Explained: ఇండియాలో డబుల్ మ్యూటాంట్ కరోనా వైరస్... కేసులు అందుకే పెరుగుతున్నాయా?

ఇండియాలో డబుల్ మ్యూటాంట్ కరోనా వైర (image credit - NIAID)

India Coronavirus: అసలేంటి డబుల్ మ్యూటాంట్ అంటే... ఆ కరోనా వైరస్ ఎలా ఉంటుంది... అది ఇండియాలోకి ఎలా వచ్చింది? దాని వల్ల ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి? తెలుసుకుందాం.

 • Share this:
  India Coronavirus: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇండియాలో రోజూ 2 లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు వస్తుండటాన్ని చూస్తున్నాం. సడెన్‌గా ఎందుకు ఇంతలా వైరస్ విజృంభిస్తోంది అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. దీనిపై ఆరోగ్య నిపుణులు షాకింగ్ విషయం చెప్పారు. ఇండియాలో కరోనా సోకుతున్న చాలా మందిలో విచిత్రమైన కరోనా వైరస్ కనిపిస్తోందట. దాన్ని డబుల్ మ్యూటేషన్ కరోనా వైరస్ అంటున్నారు. అంటే ఏంటి అనే డౌట్ మనకు వస్తుంది. సింపుల్‌గా చెప్పుకుందాం... మన వెంట్రుకలో వెయ్యి కరోనా వైరస్‌లు పట్టగలవు. అవి అంత చిన్నగా ఉంటాయి. కాబట్టి వాటి ఆకారం వాతావరణాన్ని బట్టీ మారిపోతూ ఉంటుంది. అలా ఓసారి రూపాంతరం (mutant) చెందిన వైరస్ మొదటి వైరస్ కంటే కాస్త బలంగా ఉంటుంది. ఇలా రూపాంతరం చెందిన వైరస్... మరోసారి రూపాంతరం (double mutant) చెందితే అది మరింత బలంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వైరస్ ఎంతలా మ్యూటేషన్ చెందితే అంతలా మానవాళికి ప్రమాదమే.

  ఇప్పుడున్న వ్యాక్సిన్లు దాన్ని చంపగలవా?
  కష్టమే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు మొదటి రకం వైరస్‌ని ఎదుర్కోవడానికి తయారుచేసినవి. అవి మహా అయితే... ఒకసారి రూపాంతరం చెందిన వాటిని ఎదుర్కోగలవు. రెండోసారి రూపాంతరం చెందిన వైరస్‌ని ఆ వ్యాక్సిన్లు ఎదుర్కోగలవు అని చెప్పలేకపోతున్నారు. అందుకే బూస్టర్ వ్యాక్సిన్లు తయారుచేస్తున్నారు. అవి సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయి. అవి డబుల్ మ్యూటాంట్ కరోనా వైరస్‌ని కూడా ఎదుర్కోగలవు.

  వైరస్ మరింతగా రూపాంతరం చెందగలదా?
  చెందగలదు. సపోజ్ బూస్టర్ వ్యాక్సిన్లు ఇచ్చాక... తనను చంపేస్తున్నారు అని గుర్తించే వైరస్... బతికేందుకు తనను తాను మరింతగా రూపాంతరం చెందించుకోగలదు. లేదంటే చావగలదు. కచ్చితంగా ఏం జరుగుతుందో చెప్పలేం.

  రూపాంతరం అంటే రూపం మొత్తం మారిపోతుందా?
  లేదు. వైరస్ రూపం సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే... దాని చుట్టూ ఉన్న ముళ్లు (spikes) కాస్త పెద్దవి అవుతాయి. అందువల్ల అది మరింత వేగంగా బాడీలోకి దూసుకెళ్లడానికీ, కణాలను మరింత వేగంగా చీల్చేసి వాటిలో నివసించడానికీ వీలవుతుంది.

  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఏమంది?
  ప్రపంచ ఆరోగ్య సంస్థలో టెక్నికల్ లీడ్ ఆఫీసర్ మారియా వాన్ కెర్ఖోవ్ దీనిపై స్పందించారు. "ఇది చాలా ఆసక్తి రేపుతోంది. మేము దీన్ని గమనిస్తున్నాం. ఇలాంటి డబుల్ మ్యూటేషన్ వైరస్‌లు రెండు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశమే. ఇవి వేగంగా వ్యాపించడమే కాదు... వ్యాక్సిన్లను ఎదుర్కోగలవు కూడా" అని అన్నారు.

  ఇండియాకి డేంజరేనా?
  WHO ప్రకారం ఇండియాకి ఈ వైరస్ డేంజరే. మనం చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించకుండా ఇది చెయ్యగలదని అంటోంది. ఇది 10 దేశాల్లో ఉందని చెప్పింది. ఐతే... ఇండియాలో కరోనా కేసులు పెరగడానికి ఈ డబుల్ మ్యూటాంటే కారణమా అన్న దానిపై భారత ప్రభుత్వం ఇంకా కచ్చితమైన ఆన్సర్ ఇవ్వలేదు.

  ఏ దేశాల్లో ఉంది?
  అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం, జర్మనీ, ఐర్లాండ్, నమీబియా, న్యూజిలాండ్, సింగపూర్, బ్రిటన్

  ఈ కొత్త వైరస్‌కి పేరు ఉందా?
  ఉంది. B.1.617

  రెండు రూపాంతరాలు ఏవి?
  E484Q, L452R

  తొలిసారి ఎప్పుడు కనిపెట్టారు?
  ఇండియాలో గతేడాది దీన్ని ఓ సైంటిస్ట్ కనిపెట్టారు. పూర్తి వివరాల్ని సోమవారం WHOకి ఇవ్వబోతున్నారు.

  ఇది కూడా చదవండి: Watermelon Seeds: పుచ్చకాయ గింజలు తింటే ప్రమాదమా? పొట్టలో మొక్కలు మొలుస్తాయా?

  ఇప్పుడు మనం ఏం చెయ్యాలి?
  మనం మన ప్రయత్నాలు కొనసాగించాలి. మాస్క్ పెట్టుకోవాలి. శానిటైజర్లు రాసుకోవాలి. సోషల్ డిస్టాన్స్ పాటించాలి. కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి.
  Published by:Krishna Kumar N
  First published: