కరోనా రాకుంటే...భారత్ టాప్ 3 దేశాల సరసన చేరి ఉండేది...కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్

కరోనా సంక్షోభం తలెత్తక పోయి ఉంటే రానున్న ఏడెనిమిది ఏళ్లలో భారత్ ప్రపంచంలోని మూడు అగ్ర దేశాలలో ఒకటిగా మారి ఉండేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

news18-telugu
Updated: August 11, 2020, 8:39 PM IST
కరోనా రాకుంటే...భారత్ టాప్ 3 దేశాల సరసన చేరి ఉండేది...కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్
రక్షణరంగంలో ఆత్మనిర్భర భారత్... రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన ప్రకటన
  • Share this:
దేశంలో కొవిడ్-19 కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ఈ సంక్షోభం తలెత్తక పోయి ఉంటే రానున్న ఏడెనిమిది ఏళ్లలో భారత్ ప్రపంచంలోని మూడు అగ్ర దేశాలలో ఒకటిగా మారి ఉండేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కనెక్టింగ్, కమ్యూనికేటింగ్ అండ్ చేంజింగ్ అనే పుస్తకాన్ని మంగళవారం రాజ్‌నాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ఆర్థికంగా బలపడుతున్న దశలో ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు బాధ్యతలు నిర్వర్తించడం మన అదృష్టమని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ప్రతిష్టను ప్రపంచానికి బలంగా ఆయన చూపించగలిగారని చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితి వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ కొవిడ్-19 మహమ్మారి దేశాన్ని దెబ్బతీయకుంటే వచ్చే ఏడెనిమిది సంవత్సరాలలో మన దేశమే ప్రపంచంలోని మూడు అగ్ర రాజ్యాలలో ఒకటిగా నిలిచేదని ఆయన అన్నారు. అయితే, కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్న కారణంగా మనం అది సాధించగలమన్న నమ్మకం ఉందని రాజ్‌నాథ్ చెప్పారు.
Published by: Krishna Adithya
First published: August 11, 2020, 8:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading