భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు రద్దు!

భారత భద్రతా దళాలపై దాడుల నేపథ్యంలో పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిజస్వరూపం బయటపడిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మండిపడింది.

news18-telugu
Updated: September 21, 2018, 7:34 PM IST
భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు రద్దు!
అటకెక్కిన భారత్-పాక్ మధ్య చర్చల ప్రతిపాదన
  • Share this:
పాక్‌తో శాంతి చర్చలు పునరుద్ధరించే యోచనను భారత ప్రభుత్వం విరమించుకుంది. జమ్ముకశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముగ్గురు జమ్ముకశ్మీర్ పోలీసులను పొట్టనపెట్టుకోవడంతో చర్చల విషయంలో భారత్ తన మనసు మార్చుకుంది. 2016 తర్వాత ఇరు దేశాల మధ్య నిలిచిపోయిన శాంతి చర్చలు పునరుద్ధరించాలని కోరుతూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. న్యూయార్క్‌లో ఈ నెలాఖర్లో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సుష్మా స్వరాజ్, ఖురేషీల మధ్య భేటీకి అంగీకరించాలని కోరారు. దీని పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రం...విదేశాంగ మంత్రుల మధ్య న్యూయార్క్‌లో భేటీకి అంగీకరించింది.

అయితే గత రెండ్రోజులుగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. రెండ్రోజుల క్రితం దేశ సరిహద్దులో భారత జవాను గొంతు కోసిన పాక్ ముష్కరులు...గురువారం ముగ్గురు జమ్ముకశ్మీర్ పోలీసులను హతమార్చారు. శాంతి చర్చల ముసుగులో పాక్ చేస్తున్న కుట్రలు బయటపడడంతో శాంతి చర్చల పునరుద్ధరణ యోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది.


విదేశాంగ మంత్రుల మధ్య భేటీకి భారత్ అంగీకరించిన తర్వాత...గత రెండ్రోజులుగా జమ్ముకశ్మీర్‌లో ఇబ్బందికర పరిణామాలు చోటుచేసుకున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ పేర్కొన్నారు.  20 మంది పాక్ తీవ్రవాదుల పోస్టల్ స్టాంపులను విడుదల చేయాలన్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఖండించారు. పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ నిజ స్వరూపం బయటపడిందని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో శాంతి చర్చలు పునరుద్ధరించలేమని స్పష్టంచేశారు.
Published by: Janardhan V
First published: September 21, 2018, 6:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading