India-China Meet: నేడు చైనా రక్షణమంత్రితో రాజ్‌నాథ్ సింగ్ భేటీ... డ్రాగన్‍‌కు వార్నింగ్?

India-China Meet: నేడు చైనా రక్షణమంత్రితో రాజ్‌నాథ్ సింగ్ భేటీ... డ్రాగన్‍‌కు వార్నింగ్?

India-China Meet: ఇన్నాళ్లూ ఇండియా-భారత్ సైనికాధికారుల మధ్యే చర్చలు జరిగాయి. ఇప్పుడు ఇండియా దూకుడుతో టెన్షన్ పడుతున్న చైనా... రక్షణ మంత్రుల స్థాయి చర్చలకు సిద్ధపడింది.

  • Share this:
    India-China Meet: ఇండియాని తక్కువ అంచనా వేసి... చైనా పాలకులు షాకులో ఉన్నారు. సరిహద్దుల్లో తమ సైన్యాన్ని ఎగదోస్తే... ఇండియన్ ఆర్మీ ఏం చేయలేదనుకున్న బీజింగ్ పాలకులకు... భారత సైన్యం నుంచి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రాన్రానూ వివాదం ముదురుతుంటే... ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ఇండియా-చైనా శాంతియుతంగా చర్చించుకోవాలని కోరుతున్నాయి. సైనికాధికారుల మధ్య జరుగుతున్న చర్చల వల్ల ఫలితం కనిపించట్లేదు. అందుకే... డైరెక్టుగా రక్షణ శాఖ మంత్రులే చర్చలకు రెడీ అయ్యారు. భారత్ నుంచి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ చర్చలో పాల్గోనుండగా... చైనా వైపు నుంచి ఆ దేశ రక్షణ మంత్రి వీ ఫెంఘె (Wei Fenghe) పాల్గొనబోతున్నారు. ఒక్క అంగుళం భూమిని కూడా వదిలే ప్రసక్తే లేదని ఇప్పటికే రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అటు చైనా మాత్రం అదనంగా బలగాల్ని, యుద్ధ ట్యాంకుల్ని లఢక్ సరిహద్దులకు పంపి... చర్చలకు సిద్ధమైంది.

    రష్యా... మాస్కోలోని... షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) రక్షణ శాఖ మంత్రుల సదస్సు జరుగుతోంది. అక్కడే అధికారికంగా జరగబోతున్న మీటింగ్ ఇది. జూన్ 15 తర్వాత... ఆగస్ట్ 29-31 మధ్య మరోసారి చైనా సైన్యం భారత్‌లోకి వచ్చేందుకు యత్నించడం... దాన్ని ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టడం వంటివి జరిగాయి. ఈ పరిస్థితుల్లో ఇలాంటి మీటింగ్‌కి చైనాయే గురువారం ప్రతిపాదన పంపింది. ఇప్పటికే మిలిటరీ స్థాయిలో చాలాసార్లు చర్చలు జరిగాయి. రెండువైపులా సైన్యాన్ని వెనక్కి పంపేందుకు ఒప్పుకుంటూనే... చైనా మాట తప్పుతోంది. అందువల్లే రక్షణ శాఖ మంత్రుల స్థాయిలో భేటీ తప్పనిసరైంది.

    ప్రస్తుతం సరిహద్దుల్లో రెండువైపులా భారీగా సైన్యాలు మోహరించి ఉన్నాయి. యుద్ధం చేసే ఉద్దేశం ఎవరికీ లేకపోయినా... ఎవరి పరిస్థితులకు అనుగుణంగా వాళ్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధానంగా కుయుక్తుల చైనా పన్నుతున్న కుట్రల వల్లే భారత్ సర్వసన్నద్ధం కావాల్సి వస్తోంది. "చైనా తీరు చూస్తే... పరిస్థితి కొంచెం టెన్షన్ గానే ఉంది" అని... శుక్రవారం లేహ్‌లో రెండ్రోజుల పర్యటన ముగించాక... ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే అభిప్రాయపడ్డారు. రక్షణ మంత్రుల భేటీ అంటే... డైరెక్టుగా ప్రభుత్వాలే చర్చలకు దిగినట్లు లెక్క. ఈ భేటీ తర్వాతైనా చైనా తీరు మారకపోతే... ఇండియా మరింత బలంగా డ్రాగన్ మెడలు వంచేందుకు సిద్ధపడే అవకాశాలుంటాయి.
    Published by:Krishna Kumar N
    First published: