Home /News /national /

INDIA CHINA REACH 5POINT CONSENSUS ON LADAKH SITUATION TAKE OPPOSING VIEWS ON BILATERAL TIES SK

India-China: రష్యాలో ఇండియా, చైనా మధ్య చర్చలు.. కీలక ఒప్పందం..

భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ

భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ

సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు ఐదు అంశాలతో కూడిన ప్రణాళికను ఖరారు చేశారు.

    లద్దాఖ్ సరిహద్దులో డ్రాగన్ చెలరేగిపోతోంది. ఎల్ఏసీ వద్ద భారీగా సైన్యాన్ని మోహరించి భారత్‌లోకి చొచ్చుకొచ్చేందుకు కుట్రలు చేస్తోంది. ఈ క్రమంలో పలు మార్లు భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ జరిగింది. సరిహద్దుల్లో రెచ్చిపోతున్న చైనాకు అంతకు మించి స్థాయిలో బదలిస్తోంది భారత్ సైన్యం. పోటాపోటీగా సైన్యాలను మోహరించడంతో లద్దాఖ్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణాన్ని ముగింపు పలికే దిశగా భారత్, చైనా మధ్య అత్యుతన్న స్థాయి చర్చలు జరిగాయి. మాస్కో‌లో షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గురువారం భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే అంశంపై సుమారు 2 గంటలన్నర పాటు చర్చలు జరిపారు.

    సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు ఐదు అంశాలతో కూడిన ప్రణాళికను ఖరారు చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రెండు దేశాలకు మంచిది కాదని భారత్‌తో పాటు చైనా సైతం అంగీకరించింది. తక్షణమే ఎల్‌ఏసీ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగించడం, వెంటనే సైన్యాలను వెనక్కి రప్పించడం, ఎల్ఏసీ నుంచి సమదూరం పాటిచడం ద్వారా పరిస్థితి చక్కదిద్దాలని నిర్ణయానికి వచ్చాయి.

    ఐతే సమావేశంలో చైనా తీరుపై జైశంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎల్‌ఏసీ సమీపంలో చైనా బలగాలు భారీగా ఆయుధాలను తరలించడాన్ని ప్రశ్నించారు. 1993, 1996 ఒప్పందాల తర్వాత ఇంతటి భారీ స్థాయిలో సైన్యాన్ని ఎప్పుడూ మోహరించలేదని.. ఆ పరిస్థితులు ఎందుకొచ్చాయని నిలదీశారు. దీనికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ స్పష్టమైన సమాధానం చెప్పలేదని సమాచారం.

    కాగా, భారత్, చైనా సరిహద్దుల్లో మే నుంచి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గల్వాన్ ఘర్షణతో పాటు ఇటీవల పాంగాంగ్ సరస్సు సమీపంలో జరిగిన ఘటన తర్వాత.. ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. మిలటరీ స్థాయిలో చర్చలు జరిగినా ఫలితం లేకపోయాయి. చైనా దళాలు భారీగా మోహరించడం.. ఆయుధాలను తరలించడంతో.. భారత్ సైతం ధీటుగా స్పందించింది. ఇలా 4 నెలలుగా ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇరుదేశాల మధ్య ఒప్పందం జరగడం మంచి పరిణామమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Indian Army, Indo China Tension, Ladakh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు