హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Covid-19 Cases: మళ్లీ కరోనా అలర్ట్.. భారీగా పెరుగుతున్న కేసులు.. కారణం ఇదే..!

Covid-19 Cases: మళ్లీ కరోనా అలర్ట్.. భారీగా పెరుగుతున్న కేసులు.. కారణం ఇదే..!

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు (Image: Shutter Stock)

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు (Image: Shutter Stock)

భారతదేశంలో గత 24 గంటల్లో 4.85 శాతం పాజిటివ్‌ రేటుతో 16,135 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. జులై 3 (ఆదివారం)తో ముగిసిన వారంలో నాలుగు నెలల్లో అత్యధిక కోవిడ్-19 కేసులు దేశంలో నమోదయ్యాయి.

భారతదేశంలో గత 24 గంటల్లో 4.85 శాతం పాజిటివ్‌ రేటుతో 16,135 కొత్త కరోనా కేసులు (Corona Cases) నమోదయ్యాయి. జులై 3 (ఆదివారం)తో ముగిసిన వారంలో నాలుగు నెలల్లో అత్యధిక కోవిడ్-19 (Covid 19) కేసులు దేశంలో నమోదయ్యాయి. వరదలతో దెబ్బతిన్న అస్సాంలో, రథయాత్ర ఉత్సవాలతో పశ్చిమ బెంగాల్, ఒడిశాలో సహా కొన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత పెరుగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఇంతకుముందు పెరిగిన కేసులు ప్రస్తుతం తగ్గుతున్నాయి. జూన్ 27- జులై 3 వారంలో కనీసం 192 మరణాలు నమోదయ్యాయి, ఇది గత వారంలో 125తో పోలిస్తే 54 శాతం ఎక్కువ.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలపిన వివరాల మేరకు.. భారతదేశంలో 24 గంటల వ్యవధిలో 16,103 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, ఇది ఆదివారం నాటి 17,092 సంఖ్యతో పోలిస్తే తక్కువ. అదే సమయంలో దేశంలో మరో 31 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 5,25,199కి చేరుకుంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా 1,11,711కి పెరిగింది. ఇది దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో 0.26 శాతం. గత 24 గంటల్లో 13,929 మంది రోగులు కోలుకోవడంతో మొత్తం సంఖ్య 4,28,65,519కి చేరుకుంది. భారతదేశం రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. భారతదేశం రోజువారీ పాజిటివిటీ రేటు కూడా స్వల్పంగా 4.27 శాతానికి పెరిగింది, వారపు పాజిటివిటీ రేటు ప్రస్తుతం 3.81 శాతంగా ఉంది.

ఇదీ చదవండి: అమర్ నాథ్ యాత్రలో విషాదం.. కొండ నుంచి 100 అడుగుల కిందకు పడిపోయిన యాత్రికుడు..


* తెలంగాణ

తెలంగాణలో 457 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 8,02,379కి చేరుకుంది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 285 కేసులు నమోదయ్యాయి. 494 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,93,521 అని ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది. రికవరీ రేటు 98.90 శాతంగా ఉంది. అంటు వ్యాధి కారణంగా తాజా మరణాలు సంభవించలేదు. మరణాల సంఖ్య 4,111 వద్ద ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,747గా ఉంది.

* మహారాష్ట్ర

మహారాష్ట్రలో 2,962 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, ఇందులో ముంబైలో 761 కేసులు ఉన్నాయి. ఆరుగురు మృతి చెందారు. వీరిలో ఓమిక్రాన్ BA.4 సబ్-వేరియంట్‌ సోకిన రోగి ఉన్నట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. మహారాష్ట్రలో మొత్తం కేసులు 79,85,296కి, మరణాల సంఖ్య 1,47,940కి పెరిగింది. ఒక రోజు ముందు రాష్ట్రంలో 2,971 కేసులు, ఐదు మరణాలు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పుడు 22,485 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఓమిక్రాన్ BA.4 సబ్-వేరియంట్‌కు చెందిన మరో రోగిని గుర్తించినట్లు హెల్త్ బులెటిన్ తెలిపింది. రాష్ట్రంలో BA.4, BA.5 రోగుల సంచిత సంఖ్య పూణేలో 6415, ముంబైలో 34, నాగ్‌పూర్, థాన, పాల్ఘర్‌లలో ఒక్కొక్కటి చొప్పున నాలుగు, రాయ్‌గడ్‌లో మూడు కేసులు ఉన్నాయి. ముంబైలో 761 తాజా కరోనా కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి, థానే మునిసిపల్ కార్పొరేషన్, పూణే, గడ్చిరోలి జిల్లాల నుంచి ఒక్కో మరణం నమోదైంది. మహారాష్ట్రలో మరణాల రేటు ఇప్పుడు 1.85 శాతంగా ఉంది.

