హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

India Map: ఈ లొకేషన్ అచ్చం ఇండియా మ్యాప్‌లా ఉంది కదా? హైదరాబాద్ నుంచి ఎంత దూరమంటే..

India Map: ఈ లొకేషన్ అచ్చం ఇండియా మ్యాప్‌లా ఉంది కదా? హైదరాబాద్ నుంచి ఎంత దూరమంటే..

ఇండియా మ్యాప్‌లా కనిపిస్తున్న ప్రాంతం

ఇండియా మ్యాప్‌లా కనిపిస్తున్న ప్రాంతం

India Map: ఇండియా మ్యాప్‌లా ఉండే ఈ లొకేషన్ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఇక్కడికి వెళ్లాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి దాదాపు 2,100 కి.మీ. దూరంలో ఉంటుంది.

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

భారత దేశం ఎన్నో సంస్కృృతి సంప్రదాయాలకు నిలయం. భాషలు వేరైనా, ఆహారం వేరైనా, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉన్నా..భారతీయులంతా అందరూ ఒక్కటిగా ఉంటారు. అందుకే ఈ భూప్రపంచంలో 'భిన్నత్వంలో ఉన్న ఏకత్వం' ఉన్న ఏకైక దేశం మన భారత దేశమే. ఇలా మనదేశానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు దాగుతున్నాయి. అందులో మనకు కొన్ని మాత్రమే తెలుసు. తెలియనివి చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఓ అద్భుతమైన విషయం గురించి ఇవాళ తెలుసుకుందాం. భారత దేశంలో భారత దేశం కనిపించే ప్రదేశం ఒకటుందని మీకు తెలుసా? భారతంలో భారత దేశం కనిపించడమేంటి? దేశంలో ఎక్కడికి వెళ్లినా అది ఇండియానే కదా.. ఇదేం పిచ్చి ప్రశ్నని అనుకోవద్దు. మేం చెబుతుంది.. ఇండియా మ్యాప్ గురించి. అచ్చం ఇండియా మ్యాప్‌లా కనిపించే ప్రదేశం మన దేశంలో ఉంది.

Photos : వామ్మో.. ఇవేం పేర్లు.. ఇలాంటి రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయా?

అవును.. ఇండియా భౌగోళిక పటంలా కనిపించే ఓ ప్రాంతం అస్సాం ఉంది. ఇది రెండు నదుల సంగమం వద్ద కనిపిస్తుంది. అస్సాం బొంగైగావ్‌లో ఈ అద్భుత దృశ్యాన్ని చూడవచ్చు. బొంగైగావ్ (Bongaigaon) నగరం గౌహతి (Guwahati) నుంచి దాదాపు 180 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ బాగేశ్వరి ఆలయం, రాక్ కట్ కేవ్ వంటి అనేక ప్రసిద్ధ విషయాలు ఉన్నాయి. అయితే వీటన్నింటికంటే ప్రత్యేకత ఏంటంటే. ఇక్కడ ఇండియా మ్యాప్ కనిపించే ప్రదేశం ఉండడం..! ఈ నగరం సమీపంలో బ్రహ్మపుత్ర నది, చంపావతి నది కలుస్తాయి. ఈ సంగమ ప్రదేశంలో ఒక ల్యాండ్ బ్లాక్ సరిగ్గా ఆండియా మ్యాప్ లాగా కనిపిస్తుంది.

రెండు నదుల సంగమ ప్రాంతం ఇండియా ద్వీపకల్పంలోని దిగువ భాగంలా కనిపిస్తుంది. అంతేకాదు మన మ్యాప్‌లో పై భాగంలో హిమాలయ పర్వతాలు ఉన్నట్లుగానే.. ఇక్కడ కూడా పైభాగంలో ఎత్తైన పర్వత శ్రేణి కనిపిస్తుంది. అందుకే ఇండియా మ్యాప్‌గా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.

ఇండియా మ్యాప్‌లా ఉండే ఈ లొకేషన్ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఇక్కడికి వెళ్లాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి దాదాపు 2,100 కి.మీ. దూరంలో ఉంటుంది. నగరం నుంచి గౌహతికి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు సికింద్రాబాద్ నుంచి గౌహతి వరకు రైళ్లు కూడా నడుస్తాయి. అక్కడి వరకు విమానం లేదా రైలు వెళ్లాలి. అనంతరం  రోడ్డు మార్గంలో బొంగైగావ్ చేరుకోవచ్చు. అక్కడ బ్రహ్మపుత్ర, చంపావతి సంగమం వద్ద ఈ అద్భుతమైన ప్రకృతి సోయగాన్ని వీక్షించవచ్చు.

First published:

Tags: Assam, Local News

ఉత్తమ కథలు