హోమ్ /వార్తలు /జాతీయం /

Surgical Strike 2 : పదునైన వ్యూహంతో, పక్కా ప్రణాళికతో భారత్ ప్రతీకారం

Surgical Strike 2 : పదునైన వ్యూహంతో, పక్కా ప్రణాళికతో భారత్ ప్రతీకారం

భారత యుద్ధ విమానాలు (File)

భారత యుద్ధ విమానాలు (File)

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసి ముష్కరులను హతమార్చిన భారతసైన్యం.. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. వీరజవాన్లు చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు వడ్డీతో సహా శత్రువులకు ముట్టజెప్పారు. వందల సంఖ్యలో ముష్కరులను మట్టుబెట్టి.. పాక్‌కు ఇండియన్ ఆర్మీ దెబ్బను రుచి చూపించారు.

ఇంకా చదవండి ...

  పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసి ముష్కరులను హతమార్చిన భారతసైన్యం.. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. వీరజవాన్లు చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు వడ్డీతో సహా శత్రువులకు ముట్టజెప్పారు. వందల సంఖ్యలో ముష్కరులను మట్టుబెట్టి.. పాక్‌కు ఇండియన్ ఆర్మీ దెబ్బను రుచి చూపించారు. మరి ఈ మెరుపుదాడి అప్పటికప్పుడు చేసింది కాదు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇండియన్ ఆర్మీ అత్యంత గోప్యంగా పదునైన వ్యూహాన్నే రచించింది. ఘటన జరిగిన మరుసటి రోజునుంచే పక్కా స్కెచ్ వేయడం మొదలుపెట్టింది. అనుకున్నది సాధించింది. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడి నుంచి భారత్ ఆర్మీ చాలా తొందరగానే తేరుకుంది. 15వ తేదీ నుంచే ప్రతీకారానికి వ్యూహరచన మొదలు పెట్టింది. పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రమూకల స్థావరాలపై దాడులకు ప్రణాళిక రచించిన ఐఏఎఫ్.. ప్రభుత్వం నుంచి అదేరోజు ఆమోదం పొందింది.

  surgical strike 2, indian air force, india strikes back, balakot, india air stike, mirage 2000, muzaffarabad, line of control, Pulwama revenge, pulwama effect, pulwama terror attack
  ప్రతీకాత్మక చిత్రం

  ఇక, ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు, నాలుగురోజుల పాటు భారత ఆర్మీ, ఐఏఎఫ్ సంయుక్తంగా ప్రత్యర్థులపై నిఘా పెట్టాయి. శత్రుమూకల సమాచారాన్ని సేకరించాయి.

  ఫిబ్రవరి 20 నుంచి 22..  దాడులు ఎక్కడెక్కడ చేయాలనే అంశంపై రెండ్రోజుల పాటు చర్చించి వైమానిక దళం ఒక క్లారిటీకి వచ్చింది. రూట్ మ్యాప్ సిద్ధం చేసింది.

  ఫిబ్రవరి 21న ఉగ్రమూకల స్థావరాలపై దాడులకు సంబంధించి ఐఏఎఫ్ బలగాలు లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. అజిత్ దోవల్ నేతృత్వంలో ఈ నిర్ణయాలు జరిగిపోయాయి.

  surgical strike 2, indian air force, india strikes back, balakot, india air stike, mirage 2000, muzaffarabad, line of control, Pulwama revenge, pulwama effect, pulwama terror attack
  కశ్మీర్ లోయలో భారత జవాన్లు file

  ఫిబ్రవరి 22న ఐఏఎఫ్.. దాడులకు అవసరమైన యుద్ధ విమానాలను సిద్ధం చేసింది. రెండు స్క్వాడ్రన్ల నుంచి 12 మిరాజ్ 2000లను ఈ సర్జికల్ స్ట్రైక్ కోసం ఎంపిక చేసింది.

  ఫిబ్రవరి 24న సర్జికల్ స్ట్రైక్‌ను ప్రయోగాత్మకం పరిశీలించిన ఐఏఎఫ్.. ఆపరేషన్‌కు సర్వం సిద్ధం చేసింది.

  surgical strike 2, indian air force, india strikes back, balakot, india air stike, mirage 2000, muzaffarabad, line of control, Pulwama revenge, pulwama effect, pulwama terror attack
  భారత యుద్ధ విమానాలు

  ఫిబ్రవరి 24న ప్రధాని మంత్రి మోదీకి ఈ ఆపరేషన్ విషయాన్ని ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ వెల్లడించారు. అన్ని విషయాలను క్లుప్తంగా వివరించి గ్రీన్ సిగ్నల్ పొందారు.

  surgical strike 2, indian air force, india strikes back, balakot, india air stike, mirage 2000, muzaffarabad, line of control, Pulwama revenge, pulwama effect, pulwama terror attack
  ప్రధాని మోదీ

  మంగళవారం, ఫిబ్రవరి 26.. తెల్లవారు జామున వేట మొదలుపెట్టిన ఐఏఎఫ్ 3.45 గంటలకు మొదటి దాడి చేసింది. 3.48 గంటల నుంచి 3.55 గంటల మధ్య మరో లక్ష్యం ముజఫరాబాద్‌నూ ముట్టడించి శత్రుమూకలపై దాడులు చేసింది.

  Surgical Strike-1, 2016 Surgical Strike, Surgical Strike history, Balakot, General Qamar Javed Bajwa, India, India attacks Pakistan, India Attacks Pakistan LIVE, Islamabad, Line of Control, Muzaffarabad, Narendra Modi, New Delhi, pakistan, pm modi, prime minister narendra modi, pulwama attack, Pulwama terror attack, Qamar Jawed Bajwa, సర్జికల్ స్ట్రైక్ చరిత్ర, 2016 సర్జికల్ స్ట్రైక్, పాకిస్తాన్‌పై దాడి, ఎల్‌ఓసీ, పాక్ ఆక్రమిత కశ్మీర్
  Surgical Strike 2: (ప్రతీకాత్మక చిత్రం)

  చివరగా 3.58 గంటల నుంచి 4.04 మధ్య మిరాజ్ యుద్ధ విమానాలు చకోటి ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించాయి. సుమారు 300 మంది ముష్కరులను ఈ ఎయిర్ స్ట్రైక్స్‌లో మట్టుబెట్టింది ఇండియన్ ఆర్మీ.

  First published:

  Tags: Indian Air Force, Pm modi, Pulwama Terror Attack, Surgical Strike 2

  ఉత్తమ కథలు