HOME »NEWS »NATIONAL »india govt spend 500 cr rupees to improve rail connectivity with nepal ns

Indian Railways: భారత్ మరో కీలక నిర్ణయం.. ఆ దేశంతో రైలు మార్గం అభివృద్ధికి రూ.550 కోట్లు.. ప్రాజెక్టు వివరాలివే..

Indian Railways: భారత్ మరో కీలక నిర్ణయం.. ఆ దేశంతో రైలు మార్గం అభివృద్ధికి రూ.550 కోట్లు.. ప్రాజెక్టు వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం

Indo-Nepal railway project: ఇండియా నేపాల్ మధ్య రైలు మార్గాన్ని అభివృద్ధి చేయడానికి భారత దేశం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం రూ. 550 కోట్లను ఖర్చు పెట్టనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఇండియా నేపాల్ మధ్య రైలు మార్గాన్ని అభివృద్ధి చేయడానికి భారత దేశం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం రూ. 550 కోట్లను ఖర్చు పెట్టనుంది. బీహార్ లోని జయానగర్ నుంచి నేపాల్ లోని కుర్తా ప్రాంతం ఉన్న రైల్వే లైన్ ను బిజాల్ పూర వరకు మరో 17 కిలోమీటర్ల మేర పొడిగించనున్నారు. ఈ ప్రాజెక్ట్ మార్చి 2021 వరకు సిద్ధం కానుంది. జయానగర్ ఇండియా నేపాల్ సరిహద్ధుకు కేవలం 4 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. బిజాల్ పూర అనంతరం.. బర్డిదాస్(Bardibas) వరకు మరో నూతన రైల్వే మార్గాన్ని నిర్మించనున్నారు. నేపాల్ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన భూమిని అప్పగించిన అనంతరం ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ Jaynagar-Bijalpura-Bardibas రూట్ లో నేపాల్ జనక్ పూర్(Janakpur) అనే ప్రసిద్ధి చెందిన యాత్రా స్థలం ఉంటుంది. ఇది జయానగర్ నుంచి 29 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ IRCON అనే సంస్థ చేత అభివృద్ధి చేయబడింది. నేపాల్, ఇండియా ప్రభుత్వాలు జయానగర్, కుర్తా మధ్యన రైలు సర్వీసులను నడిపేందుకు కలిసి పని చేస్తున్నాయి.

    ఇదిలా ఉంటే.. భారతీయ రైల్వే వేర్వేరు వర్గాలకు రైలు టికెట్లలో రాయితీ అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో విద్యార్థులకు 75 శాతం వరకు రాయితీ అందిస్తోంది. ఈ రాయితీతో పాటు కొందరు విద్యార్థులకు ఉచిత ప్రయాణాన్ని ఆఫర్ చేస్తోంది. ఈ రాయితీ విద్యార్థులు చదివే తరగతి, ప్రయాణిస్తున్న ఊరును బట్టి మారుతుంది. ఈ వివరాలను భారతీయ రైల్వే వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. మరి ఎవరికి ఎంత రాయితీ వస్తుందో తెలుసుకోండి.


    నష్టాలను పూడ్చుకునేందుకు Indian Railways కీలక నిర్ణయం.. ప్రయాణికులకు సరికొత్త సదుపాయం.. వివరాలివే

    సొంతూళ్లకు, ఎడ్యుకేషనల్ టూర్లకు వెళ్లే విద్యార్థులు 75 శాతం వరకు రాయితీ పొందొచ్చు. జనరల్ కేటగిరీ విద్యార్థులు సెకండ్, స్లీపర్ క్లాస్ టికెట్లు, మంత్లీ సీజన్ టికెట్, క్వార్టర్లీ సీజన్ టికెట్లపై 50 శాతం కన్సెషన్ పొందొచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 75 శాతం వరకు రాయితీ పొందొచ్చు. తమ ఊరి నుంచి విద్యా సంస్థ ఉన్న ఊరికి వెళ్లేందుకు బాలికలకు ఉచితంగా మంత్లీ సీజన్ టికెట్ ఇస్తోంది రైల్వే. డిగ్రీ పూర్తి చేసే వరకు ఇది వర్తిస్తుంది. ఇక బాలురు 12వ తరగతి పూర్తి చేసేవరకు ఉచితంగా మంత్లీ సీజన్ టికెట్ పొందొచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:January 18, 2021, 11:19 IST

    टॉप स्टोरीज