గత 24 గంటల్లో మొత్తం 3,918 మంది రోగులు కరోనావైరస్ నుండి కోలుకున్నారు. మహారాష్ట్రలో మొత్తం రికవరీల సంఖ్య 78,14,871కి చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం కేసుల రికవరీ రేటు 97.87 శాతంగా ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 36,858 పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు పరీక్షించిన నమూనాల సంఖ్య 8,21,19,146కి చేరుకుంది. మహారాష్ట్రలో.. తాజా కేసులు: 2,962, తాజా మరణాలు: 6, క్రియాశీల కేసులు: 22,485, పరీక్షలు: 36,858; మొత్తం కేసులు 79,85,296, మొత్తం మరణాల సంఖ్య 1,47,940.

ఇదీ చదవండి: ఏంటమ్మా.. ప్రాణం అంటే విలువ లేదా.. కదిలే రైలు ముందు దూకిన మహిళ..


* ఢిల్లీ

గత 24 గంటల్లో ఢిల్లీలో తాజా కోవిడ్ కేసులు స్వల్పంగా క్షీణించాయని, అంతకుముందు రోజు 678 ఉండగా 648కి తగ్గాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ ఆరోగ్య బులెటిన్ ప్రకారం ఐదు తాజా కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ పాజిటివిటీ రేటు స్వల్పంగా 4.29 శాతానికి పెరిగింది. క్రియాశీల కేసుల సంఖ్య 3,268 వద్ద ఉంది, అందులో 2,459 మంది హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 785 మంది రోగులు కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,07,474కి చేరుకుంది.

* పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్‌లో 1,822 కొత్త కేసులు నమోదయ్యాయి, రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం 14.10 శాతం పాజిటివ్ రేటు నమోదైంది. మరో ముగ్గురు రోగులు మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,583 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 304 మందిని ఆస్పత్రుల్లో చేర్చాల్సి వచ్చింది. 12,921 నమూనాలను పరీక్షించిన తర్వాత కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,34,485 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 526 మంది సహా మొత్తం 20,02,677 మంది రోగులు కోలుకున్నారు.

ఇదీ చదవండి: దారి తప్పిన మహిళా టీచర్.. స్టూడెంట్ తో ఎఫైర్.. ఎన్నిసార్లు అడిగిన ఆ పనికి వద్దన్నందుకు..


* తమిళనాడు

తమిళనాడులో కొత్త కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 2,672 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో మాల్దీవుల నుండి తిరిగి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ రోజు వరకు మొత్తం కేసుల సంఖ్య 34,82,775 కు చేరుకుందని ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. గత 24 గంటల్లో ఎటువంటి మరణాలు సంభవించలేదు. మరణాల సంఖ్య 38,026గానే ఉంది. గత 24 గంటల్లో 1,487 మంది వైరస్ నుండి కోలుకున్నారు. చెన్నైలో 1,072 కొత్త కేసులు నమోదు కాగా, చెంగల్‌పేట్ 373, కోయంబత్తూర్ 145, తిరువళ్లూరు 131, తిరుచిరాపల్లి 104 ఉన్నాయి. తిరుపత్తూరులో రెండు తాజా కేసులు మాత్రమే ఉన్నాయి.

* గుజరాత్

గుజరాత్‌లో 456 కేసులు నమోదయ్యాయి, ఇది 12,33,698కి చేరుకుంది, అయితే మరణాల సంఖ్య 10,947 వద్ద ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. రికవరీ సంఖ్య పగటిపూట 386 పెరిగి 12,19,203కి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 13,548 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు.

అహ్మదాబాద్‌లో 207 కేసులు నమోదవగా, సూరత్‌లో 97, వడోదరలో 41, భావ్‌నగర్‌లో 15 కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాటి 12,372తో సహా గుజరాత్‌లో ఇప్పటివరకు 11.15 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు వేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ, డామన్, డయ్యూలో రెండు కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి, దాని క్రియాశీల కేసుల సంఖ్య ఏడుకి పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. గుజరాత్‌లో.. పాజిటివ్ కేసులు 12,33,698, కొత్త కేసులు 456, మరణాల సంఖ్య 10,947, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 12,19,203, యాక్టివ్ కేసులు 3,548గా ఉన్నాయి.

* కేరళ

కేరళలో 3,322 తాజా COVID-19 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 66,53,272కి, మరణాల సంఖ్య 70,048కి పెరిగింది. అధికారిక సమాచారం ప్రకారం.. గత 24 గంటల్లో 3,258 మంది వ్యాధి నుండి కోలుకున్నారు. క్రియాశీల కేసులు 28,720కి పెరిగాయి. శనివారం రాష్ట్రంలో 3,642 తాజా కేసులు, తొమ్మిది మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో రోజుకు సగటున 3,000 కేసులు నమోదవుతుండగా, ఈ నెలలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా, మాస్కులు ధరించడం తప్పనిసరి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని పోలీసు శాఖ ఇటీవల అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది.

* ఒడిశా

ఒడిశాలో 346 కేసులు నమోదయ్యాయి, ఇది నాలుగు నెలల్లో అత్యధిక స్పైక్. మొత్తం కేసుల సంఖ్య 12,90,538కి చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఫిబ్రవరి 22న రాష్ట్రంలో 428 కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా మృతుల సంఖ్య 9,126కి చేరుకుంది. రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న ఖుర్దాలో అత్యధికంగా 189 కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత కటక్‌లో 51 కేసులు నమోదయ్యాయి. ఒడిశాలో ఇప్పుడు 1,310 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు మొత్తం 12,80,049 మంది ఈ వ్యాధి నుండి కోలుకున్నారు.

* అస్సాం

అస్సాంలో మరో 110 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, ఇవి నాలుగు నెలల్లో ఒకే రోజులో నమోదైన అత్యధికం కేసులు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 7,25,036కి చేరుకుందని జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) బులెటిన్ ఆదివారం తెలిపింది. వైరస్ కారణంగా తాజా మరణాలు ఏవీ సంభవించలేద. మృతుల సంఖ్య 6,639 వద్ద ఉందిశుక్రవారం 78 మందికి ఇన్‌ఫెక్షన్‌ పాజిటివ్‌గా తేలింది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 7,16,498కి చేరుకుంది. అస్సాంలో ప్రస్తుతం 550 యాక్టివ్ కేసులు ఉన్నాయి, అంతకుముందు రోజు 468 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,83,94,204 పరీక్షలు నిర్వహించగా, శనివారం 1,350 పరీక్షలు నిర్వహించినట్లు బులెటిన్ పేర్కొంది. పాజిటివిటీ రేటు 8.15 శాతం, రికవరీ రేటు 98.82 శాతం.

* హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్‌లో కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ పెరిగింది, మేతో పోలిస్తే జూన్‌లో కేసులు ఐదు రెట్లు పెరిగాయి. జులై మొదటి రెండు రోజుల్లో 82 తాజా కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో 93 కేసులు నమోదు కాగా, మేలో 86 కేసులు, జూన్‌లో అకస్మాత్తుగా 426 కేసులు నమోదయ్యాయి. జులైలో కేవలం రెండు రోజుల్లోనే 82 కొత్త కేసులు నమోదయ్యాయి.

First published:

Tags: Corona alert, Corona virus, Covid, Covid 19 restrictions

ఉత్తమ కథలు