Covid-19: థర్డ్ వేవ్ ముప్పు... రాష్ట్రాలకు కేంద్రం తాజా హెచ్చరికలు..అలా చేయొద్దు

ప్రతీకాత్మక చిత్రం

India Coronavirus Updates: ఆర్ ఫ్యాక్టర్ అంటే రిప్రొడక్షన్ రేటు. ఒక వ్యక్తి ద్వారా ఎంత మంది ఇన్‌ఫెక్షన్ గురవుతున్నారో ఈ నెంబర్ సూచిస్తుంది. ఉదాహరణకు ఆర్ ఫ్యాక్టర్ 2 అంటే.. ఒక వ్యక్తి నుంచి ఇద్దరికి వ్యాధి సంక్రమిస్తోందని అర్ధం. ఈ

 • Share this:
  కరోనా సెకండ్ వేవ్ మన దేవం బయట పడడంతో మళ్లీ సాధారణ పరిస్థిితులు నెలకొన్నాయి. ఐతే ఇద సమయంలో ప్రజల్లలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. కరోనా పోయిందిలే అని చాలా మంది నిబంధనలను పాటించడం లేదు. భౌతిక దూరాన్ని మరచిపోతున్నారు. మాస్క్‌ను ధరించడం లేదు. ఇలాగే ఉంటే మళ్లీ కరోనా మహమ్మారి విజృంభించి థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముంది. ఈ క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో కరోనా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని, అందుకు సంబంధిత అధికారులను బాధ్యులను చేసి చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం లేక రాశారు. ‘R ఫ్యాక్టర్‌ (రీప్రొడక్షన్‌ నంబర్‌)’ 1 ని దాటితే ప్రమాదమని.. ఆ ప్రాంతాల్లో మళ్లీ కరోనా వ్యాప్తతి మొదలయినట్లేనని ఆయన హెచ్చరించారు. ఎక్కడైనా కరోనా నిబంధనలను పాటించకపోతే ఆ ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు విధించాలని స్పష్టం చేశారు. రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

  పలు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా పర్వత ప్రాంతాలు, మార్కెట్లు, ప్రజా రవాణా వంటి చోట్ల నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు. ఫలితంగా ఆర్ ఫ్యాక్టర్ పెరుగుతోంది. ఆర్ ఫ్యాక్టర్ దాటితే ప్రమాదకరం. అందుకే జనం రద్దీ ఎక్కువగా ఉండే దుకాణాలు, మార్కెట్లు, వారాంతపు సంతలు, బార్లు, రెస్టారెండ్లలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల, పార్క్‌లు, జిమ్‌లు, స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ వంటి చోట కరోనా నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఆ బాధ్యతలను అధికారులకు అప్పగించాలి. నిబంధనలను అమలు చేయని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించాలి. ఐదు అంచెల వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలి. ఇందులో ఎక్కడ నిర్లక్ష్యం ఉన్నా అందుకు అధికారులను బాధ్యులను చేయాలని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు.

  R ఫ్యాక్టర్ అంటే ఏంటి?
  ఆర్ ఫ్యాక్టర్ అంటే రిప్రొడక్షన్ రేటు. ఒక వ్యక్తి ద్వారా ఎంత మంది ఇన్‌ఫెక్షన్ గురవుతున్నారో ఈ నెంబర్ సూచిస్తుంది. ఉదాహరణకు ఆర్ ఫ్యాక్టర్ 2 అంటే.. ఒక వ్యక్తి నుంచి ఇద్దరికి వ్యాధి సంక్రమిస్తోందని అర్ధం. ఈ ఆర్ ఫ్యాక్టర్ 1 దాటకూడదు. అలా జరిగితే అక్కడ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ లెక్కల ప్రకారం.. మనదేశంలో కేరళ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో ఆర్ ఫ్యాక్టర్ పెరిగింది. మనదేశంలో మే నెలలో 0.78గా ఉన్న ఆర్ ఫ్యాక్టర్ జూన్లో 0.88కి చేరింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ పతాక స్థాయిలో ఉన్నప్పుడు మార్చి 9-ఏప్రిల్ 21 మధ్య ఆర్ ఫ్యాక్టర్ 1.37గా ఉండేది. అందుకే ఆర్ ఫ్యాక్టర్ 1 కంటే ఎక్కువ ఉంటే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


  మన దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. మంగళవారం 38,792 మంది కోవిడ్ బారినపడ్డారు. కొత్తగా 41,000 మంది కోలుకున్నారు. మరో 624 మంది మరణించారు. తాజా లెక్కలతో ఇండియాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,09,46,074కి చేరింది. వీరిలో 3,01,04,720 మంది కోలుకున్నారు. కోవిడ్ బారినపడి 4,11,408 మంది మరణించారు. ప్రస్తుతం భారత్‌లో 4,29,946 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ప్రస్తుతం మనదేశంలో కేరళలోనే ఎక్కువ మంది కోవిడ్ బారినపడుతున్నారు. కేరళలో నిన్న 14,539 మంది కరోనా బారినపడుతున్నారు. మహారాష్ట్రలో 7,243 మందికి పాజిటివ్ వచ్చింది. కేరళలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు.
  Published by:Shiva Kumar Addula
  First published: