హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

త్వరలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు... అమెరికా సహా పలు దేశాలతో భారత్ చర్చలు

త్వరలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు... అమెరికా సహా పలు దేశాలతో భారత్ చర్చలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అన్నీ అనుకున్నట్టు జరిగితే జులైలోనే మళ్లీ భారత్ నుంచి విదేశాలకు విమానాలు వెళ్లే అవకాశం ఉందని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అరవింద్ సింగ్ తెలిపారు.

వంద రోజులకు పైగా విదేశీ విమాన సర్వీసులు నిలిచిపోయిన భారత్‌లో మళ్లీ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయా ? అన్నీ అనుకున్నట్టు జరిగితే జులైలోనే మళ్లీ భారత్ నుంచి విదేశాలకు విమానాలు వెళ్లే అవకాశం ఉందని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అరవింద్ సింగ్ తెలిపారు. ఈ మేరకు అమెరికా, కెనడా సహా పలు దేశాలతో భారత్ చర్చలు జరుపుతోందని ఆయన వివరించారు. జులైలోనే విదేశీ విమాన సర్వీసులు మళ్లీ మొదలుపెట్టాలనే యోచనలో భారత్ ఉందని అరవింద్ సింగ్ స్పష్టం చేశారు. పలు చేశాలు ప్రయాణాలకు సంబంధించిన నిబంధనలు సడలించాయి.

అయితే దేశంలో కరోనా ఉధృతి యూరోప్‌లో మెజార్టీ దేశాలు మాత్రం భారత్ నుంచి విమాన సర్వీసులను అనుమతించేందుకు నిరాకరిస్తున్నాయి. అయితే త్వరలోనే ఆ దేశాలు కూడా ఇందుకు అనుమతి ఇస్తాయని అధికారులు భావిస్తున్నారు. అమెరికాతో పాటు పలు గల్ఫ్ దేశాలతో విదేశీ ప్రయాణాలు మళ్లీ పునరుద్ధరించేందుకు చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ సర్వీసులు మళ్లీ మొదలుపెట్టాలని దేశంలోని అనేక వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని అరవింద్ సింగ్ చెప్పారు.

First published:

Tags: Airlines, Flight, India, USA

ఉత్తమ కథలు