• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • INDIA COVID 19 MANY STATES IN INDIA IMPLEMENT CURFEW LOCKDOWN AND OTHER CORONA GUIDELINES HERE IS THE LIST OF THOSE STATES NK

Corona Guidelines: దేశమంతా కరోనా ఆంక్షలు... ఏ రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే...

Corona Guidelines: దేశమంతా కరోనా ఆంక్షలు... ఏ రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే...

దేశమంతా కరోనా ఆంక్షలు... ఏ రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే... (image credit - twitter)

Corona Guidelines: దేశంలో అప్రకటిత లాక్‌డౌన్ అమల్లో ఉంది అనుకోవచ్చు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో రకరకాల ఆంక్షలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

  • Share this:
    Corona Guidelines: ఇండియాలో రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే... రాష్ట్రాల ప్రభుత్వాలు కర్ఫ్యూలు, చిన్న చిన్న లాక్‌డౌన్లూ ప్రకటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించకపోయినా... రాష్ట్రాలు మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దాంతో... ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి. చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. రాత్రివేళ కర్ఫ్యూ అమలవుతోంది. సమూహిక కార్యక్రమాల్లో కూడా కండీషన్లు అమల్లో ఉన్నాయి. మరి ఏ రాష్ట్రంలో ఎలాంటి షరతులు పెట్టారో తెలుసుకుందాం.

    మహారాష్ట్ర: నేటి రాత్రి నుంచి 15 రోజులు కర్ఫ్యూ విధించారు. అన్ని కార్యాలయాలు, పార్కులు, జిమ్‌లు, థియేటర్లు మే 1 వరకు మూసివేస్తున్నారు.

    ఛత్తీస్‌గఢ్‌: రాయ్‌పూర్‌లో 17 వరకు, దుర్గ్‌లో 19 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ఉంది. అన్ని పట్టణాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ ఉంది. బస్సుల్లో 50 శాతం మందికే అనుమతి ఉంది.

    తెలంగాణ: అన్ని బడులు, కాలేజీలు, వర్సిటీలు మూసివేశారు. ఎప్పుడు తెరిచేదీ తేదీ లేదు.

    ఢిల్లీ: ఏప్రిల్ ఆఖరు దాకా రాత్రివేళ కర్ఫ్యూ అమలవుతోంది. 50 శాతం సామర్థ్యంతోనే ఆఫీసులు, మెట్రో, బస్‌ సర్వీసులు నడుస్తున్నాయి. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు 100 నుంచి 200 మంది వరకూ అనుమతి ఉంది.

    రాజస్థాన్‌: 10 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ ఉంది. 9వ తరగతి విద్యార్థుల వరకూ విద్యా సంస్థలు మూసివేశారు.

    ఉత్తరప్రదేశ్‌: 9 జిల్లాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ ఉంది. 500 యాక్టివ్‌ కేసులున్న జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ ఉంది. విద్యా సంస్థలు మూసివేశారు.

    హిమాచల్‌ ప్రదేశ్: 15 వరకూ బడులు మూసివేశారు. 7 రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కరోనా నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి. బహిరంగ ప్రదేశాల్లో పెళ్లిళ్లకు 200 మందికి, మండపాల్లో 50 మందికి మాత్రమే అనుమతి ఉంది.

    జమ్మూకాశ్మీర్‌: 8 జిల్లాల్లో రాత్రివేళ కర్ఫ్యూ ఉంది. రాష్ట్రానికి బయటి నుంచి వచ్చేవారికి కరోనా టెస్టులు చేస్తున్నారు. విద్యాసంస్థలు మూసేశారు.

    హర్యానా: రాత్రి వేళ కర్ఫ్యూ అమల్లో ఉంది. ఎప్పటివరకో చెప్పలేదు. పెళ్లిళ్లు, బహిరంగ కార్యక్రమాలకు 200 నుంచి 500 మంది వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

    ఉత్తరాఖండ్‌: 12 రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు కచ్చితంగా ఉండాలని ఆదేశించారు.

    పంజాబ్‌: ఈ నెల 30 వరకు రాత్రివేళ కర్ఫ్యూ ఉంటుంది. రాజకీయ, మత పరమైన కార్యక్రమాలు రద్దు చేశారు. విద్యా సంస్థలు మూసేశారు.

    బీహార్‌: ఏప్రిల్‌ 18 వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. రాత్రి 7 వరకే దుకాణాలు తెరవాలని చెప్పారు. పెళ్లిళ్లు తదితర కార్యక్రమాలకు 200 మందికే అనుమతి ఉంది.

    జార్ఖండ్‌: నెలాఖరు వరకు విద్యా సంస్థలు, జిమ్‌లు, ఎగ్జిబిషన్లు మూసేశారు. మత పరమైన ర్యాలీలపై నిషేధం అమలులో ఉంది.

