Online Classes: విద్యారంగంలో భారత్ కు పెను సవాల్ గా మారిన కరోనా.. అకడమిక్ రిగ్రెషన్ తో విద్యార్థుల ఇక్కట్లు..

ప్రతీకాత్మక చిత్రం

Academic Regression: 26 కోట్ల మంది పిల్లలున్న మనదేశంలో ఈ అకడెమిక్ రిగ్రెషన్ సమస్యను పరిష్కరించకపోతే.. ఆ లోటు అలాగే ఉండిపోతుంది. వారి అకడమిక్ స్కిల్స్ పై ప్రభావం చూపుతుంది. సమాజంలో ఇప్పటికే ఉన్న అసమానతల సరసన ఇది కూడా చేరుతుంది.

  • News18
  • Last Updated :
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రతి రంగాన్నీ అతలాకుతలం చేసింది. ముఖ్యంగా విద్యారంగాన్ని కుదిపేసింది. అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో ఈ సంక్షోభం తీవ్రంగా ఉంది. ఎందుకంటే భారత పాఠశాల్లో దాదాపు 26 కోట్ల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తాజాగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నత తరగతుల విద్యార్థుల కోసం స్కూళ్లు తెరిచారు. కరోనా ప్రభావం వల్ల గతేడాది మార్చి నుంచి పాఠశాలలు మూసివేశారు.

ఈ కాలంలో పిల్లల విద్యను కొనసాగించేందుకు రెండు రకాల ప్రయత్నాలు జరిగాయి. ఒకటి ఆన్ లైన్ విద్య కాగా.. మరోకటి బహిరంగ ప్రదేశాల్లో తరగతులు నిర్వహించారు. అయితే పాఠశాలలో జరిగే విద్యాభ్యాసానికి ఇవేవీ సరి కాలేదన్నది మాత్రం నిజం.

ఆన్ లైన్ విద్య అసమర్థత..

ఆన్ లైన్ విద్య ప్రాథమికమైంది కాదు. ఎందుకంటే చాలా మందికి ఆన్ లైన్ విద్య పొందడానికి సరైన వనరులు లేవు. అంతేకాకుండా చదువులు సజావుగా సాగాలంటే ఉపాధ్యాయులు, విద్యార్థులు పరస్పరం ఎదురుగా ఉండి చర్చించుకోవడం అవసరం. ఆన్ లైన్ విద్యలో సమర్థత లోపించడం వల్ల గతేడాది కాలంగా విద్య స్థాయి చాలా త్వరగా క్షీణించింది. ఫలితంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ తరగతులను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాయి. నిబద్దత, అంకితభావంతో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ దిశగా ముందడుగు వేశారు. ఇలాంటి మొహల్లా తరగతులు నిర్వహించడం వల్ల పిల్లల్లో కరోనా సోకే ప్రమాదాన్ని పెంచే అవకాశం లేదు. వారు ఒకే చోట నివసించడం కూడా ఇందుకు కారణం కావచ్చు .

బహిరంగ విద్యలో ఫలితం శూన్యం..

ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవస్థీకృతమైన ఇబ్బందుల వల్ల ఈ బహిరంగ తరగతులను వారానికి 4 నుంచి 6 గంటల మించి నిర్వహించలేదు. పాఠశాలలు తెరిస్తే రోజుకు 6 నుంచి 8 గంటల పాటు తరగతులు ఉంటాయి. కాబట్టి ఈ బహిరంగ తరగతుల వల్ల ఫలితమేమి లేదు. అంతేకాకుండా నవంబరు లేదా డిసెంబరు మాసాల్లో వీటిని ప్రారంభించడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు మధ్య అన్యోన్యత సరిపోలడం లేదు. గతేడాదిలో భారత్ లో చాలా తక్కువ మంది మాత్రమే సరైన వనరులు కలిగి ఉండి ఇంటి నుంచి ఆన్ లైన్ క్లాసుల పద్ధతిలో విద్యా సంవత్సరాన్ని నెట్టుకురాగలిగారు. మిగిలినవారు తమ విద్యాసంవత్సరాన్ని కోల్పోయినట్లే జీవించారు.

నేర్చుకున్నది మర్చిపోవడం..

ఈ సమయంలో పిల్లలు రెండు రకాలుగా నష్టపోయారు. మొదటిది 2020-21 కాలంలో విద్యార్థులు పెద్దగా ఏమీ నేర్చుకోలేకపోయారు. రెండోది పాఠశాలలు మూసివేయడం వల్ల నేర్చుకున్నది కూడా మర్చిపోయారు. ఇందులో మొదటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓ పిల్లాడు నాలుగో తరగతిలో ఉన్నప్పుడు ఆ ఏడాదంతా అతడు తరగతులకు వెళ్లకపోవడం వల్ల ఆ తరగతి నుంచి ఏం నేర్చుకోలేదు, రెండోది అభ్యాస నష్టం. అంటే నేర్చుకున్నది మర్చిపోవడం. ఏడాదంతా ఆ పిల్లాడు తరగతులకు వెళ్లకపోవడం వల్ల మూడో తరగతిలో నేర్చుకున్నది, అభ్యసించింది కూడా మర్చిపోతాడు. దీన్నే అకేడెమిక్ రిగ్రెషన్ అని అంటారు. వేసవి సెలవుల వల్ల గత తరగతిలో నేర్చుకున్నది మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్నే సమ్మర్ స్లైడ్ అని కూడా అంటారు.

దేశవ్యాప్తంగా అధ్యయనం..

కాబట్టి పాఠశాలలు తిరిగి ప్రారంభించినప్పుడు తాము ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటామని టీచర్లు అంటున్నారు. పిల్లలు ఈ ఏడాదిలో నేర్చుకున్న వాటినన్నింటినీ తిరిగి బోధించాలి.. గత తరగతిలో బోధించిన వాటిలో మర్చిపోయిన వాటిని తిరిగి గుర్తు చేస్తూ కొత్త తరగతి పాఠాలు కూడా చెప్పాలి. ఇది చాలా కష్టమైన విషయం అని ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ అకెడెమిక్ రిగ్రెషన్ గురించి దేశవ్యాప్తంగా 44 జిల్లాల్లో అధ్యయనం చేశారు. దాదాపు 16,667 మంది విద్యార్థులు, 2వేల మంది ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారు. ఈ అధ్యయనం ఫలితం ఆశ్చర్యకరంగా ఆందోళకరంగా కనిపిస్తోంది. 82 శాతం మంది పిల్లల మేథమేటిక్స్ బేసిక్స్ మర్చిపోయారు. 92 శాతం మంది పిల్లలు భాషకు సంబంధించి బేసిక్ నియమాలు మర్చిపోయారు. వీటి గురించి గతేడాది మార్చి వరకు తెలుసు. కానీ గ్యాప్ రావడం వల్ల ఫౌండేషన్ ఎబిలిటీస్ ను కోల్పోయారని వారు చెప్పడం జరిగింది. ఫౌండేషన్ ఎబిలిటీస్ అంటే గణితంలో కూడికలు, తీసివేతలు, లాంగ్వేజిలో పేరాను చదవే సామర్థ్యాలు లాంటివన్నమాట.

సమస్యకు పరిష్కారం..

ఈ అకెడెమిక్ రెగ్రషెన్ వల్ల జరిగిన నష్టం గురించి దేశవ్యాప్తంగా అందరూ ప్రతిస్పందించాల్సిన అవసరముంది. అంతేకాకుండా ఈ భారీ సవాలను గుర్తించి దాన్ని అంగీకరించడం అవసరం. ఈ సమస్య కరోనా మహమ్మారి వల్ల ప్రారంభమైంది. ఫలితంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు మినహాయింపులు ఇవ్వకూడదు. ఈ విషయంలో రక్షణాత్మక వ్యూహాన్ని అవలభించాలి. కొన్ని రాష్ట్రాలు దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి బహిరంగంగా అంగీకరిస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఉపాధ్యాయులకు తగినంత సమయం ఇవ్వాలి. ఇందుకోసం ప్రస్తుతమున్న 2021 సెషన్ ను పొడిగించాలి. వేసవి విరామాలు లేకుండా సిలబస్ ను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. తగినంత అదనపు సమయం లేకుండా విద్యార్థులు ఈ సవాలు అధిగమిస్తారనుకోవడంలో వాస్తవం లేదు. కాబట్టి విద్యార్థులకు ఉపాధ్యాయులు మద్దతు ఇవ్వాలి. ప్రతి విద్యార్థి అకడెమిక్ రిగ్రెషన్ స్థాయిని అందుకునేందుకు ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ, సాధానాలు అందించాలి.

26 కోట్ల మంది పిల్లలున్న మనదేశంలో ఈ అకడెమిక్ రిగ్రెషన్ సమస్యను పరిష్కరించకపోతే.. ఆ లోటు అలాగే ఉండిపోతుంది. వారి అకడమిక్ స్కిల్స్ పై ప్రభావం చూపుతుంది. సమాజంలో ఇప్పటికే ఉన్న అసమానతల సరసన ఇది కూడా చేరుతుంది. దేశం ఇప్పటికే ఎదుర్కొంటోన్న అనేక సవాళ్లతో ఇది కూడా చేరుతుంది. ఇది భారీ మిషన్ కు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తుంది.
Published by:Srinivas Munigala
First published: