Home /News /national /

INDIA LONGEST TRAIN ROUTE COVERS MORE THAN 4000 KM IN 80 HOURS UMG GH

India's Longest Train Route: వెరీ ఇంట్రెస్టింగ్.. 4 వేల కిలోమీటర్లు ప్రయాణించే రైలు.. ఇండియా లాంగెస్ట్ రూట్ ఏదంటే..?

భారతదేశంలో పొడవైన రైలు మార్గం

భారతదేశంలో పొడవైన రైలు మార్గం

ఇండియన్‌ రైల్వే(Indian Railway)కు చెందిన విషయాలు అందరికీ చాలా ఆసక్తి కలిగిస్తాయి. ఈ రైళ్ల ప్రస్థానం సుదీర్ఘమైంది. ఒకప్పుడు ఇవి ఆవిరి యంత్రాలతో నడిచేవి. ప్రస్తుతం పొడవైన రైలు మార్గం గురించి తెలుసుకోండి.

ఇండియన్‌ రైల్వే(Indian Railway)కు చెందిన విషయాలు అందరికీ చాలా ఆసక్తి కలిగిస్తాయి. ఈ రైళ్ల (Trains) ప్రస్థానం సుదీర్ఘమైంది. ఒకప్పుడు ఇవి ఆవిరి యంత్రాలతో నడిచేవి. కొన్ని ప్రాంతాల్లో రైలు ప్రయాణాలు ప్రజల దైనందన జీవితంలో భాగంగా ఉంటాయి. అలాంటి రైళ్లకు సంబంధించిన వివరాలు అందరినీ ఆలోచింపజేస్తాయి. ఇండియన్‌ రైల్వేకు సంబంధించి చాలా ఆసక్తికర అంశాలు ఉండగా.. ప్రస్తుతం పొడవైన రైలు మార్గం గురించి తెలుసుకోండి.

* భారతీయ రైల్వే వాస్తవాలు(Indian Railway Facts)
భారతీయ రైల్వేకు 168 సంవత్సరాల చరిత్ర ఉంది. 2021 సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా 1,26,611 కి.మీ ట్రాక్‌లతో ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఇండియా నిలిచింది. ఈ విస్తారమైన రైలు నెట్‌వర్క్‌ను 17 జోన్‌లుగా విభజించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. భారతీయ రైల్వేలు 2020-21 నుంచి ప్రతిరోజూ 3.43 మిలియన్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.

ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్లు అన్నింటికీ ఇక టైప్ C ఛార్జరే.. మరి ఐ ఫోన్‌కు యూజర్ల పరిస్థితి ఏంటంటే..?


* భారతదేశంలో పొడవైన రైలు మార్గం?
దిబ్రూఘర్ నుంచి కన్యాకుమారి మధ్య ఉన్న రైలు మార్గం భారతదేశంలోని అతి పొడవైన రైలు మార్గం(Longest Route). ప్రపంచంలోని పొడవైన మార్గాలలో కూడా స్థానం దక్కించుకుంది. ఈ మార్గంలో ప్రయాణించే వారికి చక్కని అనుభూతులు దక్కుతాయి. విభిన్న వాతావరణాలు, భూభాగాలు, భాషా ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తూ వివిధ సంస్కృతులను స్వయంగా ఆస్వాధించే అవకాశం కలుగుతుంది.

వివేక్ ఎక్స్‌ప్రెస్ భారతదేశంలోని అతి పొడవైన రైల్వే మార్గాన్ని కవర్ చేస్తుంది. సుమారు 55 షెడ్యూల్ స్టాప్‌లతో 80 గంటల 15 నిమిషాల్లో పట్టాలపై 4,273 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది భారతదేశంలోని ప్రధాన భూభాగం ఉత్తర కొనను, తమిళనాడులోని కన్యాకుమారి(CAPE), ఈశాన్యంలో అస్సాంలోని డిబ్రూఘర్(DBRG)ని కలుపుతుంది. తిరుగు ప్రయాణంలో కూడా అదే మార్గంలో ప్రయాణిస్తుంది. 2013లో స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు సిరీస్ నవంబర్ 2011లో ప్రారంభమైంది. COVID-19ని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 2020 మార్చిలో ప్రకటించబడినప్పుడు, కార్యకలాపాలు ఆపేసిన చివరి రైలు ఇదే కావడం గమనార్హం.టిన్సుకియా, దిమాపూర్, గౌహతి, బొంగైగావ్, అలీపుర్‌దువార్, సిలిగురి, కిషన్‌గంజ్, మాల్దా, రాంపూర్‌హాట్, పాకూర్, దుర్గాపూర్, అసన్‌సోల్, ఖరగ్‌పూర్, బాలాసోర్, కటక్, భువనేశ్వర్, ఖోర్ధా, బ్రహ్మపూర్‌, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రీ, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, వేలూరు, సేలం, ఈరోడ్‌, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం, కొట్టాయం, చెంగన్నూర్, కొల్లాం, తిరువనంతపురం, నాగర్‌కోయిల్ స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తుంది.

* ప్రపంచంలోనే అతి పొడవైన రైలు మార్గం
ప్రపంచంలోనే అతి పొడవైన రైలు మార్గం, ప్రపంచంలోని అతిపెద్ద దేశమైన రష్యాలో ఉంది. రైలు ప్రయాణం ఆరు రోజులు పడుతుంది. ఇది పశ్చిమ రష్యాను దేశం తూర్పు వైపునకు కలుపుతుంది. మాస్కోలో ప్రయాణాన్ని ప్రారంభించి, ఆరు రోజుల తర్వాత దాదాపు 9,250 కిలోమీటర్ల తర్వాత వ్లాడివోస్టాక్‌కు చేరుకుంటారు. భారతదేశం పొడవైన రైలు మార్గంతో పోల్చినప్పుడు ఇది 4977 కి.మీ పొడవు అంటే రెట్టింపు కంటే ఎక్కువ.
Published by:Mahesh
First published:

Tags: Bullet Train, Indian Railways, Special Trains, Train

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు