బుల్లితెరపై మళ్లీ 'శ్రీకృష్ణ' సందడి.. దూరదర్శన్‌లో పున: ప్రసారం

ప్రతీకాత్మ చిత్రం

శ్రీ కృష్ణ సీరియల్‌కు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో.... ఆ సీరియల్‌ను పున: ప్రసారం చేయాలని ప్రసార భారతి నిర్ణయించిది.

  • Share this:
    కరోనా లాక్‌డౌన్‌లో థియేటర్లన్నీ మూతపడ్డాయి. కొత్త సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. సినిమా షూటింగ్‌లు కూడా నిలిచిపోయాయి. టీవీ రంగంపైనా దీని ప్రభావం పడింది. షూటింగ్‌లు జరగకపోవడంతో సీరియళ్లు, రియాల్టీ షోలు, కామెడీ షోలన్నీ మధ్యలో ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ వల్ల ఇంట్లోనే ఉన్న ప్రేక్షకుల కోసం.. చాలా ఛానెళ్లు పాత సీరియళ్లు, స్పెషల్ షోలను సరికొత్తగా ప్రసారం చేస్తున్నాయి. దూరదర్శన్ ఛానెల్ కూడా రామాయణం, మహాభారతం సీరియళ్లను పున:ప్రసారం చేస్తోంది. ఆ సీరియల్స్‌కి పెద్ద ఎత్తున రేటింగ్ రావడంతో.. ఇంకొన్ని పాత సీరియల్స్‌కి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రజల కోరిక మేరకు శక్తిమాన్, సర్కస్, బ్యోంకేష్ బక్షి సీరియళ్లను కూడా మళ్లీ ప్రసారం చేస్తున్నారు. తాజాగా శ్రీ కృష్ణ సీరియల్‌కు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో.... ఆ సీరియల్‌ను పున: ప్రసారం చేయాలని ప్రసార భారతి నిర్ణయించిది. ఎప్పటి నుంచి ప్రసారం చేస్తారన్నది త్వరలోనే వెల్లడించారు.

    రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన పురాణగాథ 'శ్రీ కృష్ణ' సీరియల్.. మొదట 1993-1996 మధ్య దూరదర్శన్ (డీడీ2) ఛానెళ్లో ప్రసారం చేశారు. అప్పట్లో ఈ సీరియల్‌కు అత్యధిక రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత 1996లో డీడీ నేషనల్‌లో తిరిగి ప్రసారం చేశారు. అనంతరం జీ టీవీ, సోని, స్టార్ ఛానెళ్లలోనూ ప్రసారమైంది. voot వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుత లాక్‌డౌన్ సీజన్‌లో జనాలు టీవీలు, ఫోన్ల ద్వారానే కాలక్షేపం చేస్తున్నారు. ఇంట్లో బోర్ కొట్టకుండా.. తమకు నచ్చిన సీరియళ్లు, కార్యక్రమాలను ప్రసారం చేయాలంటూ సదరు టెలివిజన్ సంస్థలను కోరుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రామాయణం, మహాభారతం వంటి పురాణగాథలను ప్రసారం చేస్తున్న దూరదర్శన్.. తాజాగా శ్రీకృష్ణను కూడా పున:ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది.

    Published by:Shiva Kumar Addula
    First published: