news18-telugu
Updated: October 20, 2019, 3:21 PM IST
(ప్రతీకాత్మక చిత్రం, image: Reuters)
పాక్ దుశ్చర్యలకు చెక్ పెడుతూ ఇండియన్ ఆర్మీ మరోసారి దాడులకు దిగింది. ఇప్పటికే రెండు సార్లు ఒకసారి సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ ఎయిర్ దాడుల తర్వాత మరోసారి భారత రక్షణ దళాలు ఉగ్రవాదులకే లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఇప్పటి వరకూ అందిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పొడస్తూ..కుప్వారా జిల్లాలోని తాంఘర్ సెక్టార్లో భారత బలగాలపైకి పాకిస్థాన్ దళాలు కాల్పులు జరిపాయి. దీంతో భారత ఆర్మీ గట్టిజవాబు చెప్పింది. ఆర్టిలరీ గన్స్‌ను ఉపయోగించి.. ఉగ్ర క్యాంపులే లక్ష్యంగా కాల్పులకు దిగింది. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బుల్లెట్ల వర్షం కురిపించింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని నీలమ్ వ్యాలీలోని నాలుగు ఉగ్రస్థావరాలను టార్గెట్ చేస్తూ భారత ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది. దీంతో ఆ నాలుగు క్యాంపులు నేలమట్టమైనట్లు తెలుస్తోంది. భారత సైన్యం కాల్పుల్లో పాకిస్థాన్‌వైపు కూడా భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది.
ఈ దాడిలో పలు టెర్రర్ క్యాంపులు ధ్వంసమయ్యాయి. అంతేకాదు ఐదుగురు పాక్ ఆర్మీ జవాన్లు చనిపోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పాక్ కాల్పులతో సరిహద్దు గ్రామాల్లోని మరో ఇద్దరు పౌరులు కూడా గాయపడ్డారని సమాచారం. అలాగే రెండు ఇళ్లు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
Published by:
Krishna Adithya
First published:
October 20, 2019, 3:21 PM IST