హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

భారత్ కు రెండో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్

భారత్ కు రెండో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్

జనరల్ అనిల్ చౌహాన్ (ఫైల్)

జనరల్ అనిల్ చౌహాన్ (ఫైల్)

Lt General Anil Chauhan: బిపిన్ రావత్ మరణానంతరం 9 నెలల తర్వాత భారతదేశానికి కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ను నియమించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ అనే మూడు సేవలను ఏకీకృతం చేయడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవీని సృష్టించారు.  హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ మరణించిన తొమ్మిది నెలల తర్వాత, కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్)ను (Lieutenant General Anil Chauhan) కేంద్ర ప్రభుత్వం బుధవారం దేశ అత్యున్నత సైనిక అధికారిగా నియమించింది. లెఫ్టినెంట్ జనరల్ చౌహాన్ మే 2021లో ఈస్టర్న్ కమాండ్ చీఫ్‌గా పదవీ విరమణ చేశారు.

భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా పనిచేసిన జనరల్ రావత్,  ఆయన సతీమణి (Bipin Rawat)  డిసెంబరులో తమిళనాడులో మిలిటరీ హెలికాప్టర్ కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 13 మంది మరణించారు. ప్రాణాలతో బయటపడిన ఏకైక ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్, తరువాత తీవ్రమైన కాలిన గాయాలతో మరణించాడు. జనరల్ రావత్ (63), జనవరి 2020లో భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆర్మీ , నేవీ,  ఎయిర్ ఫోర్స్ అనే మూడు సేవలను ఏకీకృతం చేయడానికి ఈ పదవిని ఏర్పాటు చేశారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Army, Delhi

ఉత్తమ కథలు