రాష్ట్రపతి అందజేశారు.



రాజ్ పథ్ లో గణతంత్ర పరేడ్ ఘనంగా జరిగింది. ఈ పరేడ్ దేశ సైనిక సామర్థ్యాన్ని చెప్పేలా ఘనంగా సాగింది. భారత వాయుసేన విన్యాసాలు, వివిధ రాష్ట్రాల శకటాలతో పరేడ్ సాగింది.



గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. వార్ మెమోరియల్ వద్ద సందర్శకుల సందర్శకుల పుస్తకంలో ప్రధాని మోదీ సంతకం చేశారు.



భారత్ స్వాతంత్రం పొంది 75ఏళ్లవుతున్న(ఆజాదీ కా అమృత్ ఉత్సవం) సందర్భంగా ఈ ఏడాది కవాతు నిర్వహించారు.గణతంత్ర వేడుకల్లో భాగంగా సైనిక సామర్థ్యం, సాంస్కృతిక వైవిధ్యంతో ప్రదర్శనలు చేశారు.



విజయ్‌చౌక్‌ నుంచి నేషనల్ స్టేడియం వరకూ రాజ్‌పథ్‌లో సాగే పెరేడ్‌లో మన ఆయుధ సంపత్తిని చాటి చెప్పేలా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల కవాతు జరిగింది. త్రివిధ దళాల్లోని వివిధ విభాగాలు ప్రత్యేక ప్రదర్శనతో పరేడ్ ఆద్యాంతం ఆకట్టుకుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Pm modi, Republic Day 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు