Home /News /national /

Narendra Modi: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మోదీ ప్రత్యేక లేఖ.. రెండున్నరేళ్ల తర్వాత కీలక పరిణామం..!

Narendra Modi: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మోదీ ప్రత్యేక లేఖ.. రెండున్నరేళ్ల తర్వాత కీలక పరిణామం..!

నరేంద్రమోదీ, ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫొటోలు)

నరేంద్రమోదీ, ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫొటోలు)

దాదాపు రెండున్నరేళ్ల తర్వాత భారత్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాక్ అధికారులు భారత్ లోకి అడుగుపెట్టారు. ఓ కీలక విషయమై చర్చలు జరుపుతున్నారు.

    సరిహద్దు దేశమైన పాకిస్తాన్ తో భారత్ ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటుందంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రికి తాజాగా ఆయన ఓ లేఖ రాశారు. మార్చి 23వ తారీఖున పాకిస్తాన్ డే సందర్భంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ప్రత్యేకంగా ఓ లేఖను రాశారు. ‘పాకిస్తాన్ తో భారత్ ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటోంది. అదే సమయంలో ఆ సంబంధాలు నమ్మకమనే పునాదులపై నిలబడి ఉండాలి. అది జరగాలంటే ముందుగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి దూరం కావాల్సి ఉంది‘ అని మోదీ ఆ లేఖలో ప్రస్తావించారు. పాకిస్తాన్ డే సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ కు, పాకిస్తాన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ మోదీ తన లేఖలో పేర్కొన్నారు.

    కాగా, దేశాధినేతలకు కొన్ని కొన్ని ప్రత్యేక రోజుల్లో సాధారణంగానే ఇలాంటి లేఖలు వెళ్తుంటాయనీ, అందులో భాగంగానే పాకిస్తాన్ డే సందర్భంగా ప్రధాని మోదీ, ఇమ్రాన్ ఖాన్ కు ఆ లేఖను పంపించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రతియేటాలాగానే ఈ ఏడాది కూడా ప్రధాని తన తరపున శుభాకాంక్షలు తెలుపుతూ లేఖను పంపారన్నారు. ఇది రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు తోడ్పడుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పాక్, భారత్ దేశాల మధ్య సింధూ నదీ జలాల వివాదంపై చర్చలు జరుగుతున్నాయి.
    ఇది కూడా చదవండి: రాజీవ్‌తో ప్రేమ పెళ్లికి ఒకే ఒక్క కండీషన్ పెట్టిన దేవదాస్ కనకాల.. నేరుగా సుమ ఫోన్ చేసి చెప్తే..

    ఈ చర్చల్లో సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల దిశగా సానుకూల వాతావరణం నెలకొంటున్న సమయంలో మోదీ ఈ లేఖను పంపించడం మరింత మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పాక్, భారత్ దేశాల సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వద్ద కాల్పుల విరమణను పాటించాలని గత నెలలో రెండు దేశాలు ఓ నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాతే, దాదాపు రెండున్నరేళ్ల తర్వాత పాక్ అధికారులు భారత్ కు వచ్చారు. సింధూ నదీ జలాల పంపిణీపై భారత్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
    ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Imran khan, India pakistan, International news, Narendra modi, National

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు