Home /News /national /

INS VELA: ఐఎన్ఎస్ వేలా జల ప్రవేశం.. భారత నౌకా దళం చేతికి మరో అధునాత ఆయుధం

INS VELA: ఐఎన్ఎస్ వేలా జల ప్రవేశం.. భారత నౌకా దళం చేతికి మరో అధునాత ఆయుధం

ఐఎన్ఎస్ వేలా

ఐఎన్ఎస్ వేలా

INS Vela: 1973 నుంచి 2010 వరకు నావికాదళంలో సేవలు అందించిన ఒకప్పటి జలాంతర్గామి 'వేలా' పేరునే దీనికీ పెట్టారు. సోవియెట్‌ రష్యా తయారు చేసిన ఆ సబ్‌మెరైన్‌ మన దేశం నిర్వహించిన ఎన్నో కీలక ఆపరేషన్లలో పాల్గొంది.

    భారత అమ్ముల పొదిలో మరో అధునాత అస్త్రం చేరింది. ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామి (INS Vela Submarine) ముంబై తీరంలో జలప్రవేశం చేసింది. నేవీ చీఫ్ అడ్మైరల్ కరమ్‌బీర్ సింగ్ (Karambeer Singh) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రాజెక్టు 75లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వేలా జలాంతర్గామిని తయారు చేశారు. ఐఎన్ఎస్ వేలా రాకతో భారత నౌకాదళం (Indian Navy) మరింత శక్తివంతంకానుంది. భారత్‌కు ఉన్న స్టెల్త్‌ స్కార్పీన్‌ శ్రేణి జలాంతర్గాముల్లో ఇది నాలుగోది. అదేవిధంగా ప్రాజెక్టు 75 పేరుతో నిర్మిస్తున్న సబ్‌మెరైన్‌ల్లో కూడా నాలుగోది. దీన్ని మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) నిర్మించింది. ప్రాజెక్టు-75 కింద ఇప్పటికే ఐఎన్‌ఎస్‌ కల్వరి, ఐఎన్‌ఎస్‌ ఖంధేరి, ఐఎన్‌ఎస్‌ కరంజ్‌లను ప్రవేశపెట్టారు.

    Mizoram Earthquake: మిజోరాంను వణికించిన భారీ భూకంపం.. కోల్‌కతాలోనూ ప్రకంపనలు

    ఐఎన్‌ఎస్‌ వేలా అత్యంత సమర్థవంతమైనదని, జలంతర్గాముల ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరిస్తుందని కరమ్‌బీర్ సింగ్ అన్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లో భద్రతాపరమైన సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో ఐఎన్‌ఎస్‌ వేలాకి భారత నావికాదళ ప్రయోజనాలను పరిరక్షించే సత్తా ఉందని పేర్కొన్నారు.

    కరోనాలో మరో భయంకరమైన వేరియెంట్.. అసాధారణ రీతిలో మ్యుటేషన్స్.. కేంద్రం హెచ్చరిక

    2005లో భారత్, ఫ్రాన్స్‌ 375 కోట్ల డాలర్లతో ఆరు స్టిల్త్ స్కార్పెన్‌ క్లాస్‌ జలాంతర్గాముల్ని తయారు చేయాలని ఒప్పందం కుదిరింది. ఐఎన్ఎస్ వేలాను ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్‌ఎస్, భారత్‌కు చెందిన మాజ్‌గావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌ కంపెనీలు సంయుక్తంగా తయారుచేశాయి. ఫ్రాన్స్‌ సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులో జాప్యం చేయడంతో ప్రాజెక్టులు ఆలస్యమవుతూ వచ్చాయి. 2017లో ఐఎన్‌ఎస్‌ కల్వారి అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఐఎన్‌ఎస్‌ ఖండేరి, ఐఎన్‌ఎస్‌ కరాంజ్‌లు కూడా విధుల్లో చేరాయి. అయితే కరోనా కారణంగా ఐఎన్‌ఎస్‌ వేలా మరింత ఆలస్యమైంది.

    Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..

    ఐఎన్ఎస్ వేలా ప్రత్యేకతలు..
    వేలా సబ్‌మెరైన్‌ 67.5 మీటర్లు పొడవు, 12.3 మీటర్ల ఎత్తు, 6.2 మీటర్ల వెడల్పు

    నీట మునిగినప్పుడు 20 నాట్ల వేగం, ఉపరితలంపై 13 నాట్లవేగంతో ప్రయాణం

    ఐఎన్‌ఎస్‌ వేలాలో సీ303 యాంటీ టార్పెడో కౌంటర్‌మెజర్‌ వ్యవస్థ

    18 టార్పిడోలు లేదంటే యాంటీ షిప్‌ క్షిపణుల్ని అత్యంత సమర్థవంతంగా ప్రయోగించే సత్తా

    ఎనిమిది మంది అధికారులు, 35 మంది సిబ్బందిని మోసుకెళ్లగల సామర్థ్యం

    స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన వేలాలో తొలిసారిగా బ్యాటరీ వ్యవస్థ.

    డీజిల్, ఎలక్ట్రిక్‌ శక్తితో పనిచేసే ఇంజిన్లు

    సముద్ర గర్భంలో రహస్యంగా శత్రువులను గుర్తించి లక్ష్యాలను చేధించే సామర్ధ్యం

    1973 నుంచి 2010 వరకు నావికాదళంలో సేవలు అందించిన ఒకప్పటి జలాంతర్గామి 'వేలా' పేరునే దీనికీ పెట్టారు. సోవియెట్‌ రష్యా తయారు చేసిన ఆ సబ్‌మెరైన్‌ మన దేశం నిర్వహించిన ఎన్నో కీలక ఆపరేషన్లలో పాల్గొంది. నేవీలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించించింది. వేలాని 2010లో నావికాదళం నుంచి విరమించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Indian Navy, Mumbai

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు