Home /News /national /

INDIA LIKELY TO HAVE A NORMAL MONSOON THIS YEAR PREDICTS IMD BA

కరోనా కల్లోలం వేళ రైతులకు తీపికబురు...

10.  పీఎం కిసాన్‌ యోజన

10. పీఎం కిసాన్‌ యోజన

జూన్ 4 నాటికి చెన్నై, జూన్ 7 నాటికి పంజింమ్, జూన్ 8 నాటికి హైదరాబాద్, 10 నాటికి పుణె, 11 నాటికి ముంబై, జూన్ 27 నాటికి దేశ రాజధాని ఢిల్లీకి నైరుతి రుతుపవనాలు చేరే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది.

    కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ భారత వాతావరణ శాఖ రైతులకు తీపికబురు చెప్పింది. ఈ సంవత్సరం వర్షాలు సాధారణంగానే ఉంటాయని స్పష్టం చేసింది. ‘ఈ సంవత్సరం సాధారణ వర్షాలు ఉంటాయి. 2020 వర్షాకాలంలో 100 శాతం వర్షాలు పడొచ్చు. మహా అయితే, ఓ 5 శాతం అధికం లేదా 5 శాతం తక్కువ ఉండొచ్చు.’ అని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ మాధవన్ రాజీవన్ తెలిపారు. ‘ఇది మనకు నిజంగా గుడ్ న్యూస్. ఇది మన వ్యవసాయ రంగానికి దోహదం చేస్తుంది. పంటలు బాగా పండడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా ఉపయోగపడుతుంది.’ అని మాధవన్ అన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై తొలిసారి భారత వాతావరణ శాఖ స్పందించింది. ఏయే తేదీలకు ఏయే ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు చేరుకోవచ్చనే అంశంపై కొన్ని అంచనాలను కూడా ఇచ్చింది. యధావిధిగా జూన్ 1 నాటికి కేరళను నైరుతి రుతుపవనాలు పలకరించే అవకాశం ఉంది. జూన్ 4 నాటికి చెన్నై, జూన్ 7 నాటికి పంజింమ్, జూన్ 8 నాటికి హైదరాబాద్, 10 నాటికి పుణె, 11 నాటికి ముంబై, జూన్ 27 నాటికి దేశ రాజధాని ఢిల్లీకి నైరుతి రుతుపవనాలు చేరే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: IMD, Monsoon rains, WEATHER

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు