India-China Border Tensions: గాల్వన్ ఘర్షణ... గాయపడ్డ సైనికులు సంఖ్య ఎంతంటే..

India-China Border Tensions | గాల్వన్‌లో లోయ దగ్గర జరిగిన ఘర్షణలో గాయపడిన మరికొందరు సైనికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై ఆర్మీ వర్గాలు స్పందించాయి.

news18-telugu
Updated: June 19, 2020, 12:34 PM IST
India-China Border Tensions: గాల్వన్ ఘర్షణ... గాయపడ్డ సైనికులు సంఖ్య ఎంతంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లద్దాఖ్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయ దగ్గర చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘర్షణలో గాయపడిన మరికొందరు సైనికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ అంశంపై ఆర్మీ వర్గాలు స్పందించాయి. ఈ ఘర్షణలో గాయపడ్డ 58 మంది సైనికులు కోలుకున్నారని వివరించింది. మరో 15 రోజుల్లో వారంతా తిరిగి విధుల్లో చేరతారని తెలిపింది. ఇక ఇదే ఘటనలో గాయపడిన మరో 18 మంది సైనికుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. వారంతా లేహ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆర్మీ వర్గాలు తెలిపినట్టు ఏఎన్‌ఐ వార్తా సంస్థ ప్రకటించింది.



మరోవైపు ఈ ఘర్షణ తరువాత కొందరు సైనికులు కనిపించకుండా పోయారనే వార్తలను ఆర్మీ ఖండించింది. మరోవైపు ఇండియా, చైనా తరపున మేజర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. గాల్వన్ లోయ ప్రాంతంలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకునే దిశగా ఈ చర్చలు సాగుతున్నాయి.


First published: June 19, 2020, 9:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading