Home /News /national /

INDIA MAN WINS 22 YEAR COURT BATTLE AGAINST RAILWAYS OVER 20 RUPEES PVN

Intresting : 20 రూపాయల కోసం 22 ఏళ్ల పాటు రైల్వేపై పోరాటం..చివరికి దక్కింది రూ.73!

 తుంగనాథ్ చతుర్వేది

తుంగనాథ్ చతుర్వేది

UP man wins court battle against railways : రైల్వే టిక్కెట్‌ ను ఎక్కువ రేటుకి అమ్మిన కేసులో భారతీయ రైల్వే(Indian Railway)పై 22 ఏళ్ల పాటు పోరాటం చేసి గెలిచాడు ఓ వ్యక్తి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
UP man wins court battle against railways : రైల్వే టిక్కెట్‌ ను ఎక్కువ రేటుకి అమ్మిన కేసులో భారతీయ రైల్వే(Indian Railway)పై 22 ఏళ్ల పాటు పోరాటం చేసి గెలిచాడు ఓ వ్యక్తి. ఇన్నేళ్ల పాటు తన డబ్బుల కోసం పోరాటం చేసి విజయం సాధించిన అతడిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే అతడు తిరిగి పొందిన డబ్బుల గురించి మాత్రం నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

అసలేం జరిగిందంటే

1999లో ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని మధుర కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో తుంగనాథ్ చతుర్వేది(Tungnath Chaturvedi) అనే న్యాయవాది మరో వ్యక్తితో కలిసి మొరాదాబాద్‌కు వెళ్లేందుకు రెండు టిక్కెట్లను కౌంటర్ లో కొనుగోలు చేశాడు. టిక్కెట్ల ధర ఒక్కొక్కటి 35 రూపాయలు. అయితే తుంగనాథ్ చతుర్వేది 100 రూపాయలు ఇచ్చినప్పుడు క్లర్క్ 10 రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చాడు. రెండు టిక్కెట్లపై రూ. 20 అదనంగా వసూలు చేశాడు క్లర్క్. తనపై ఎక్కువ ఛార్జీ విధించినట్లు క్లర్క్‌తో చతుర్వేది చెప్పాడు. కానీ ఆ సమయంలో చతుర్వేదికి ఎలాంటి వాపసు రాలేదు. ఇంతలో ట్రైన్ రావడంతో వెళ్లిపోయాడు చతుర్వేది. ఆ తర్వాత చతుర్వేది రైల్వేపై,బుకింగ్ క్లర్క్‌పై మధురలోని వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. ఈ కేసుకు సంబంధించి నేను 100 కంటే ఎక్కువ విచారణలకు హాజరయ్యాను అని 66 ఏళ్ల చతుర్వేది తెలిపారు. ఈ కేసులో వినియోగదారుల న్యాయస్థానం గత వారం చతుర్వేదికి అనుకూలంగా తీర్పునిచ్చింది. వడ్డీతో సహా మొత్తాన్ని తిరిగి చెల్లించాలని రైల్వేని కోరింది. సుదీర్ఘ పోరాటం తర్వాత అతనికి రూ. 15,000 రూపాయలు జరిమానా చెల్లించాలని రైల్వేని కోర్టు ఆదేశించింది. 1999 నుండి 2022 వరకు అతనికి సంవత్సరానికి 12% వడ్డీతో కలిపి 20 రూపాయలను వాపసు చేయాలని రైల్వేని కోర్టు ఆదేశించింది. అంటే 20 రూపాయలను రూ.73 రూపాయల వడ్డీతో కలిపి మొత్తంగా రూ.93 చెల్లించాలని కోర్టు రైల్వేని ఆదేశించింది. 30 రోజుల నిర్ధిష్ట సమయంలో చెల్లించకపోతే 15 శాతంతో వడ్డీతో చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Shocking : అరుంధతి సినిమా చూసి తనను తాను తగలబెట్టుకున్న యువకుడు..ఎందుకో తెలిస్తే షాక్!



తనకు లభించిన పరిహారం చాలా తక్కువ అని, ఈ కేసు తనకు కలిగించిన మానసిక వేదనను అది తీర్చలేదని తుంగనాథ్ చతుర్వేది తెలిపారు. "ఇది ముఖ్యంగా డబ్బు కోసం కాదు. ఇది న్యాయం కోసం పోరాటం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం, కాబట్టి ఇది విలువైనది. నేను స్వయంగా న్యాయవాదిని కాబట్టి, నేను న్యాయవాదికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు లేదా కోర్టుకు వెళ్లడానికి అయ్యే ఖర్చును భరించాల్సిన అవసరం లేదు. లేకుంటే అది చాలా ఖరీదైనది కావచ్చు" అని చతుర్వేది చెప్పారు. ఇది సమయం వృధా పని అని ఈ కేసుని కొనసాగించకుండా చాలాసార్లు నిరోధించడానికి కుటుంబసభ్యులు ప్రయత్నించారని,కానీ తాను మాత్రం పట్టు వీడలేదని చతుర్వేది తెలిపారు. పోరాటం కఠినంగా కనిపించినా వదులుకోవాల్సిన అవసరం లేదని, తన కేసు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నానని తుంగనాథ్ చతుర్వేది తెలిపారు. భారతదేశంలో న్యాయవ్యవస్థ నెమ్మదిగా పని చేయడం వల్లే తనకు సంవత్సరాలు పట్టిందని తుంగనాథ్ చతుర్వేది అన్నారు. "రైల్వేకు వ్యతిరేకంగా ఫిర్యాదులను రైల్వే ట్రిబ్యునల్‌కు పరిష్కరించాలని, వినియోగదారుల కోర్టుకు కాదని రైల్వే కూడా కేసును కొట్టివేయడానికి ప్రయత్నించింది" అని చతుర్వేది అన్నారు. రైల్వే క్లెయిమ్ ట్రిబ్యునల్ అనేది భారతదేశంలో రైలు ప్రయాణానికి సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించడానికి ఏర్పాటు చేయబడిన పాక్షిక-న్యాయ సంస్థ. కానీ తాను 2021 సుప్రీం కోర్ట్ తీర్పును వినియోగదారుల కోర్టులో విచారించవచ్చని నిరూపించడానికి ఉపయోగించినట్లు చతుర్వేది చెప్పారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Indian Railway, Indian Railways

తదుపరి వార్తలు