Home /News /national /

అమెరికా, రష్యాను బ్యాలెన్స్ చేస్తోన్న భారత్ -మోదీతో భేటీకి పుతిన్ రాక -ఏకే203 తుపాకుల ఫ్యాక్టరీ సహా..

అమెరికా, రష్యాను బ్యాలెన్స్ చేస్తోన్న భారత్ -మోదీతో భేటీకి పుతిన్ రాక -ఏకే203 తుపాకుల ఫ్యాక్టరీ సహా..

మోదీతో పుతిన్ (పాత ఫొటో)

మోదీతో పుతిన్ (పాత ఫొటో)

రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనకు ముందు, మాస్కో ఎప్పటికీ సన్నిహిత రక్షణ భాగస్వామిగా ఉంటుందని భారత్ మరోసారి నొక్కి చెప్పింది. రష్యా తయారు చేసిన క్షిపణి వ్యవస్థ ఎస్-400ను భారత్ కొనడంపై అమెరికా ఆగ్రహించిన దరిమిలా రెండు దేశాలను బ్యాలెన్స్ చేస్తూ, భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది.

ఇంకా చదవండి ...
సమయాన్ని బట్టి చూస్తే చాలా చిన్నదే అయినా, భారత్ లో పూర్తిగా పవర్ ప్యాక్డ్ పర్యటన చేయనున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పలు కీలక అంశాలపై చర్చించేందుకుగానూ పుతిన్ సోమవారం నాడు భారత్ వస్తున్నారు. ఢిల్లీ వేదికగా భారత్ , ర‌ష్యాల మ‌ధ్య 21వ వార్షిక ద్వైపాక్షిక స‌ద‌స్సులో నేతలిద్దరూ పాల్గొంటారు. ఈసారి టూ ప్లస్ టూ చర్చలు కూడా జరుగుతోన్న నేపథ్యంలో రష్యా విదేశాంగ‌మంత్రి సెర్జీలావ‌రోవ్ , ఆ దేశ రక్షణ మంత్రి సెర్జి షోయ్ గులు ఆదివారం రాత్రే భార‌త్ కి రానున్నారు. వీరిద్దరూ మన విదేశాంగ, రక్షణ మంత్రులైన జైశంకర్, రాజ్ నాథ్ సింగ్ లతో సమావేశం అవుతారు. ఈ సదస్సులోనే ఇరు దేశాల మధ్య సైనిక, ఆర్థిక, వాణిజ్య, ఇంధన, అంతరిక్ష, సాంకేతిక, సాంస్కృతిక రంగాలకు సంబంధించి రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరుగనున్నాయి.

రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనకు ముందు, మాస్కో ఎప్పటికీ సన్నిహిత రక్షణ భాగస్వామిగా ఉంటుందని భారత్ మరోసారి నొక్కి చెప్పింది. రష్యా తయారు చేసిన క్షిపణి వ్యవస్థ ఎస్-400ను భారత్ కొనడంపై అమెరికా ఆగ్రహించిన దరిమిలా రెండు దేశాలను బ్యాలెన్స్ చేస్తూ, భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. రక్షణ రంగంలో ఒప్పందాల్లో భాగంగా యూపీ అమేథీలోని కోర్వాలో రూ.5వేల కోట్లతో సంయుక్తంగా నెలకొల్పిన ఫ్యాక్టరీలో ఏకే-203 రైఫిళ్ల తయారీకి కూడా కేంద్రం అనుమతిచ్చిన అంశం, ఆర్మీ అవసరాల కోసం రెండు ఇంజన్ల 226టీ రకం తేలికపాటి హెలికాప్టర్లను సంయుక్తంగా తయారు చేయాలనే నిర్ణయంపై నేతలు మాట్లాడుకోనున్నారు. మొత్తం 200 హెలికాప్టర్ల తయారీకి ఒప్పందం కుదిరే వీలుంది. మరీ ముఖ్యంగా..

etela rajenderకు చెక్ పెడుతున్నారా? -తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటనలో అర్థం ఇదేనా?అమెరికా తన నుంచి మరిన్ని రక్షణ కొనుగోళ్లను చూడాలని భారత్‌పై ఒత్తిడి పెంచినప్పటికీ, రష్యా నుంచి ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయడం వల్ల కాట్సా( CAATSA)(అమెరికాకు ముప్పు లేని ఒప్పందం) మంజూరు ఇబ్బందికర పరిణామంగా మారింది. ఎస్-400 వ్యవస్థను దేశాలేవీ కొనరాదని అమెరికా చెప్పినా, భారత్ ఒప్పందానికే ముందుకెళ్లింది. రక్షణ కొనుగోళ్లలో వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి. S-400 డెలివరీలో మొదటిది ఇప్పటికే ప్రారంభమైంది. కరోనా వైరస్, వ్యాక్సిన్లు, ఇతర మందుల పంపిణీపైనా చర్చలు జరుగనున్నాయి.

Shadnagar : చెత్త ఏరుకునే వ్యక్తితో వివాహిత అక్రమ సంబంధం.. భర్త బయటికెళ్లగానే ప్రతిరోజూ.. చివరికి ఏమైందంటే..పుతిన్ పర్యటన సందర్భంగా భారత్, రష్యా చేసుకోబోయే ఒప్పందాలు ఏమిటనేది ప్రస్తుతానికి వెల్లడికాలేదు. భద్రతా కారణాల రీత్యా కొన్ని ఒప్పందాలను మాత్రమే బయటికి వెల్లడిస్తారని తెలుస్తోంది. ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు పర్యటించే బృంద సభ్యుల సంఖ్యను తగ్గించినట్టు స‌మాచారం. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు మోదీ-పుతిన్ ల మధ్య సమావేశం ప్రారంభం అవుతుంది. సోమవారం రాత్రి 9.30 గంటల తర్వాత పుతిన్ తిరిగి రష్యా వెళ్లిపోతారు.
Published by:Madhu Kota
First published:

Tags: India, Pm modi, Russia, Vladimir Putin

తదుపరి వార్తలు