హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Omicron XBB.1.5 variant : భారత్‌లో కొత్త వేరియంట్.. తొలి కేసు నమోదు

Omicron XBB.1.5 variant : భారత్‌లో కొత్త వేరియంట్.. తొలి కేసు నమోదు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Omicron XBB.1.5 variant : ఈ కొత్త వేరియంట్ ఎలాంటిది? ఇది వ్యాక్సిన్లకు లొంగుతుందా? దీని వ్యాప్తి ఎలా ఉంటుంది? ఇండియాలో కరోనాపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Omicron XBB.1.5 variant : కరోనా ఒమైక్రాన్ వేరియంట్‌లో కొన్ని మార్పుల (mutation)తో వచ్చిన XBB.1.5 వేరియంట్ తొలి కేసు గుజరాత్‌లో నమోదైనట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఇన్సాకాగ్ డేటా నిర్ధారిస్తోంది. ఈమధ్య న్యూయార్క్‌లో కరోనా కేసులు పెరగడానికి ఈ వేరియంటే కారణం. నిజానికి ఇది ఒమైక్రాన్ లోని రెండు వేర్వేరు BA.2 ఉప వేరియంట్ల నుంచి పుట్టింది. దీనికి ACE2 రిసెప్టర్ ఎక్కువగా ఉంది. అందువల్ల దీనికి వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉందని అమెరికా సైంటిస్ట్ ఎరిక్ టోపోల్ (Eric Topol) తెలిపారు.

ఈ కొత్త వేరియంట్ ఇండియాలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది అప్పుడే తెలియదు. ఐతే.. గుజరాత్ పక్కనే మహారాష్ట్ర ఉండటం వల్ల ఆ రాష్ట్ర అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ కొత్త వేరియంట్ ఎట్టి పరిస్థితుల్లో తమ రాష్ట్రంలోకి రాకుండా ఉండాలని చూస్తున్నారు. "ఆ వైరస్ జన్యుపరమైన అంశాల్ని మేము గమనిస్తున్నాము. ప్రస్తుతం మహారాష్ట్రలో వందశాతం జన్యు పరీక్షలు జరుగుతున్నాయి. టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్‌ని జన్యు పరీక్షల కోసం తప్పక పంపిస్తున్నాం. ఐతే.. అంతర్జాతీయ పర్యాటకులకు మాత్రం థెర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాం. 2 శాతం వారికి శాంపిల్ టెస్టులు చేస్తున్నాం. టెస్టుల్లో పాజిటివ్ వస్తే.. జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపుతున్నాం" అని మహారాష్ట్ర పరిశీలనా అధికారి డాక్టర్ ప్రదీప్ అవాటే తెలిపారు.

మహారాష్ట్రలో 2785కి పైగా XBB వేరియంట్ కేసులు ఉన్నాయి. కానీ XBB.1.5 అనేది మరో రకమైనది. దాని గురించి, దాని వ్యాప్తి గురించి మనకు తెలిసింది తక్కువే. అమెరికాలో ఆ వేరియంట్ తీవ్రంగా ఉండొచ్చేమోగానీ.. ఇండియాలో వాతావరణ పరిస్థితులు, ఇమ్యూనిటీ ఇతర కారణాల వల్ల ఇక్కడ ఆ వైరస్ వ్యాప్తి.. వేరుగా ఉండొచ్చని ప్రదీప్ అవాటే అంచనా వేశారు.

దీనిపై వైరాలజీస్టు డాక్టర్ షాహిద్ జమీల్ స్పందించారు. "ఏడాది కాలంగా ఒమైక్రాన్ నుంచి రకరకాల వేరియంట్లు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఒకే రకంగా ఉంటున్నాయి. వీటి వల్ల మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. వీటికి భిన్నంగా ఏదైనా వస్తే మాత్రం ఆలోచించుకోవాలి. అలాగని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇండియాలో 90 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పడింది. 30 శాతం మందికి బూస్టర్ డోస్ కూడా వేశారు. అందువల్ల ఆందోళన అవసరం లేదు" అని జమీల్ వివరించారు.

First published:

Tags: America, Corona, Coronavirus, Covid -19 pandemic, Gujarat, Maharashtra, New york, Omicron

ఉత్తమ కథలు