హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

India-China: భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ... 20 మంది డ్రాగన్ సైనికులకు గాయాలు

India-China: భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ... 20 మంది డ్రాగన్ సైనికులకు గాయాలు

India-China clash: సరిహద్దుల్లో అంతా బాగానే ఉందని మనం అనుకుంటున్నాం. కానీ నిజంగా అలా లేదా. రెచ్చిపోతున్న చైనాకి భారత్ బలంగా సమాధానం చెబుతోందా?

India-China clash: సరిహద్దుల్లో అంతా బాగానే ఉందని మనం అనుకుంటున్నాం. కానీ నిజంగా అలా లేదా. రెచ్చిపోతున్న చైనాకి భారత్ బలంగా సమాధానం చెబుతోందా?

India-China clash: సరిహద్దుల్లో అంతా బాగానే ఉందని మనం అనుకుంటున్నాం. కానీ నిజంగా అలా లేదా. రెచ్చిపోతున్న చైనాకి భారత్ బలంగా సమాధానం చెబుతోందా?

  India-China border: పక్కలో బల్లేన్నీ... చైనానీ పక్కపక్కన పెడితే... ఏది ఏదో గుర్తుపట్టలేం. రెండూ ఒకేలా ఉంటాయి. పక్కలో బల్లెం కంటే ప్రమాదకరమైనది డ్రాగన్ దేశం. తెల్లారి లేస్తే కుట్రలు, కుతంత్రాలు. ఎప్పుడు ఏ దేశ భూభాగాన్ని దోచుకుందామా అని కాచుక్కూర్చుంటారు. సరిహద్దుల్లో తెగ రెచ్చిపోతుంటే... భారత సైన్యం కూడా... చూచుకుందా నీ ప్రతాపమో... నా ప్రతాపమో అని దీటుగా బదులిస్తోంది. తాజాగా సిక్కిం సరిహద్దుల్లో... చొచ్చుకు వచ్చేందుకు చైనా సైన్యం యత్నించడంతో... భారత్ ఆర్మీ... బలంగా అడ్డుకుంది. చిన్ని కళ్ల సైన్యాన్ని వెనక్కి పంపింది. అయితే అక్కడ భీకరమైన పోరాటం జరగడం... భారత సైన్యం గట్టిగా పోరాడటంతో... చైనా సైనికులు 20 మంది ఈ ఘర్షణల్లో గాయపడినట్లు తెలిసింది. ఇదంతా 3 రోజుల కిందట జరిగినట్లు తెలిసింది. ఉత్తర సిక్కిం‌లోని నాథులా లోయ సరిహద్దు దగ్గర ఇది జరిగినట్లు తెలిసింది

  గుంటనక్కల్లా సరిహద్దు దాటుతున్న చైనా సైనికుల్ని భారత సైన్యం చూసీ చూడగానే... వెనక్కి వెళ్లమని వార్నింగ్ ఇవ్వగా... చప్పిడి ముక్కు సైన్యం వెనక్కి వెళ్లకపోగా... చూంచామ్ అంటూ ముందుకు వస్తుంటే... వెంటనే మన సైన్యం బలంగా అడ్డుకుంది. దాంతో డ్రాగన్ సైన్యం దాడులు చేసేందుకు యత్నించగా... ఇదివరకు ఇలాంటి కుట్రలు చాలా జరగడంతో... ఆల్రెడీ అలర్టై ఉన్న ఇండియన్ ఆర్మీ జూలు విదిల్చింది. దెబ్బకి డ్రాగన్ తోకముడవాల్సి వచ్చింది... అది కూడా గాయాలతో.

  ఈ ఘటన జరిగినప్పుడు అక్కడి వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు. అసలు అలాంటి వాతావరణంలోనే చొచ్చుకు వెళ్లొచ్చని చైనా సైన్యం కుట్ర పన్నింది. అయినప్పటికీ ఇండియన్ ఆర్మీ ఆనందం తీర్చేసింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఉన్నా... నిలకడగా ఉందని ఇండియన్ ఆర్మీ వర్గాల నుంచి తెలుస్తోంది.

  గడ్డకట్టే మైనస్ డిగ్రీల వాతావరణంలో కూడా ఇండియన్ ఆర్మీ చాలా కఠినంగా ఉంటూ... తట్టుకుంటూ నిఘా ఉంచుతోంది. అలాంటి చోట బైనాక్యులర్లు కూడా పనిచేయవు. వాటిపైనా మంచు పేరుకుపోతుంది. అయినప్పటికీ జాగ్రత్తగా పహారా కాస్తోంది.

  ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ 5 రాశుల వారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ... మీరూ అంతేనా...

  మీకు గుర్తుందిగా... గతేడాది జూన్ 15న ఇలాగే లఢక్‌లో చొచ్చుకొచ్చిన చైనా ఆర్మీ... ఘర్షణకు దిగింది. ఆ ఘటనలో మన సైనికులు 20 మంది అమరులు అయ్యారు. ఈ దిక్కుమాలిన చైనా మన పక్కన ఉండటం వల్ల మనకు నిరంతరం ఇలాంటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదుల కంటే ఈ డ్రాగన్ సైన్యం సమస్య ఇప్పుడు ఎక్కువైనట్లు మనకు కనిపిస్తోంది.

  First published:

  ఉత్తమ కథలు