INDIA FIRST COVID OMICRON DEATH REPORTED FROM RAJASTHAN UDAIPUR MKS
Omicron death: భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం.. ఉదయ్‌పూర్‌లో నమోదు.. రాబోయే 2వారాలు భారీగా..
ప్రతీకాత్మక చిత్రం
ఇండియాలో తొలి ఒమిక్రాన్ మరణం రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం నిర్ధారించింది. నిపుణులు ఊహించినట్లుగానే దేశంలో కరోనా మళ్లీ ఆందోళనకర స్థాయికి పెరగ్గా, రాబోయే రెండు వారాల్లో వైరస్ మరింత ప్రమాదకరంగా విజృంభించబోతోందని ప్రఖ్యాత సైంటిస్టులు హెచ్చరించారు.
సాధారణ జలుబేలే, పెద్దగా ప్రమాదమేమీ లేదనే తప్పుడు అభిప్రాయంలో ఉండగానే దేశంలో ఒమిక్రాన్ పీడ, ఇతర వేరియంట్ల వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోయాయి. కొత్త వేరియంట్ బారిన పడిన రోగుల సంఖ్య ఇప్పటికే 2వేల మార్కును దాటేయగా, బుధవారం నాడు తొలి మరణం నమోదైంది. ఇండియాలో తొలి ఒమిక్రాన్ మరణం రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం నిర్ధారించింది. నిపుణులు ఊహించినట్లుగానే దేశంలో కరోనా మళ్లీ ఆందోళనకర స్థాయికి పెరగ్గా, రాబోయే రెండు వారాల్లో వైరస్ మరింత ప్రమాదకరంగా విజృంభించబోతోందని ప్రఖ్యాత సైంటిస్టులు హెచ్చరించారు. ఒమిక్రాన్ ఒక సాధారణ జలుబు అనే భావన నుంచి ఇకనైనా మేల్కొని జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు..
కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కు భారత్ లో తొలి వ్యక్తి బలయ్యాడు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ సిటీలో 73 ఏళ్ల వ్యక్తి మరణానికి ఒమిక్రానే కారణమని నిర్ధారణ అయింది. ఆయన శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. కొవిడ్ తో పోరాడుతూ ఆ వ్యక్తి డిసెంబర్ 31వ తేదీన మరణించారు. ఆయనకు డయాబెటిస్ వంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. టెక్నికల్‌గా మన దేశంలో ఒమిక్రాన్ కారణంగా మరణించిన తొలి వ్యక్తి ఆయనే అని అగర్వాల్ చెప్పారు.
ఉదయ్ పూర్ వ్యక్తికి డిసెంబర్ 15న ఆయనకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. జ్వరం, దగ్గు, ఇతర సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరారు. కరోనా టెస్టు చేయగా పాజిటివ్ అని వచ్చింది. అనంతరం జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. డిసెంబర్ 25న జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితంలో ఆయనకు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, హైపర్ థైరాయిడిజం వంటి దీర్ఘకాలిక వ్యాధులు, కరోనా అనంతర నిమోనియో వంటి సమస్యలతో ఆయన మరణించినట్టు ఉదయ్‌పూర్ చీఫ్ మెడికల్ హెల్ల్ ఆఫీసర్ డాక్టర్ దినేశ్ ఖరాడి వివరించారు.
ప్రస్తుతం దేశంలో 2,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన వారిలో కూడా రికవరీ రేట్ బాగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఇప్పటికి 828 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. ఒమిక్రాన్ దేశంలోని 24 రాష్ట్రాలకూ విస్తరించింది. మహారాష్ట్ర, ఢిల్లీలో తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇక ఇతర వేరియంట్ల వ్యాప్తితో దేశంలో కొత్త కొవిడ్ కేసుల సంఖ్య 60వేల మార్కును దగ్గరగా వచ్చాయి. నిన్న ఒక్కరోజే 500పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు. రాబోయే రెండు వారాల్లో కేసులు, మరణాలు భారీగా ఉంటాయని, ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సైంటిస్టులు వార్నింగ్ ఇచ్చారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.