INDIA BEGINS COVID VACCINE BOOSTER DOSE FROM TODAY REGISTRATION NOT NEEDED OTHER DETAILS HERE MKS
Covid booster dose India: భారత్ మరో అడుగు.. బూస్టర్ డోసు పంపిణీ షురూ.. ఎలా పొందాలంటే..
ప్రతీకాత్మక చిత్రం
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సహా పాత డెల్టా ఇతర వేరియంట్లు దేశంలో మళ్లీ కలకలం రేపుతున్న సమయంలో కొవిడ్ వ్యాక్సిన్ మూడో డోసు పంపిణీని ప్రభుత్వాలు చేపట్టాయి. నేటి (జనవరి 10, సోమవారం) నుంచి దేశవ్యాప్తంగా అర్హులు అందరికీ కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీ మొదలైంది.
కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ మరో మైలురాయిని దాటింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సహా పాత డెల్టా ఇతర వేరియంట్లు దేశంలో మళ్లీ కలకలం రేపుతున్న సమయంలో కొవిడ్ వ్యాక్సిన్ మూడో డోసు పంపిణీని ప్రభుత్వాలు చేపట్టాయి. నేటి (జనవరి 10, సోమవారం) నుంచి దేశవ్యాప్తంగా అర్హులు అందరికీ కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీ మొదలైంది. మహమ్మారిపై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్లుగా భావించే ఆరోగ్య కార్యకర్తలు, భద్రతా, పోలీస్ దళాలతోపాటు 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ బూస్టర్ డోసు పొందేందుకు అర్హులు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న ఐదు రాష్ట్రాల్లోని ఈసీ సిబ్బందిని సైతం ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి మూడో డోసును అందింస్తారు. వివరాలివి..
మూడో(బూస్టర్) డోసు పొండానికి అర్హులైన వారిలో 1.05 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, 1.9 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ కార్మికులు, ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన 2.75 కోట్ల మందిని అర్హులుగా గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అర్హులుగా గుర్తించిన వారి ఫోన్ నంబర్‌కు కోవిన్ పోర్టల్ నుంచి ఎస్ఎంఎస్ అందుతుందని ఆరోగ్య మంత్రి మాండవీయ తెలిపారు.
కాగా, రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత తొమ్మిది నెలలు లేదా 39 వారాల వ్యవధి ఉన్న వారికి బూస్టర్ డోస్ ఇస్తారు. దీనికోసం కొత్తగా కోవిన్ పోర్టల్‌లో మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాగూ ఇప్పటికే రెండు డోసులు పొందారు కాబట్టి ప్రిస్కిప్షన్స్, మెడికల్ హిస్టరీకి సంబంధించి పేపర్లు చూపించకుండానే వృద్ధులు మూడో డోసును పొందొచ్చు.
భారత్ లో కరోనా మూడో వేవ్ కొనసాగుతోన్న దరిమిలా కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఆదివారం ఒక్కరోజే 1.6లక్షల కేసులు, 327 మరణాలు నమోదయ్యాయి. జనవరి చివరి వారం నాటికి రోజువారీ కొత్త కేసులు 2.5లక్షలకు చేరొచ్చనే అంచనాలున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు జనం కదలికలపై ఆంక్షలు విధించాయి. ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 24న జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, బూస్టర్ డోసు, పిల్లలకు టీకాల పంపిణీపై ప్రకటన చేశారు. ఆ మేరకు జనవరి 1 నుంచి 15 ఏళ్లు పైబడిన పిల్లలకు వ్యాక్సిన్లు అందిస్తున్నారు. తాజగా సోమవారం నుంచి బూస్టర్ డోసుల పంపిణీ కూడా మొదలైంది..
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.