    తమిళనాడు: నెలాఖరు వరకు చిన్నగా లాక్‌డౌన్‌ ఉంది. పండుగలు, మతపరమైన కార్యక్రమాలను రద్దు చేశారు. కోయంబేడ్‌లో రిటైల్‌ అమ్మకాలపై నిషేధం విధించారు. రెస్టారెంట్లలో 50 శాతం మందికే అనుమతి ఉంది.

    కేరళ: విదేశాల నుంచి వచ్చేవారికి వారంపాటు క్వారంటైన్‌ అమలు చేస్తున్నారు. ఓపెన్‌ స్పేస్‌లో భేటీలకు 200 మందికి అవకాశం ఉంది. గదుల్లో సమావేశాలైతే 100 మందికే ఛాన్స్ ఉంది.

    కర్ణాటక: బెంగళూరు సహా 7 నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ ఉంది.

    గుజరాత్‌: 20 నగరాల్లో రాత్రివేళ కర్ఫ్యూ అమల్లో ఉంది. సామూహిక కార్యక్రమాలు రద్దు చేశారు. 9వ తరగతి విద్యార్థుల వరకు స్కూళ్లను 18వ తేదీ దాకా బంద్‌ చేశారు.

    మధ్యప్రదేశ్‌: 19 వరకు రాత్రి వేళ కర్ఫ్యూ ఉంది. ఐదు జిల్లాలు, ఒక నగరంలో లాక్‌డౌన్‌ ఉంది. ఛత్తీస్‌గఢ్‌తో రాకపోకలు బంద్‌ చేశారు. వారానికి 5 రోజులే ప్రభుత్వ కార్యాలయాలు ఉంటున్నాయి. విద్యా సంస్థలు మూసివేశారు.

    గోవా: ప్రజల కదలికలపై ఆంక్షలు లేవు గానీ.. టెన్త్‌ ఆపై క్లాసులకు మినహా బడులు మూసివేశారు. సభలపై నిషేధం అమలులో ఉంది.

    చండీగఢ్‌: రాత్రి వేళ కర్ఫ్యూ అమలులో ఉంది.

    ఒడిశా: రాష్ట్రానికి వచ్చేవారు కరోనా నెగెటివ్‌ రిపోర్టు కచ్చితంగా చూపించాలని చెప్పారు.

    India Corona updates: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 1,84,372 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,38,73,825కి చేరింది. కొత్తగా 1,027 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,72,085కి చేరింది. మరణాల రేటు 1.2 శాతంగా ఉంది. కొత్తగా 82,339 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 1,23,36,036కి చేరింది. రికవరీ రేటు 88.9 శాతానికి పడిపోయింది. నానాటికీ ఇది తగ్గిపోతోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 13,65,704గా ఉంది. దేశంలో కొత్తగా 14,11,758 టెస్టులు జరిగాయి. మొత్తం టెస్టుల సంఖ్య 26,06,18,866కి చేరింది. దేశంలో తాజాగా 26,46,528 వ్యాక్సిన్లు వెయ్యగా... మొత్తం వ్యాక్సిన్ల సంఖ్య 11,11,79,578కి చేరింది.

    ఇది కూడా చదవండి: Maruti Suzuki: అమ్మకాల్లో దూసుకెళ్లిన మారుతీ... ఆ కారుకు దేశంలో విపరీతమైన డిమాండ్

    దేశంలో యాక్టివ్ కేసులు ఏకంగా లక్ష పెరిగాయి. ఇండియాలో ఎప్పుడూ లేనంత ఎక్కువ కరోనా కేసులు ఇప్పుడు వచ్చాయి. యాక్టివ్ కేసులు కూడా అత్యధికంగా ఇప్పుడే వచ్చాయి. 178 రోజుల్లో తొలిసారి వెయ్యికి పైగా మరణాలు వచ్చాయి. బ్రెజిల్ తర్వాత అత్యధిక మరణాలు ఇప్పుడు ఇండియాలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కొత్త కేసులు 60వేలకు పైగా వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో 17.96 వేలు, ఛత్తీస్‌గఢ్‌లో 15.1వేలు, ఢిల్లీలో 13.5వేలు వచ్చాయి. మహారాష్ట్రలో నిన్న 281 మంది చనిపోగా... ఛత్తీస్‌గఢ్‌లో 156, ఉత్తర ప్రదేశ్‌లో 85 వచ్చాయి. దేశంలోని 12 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో రికవరీ రేటు 90 శాతం కంటే తక్కువ ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో అతి తక్కువగా 75.8 శాతం ఉంది. దేశంలో పాజిటివిటీ రేటు 13.06 శాతానికి చేరింది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు