హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Modi UK Visit: అక్టోబర్‌లో ప్రధాని మోదీ లండన్ పర్యటన.. ఆ ఒక్క ఒప్పందం కోసమేనా..!

Modi UK Visit: అక్టోబర్‌లో ప్రధాని మోదీ లండన్ పర్యటన.. ఆ ఒక్క ఒప్పందం కోసమేనా..!

Modi UK Visit: అక్టోబర్‌లో ప్రధాని మోదీ లండన్ పర్యటన.. ఆ ఒక్క ఒప్పందం కోసమేనా..!

Modi UK Visit: అక్టోబర్‌లో ప్రధాని మోదీ లండన్ పర్యటన.. ఆ ఒక్క ఒప్పందం కోసమేనా..!

Modi UK Visit: ఇటీవల యూకేను అధిగమించి ఇండియా ప్రపంచంలో బలమైన ఐదో ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య మరిన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. దీని కోసం వచ్చే నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లండన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారతదేశాని (India)కి బ్రిటన్‌ (Britain)తో ముందు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే వాణిజ్య సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ఇరు దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. వీలైనంత త్వరగా ఒప్పందాలను ఖరారు చేయాలని యూకే (UK), ఇండియా భావిస్తున్నాయి. ఇటీవల యూకేను అధిగమించి ఇండియా ప్రపంచంలో బలమైన ఐదో ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య మరిన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. దీని కోసం వచ్చే నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) లండన్ (London) పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA)పై సంతకం చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో లండన్‌ వెళ్లనున్నట్లు సమాచారం. అక్టోబర్‌లో ప్రధాని లండన్‌ పర్యటన చేపట్టాలని భారత్, బ్రిటన్‌ భావిస్తున్నాయని కొందరు అధికారులు పేర్కొన్నారు. యూకే ప్రధాన మంత్రిగా బోరిస్ జాన్సన్ వైదొలిగిన తర్వాత ఈ నెల ప్రారంభంలో లిజ్ ట్రస్ ఆ బాధ్యతలు స్వీకరించారు. ఆమె FTAను ఒక ప్రధాన సాధనంగా ఉపయోగించాలని చూస్తున్నారు.

* దీపావళి నాటికి ఒప్పందం

బ్రిటన్ యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశం తక్కువగా ఉండటంతో, భారతదేశంపై యూకే ఆసక్తి చూపుతోందనే ఆరోపణలను ట్రస్ తోసిపుచ్చారు. ఇండియా, యూకే మధ్య ఐదు రౌండ్ల చర్చల్లో FTAపై అధికారిక చర్చలు పూర్తయ్యాయి. కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కరించాల్సి ఉంది. అక్టోబర్ 24న దీపావళి నాటికి ఈ ఒప్పందాన్ని ముగించాలని ఇరు దేశాలు చూస్తున్నట్లు తెలిసింది. FTA భారతదేశానికి యూకే ఎగుమతులను 2035 నాటికి సంవత్సరానికి 16 బిలియన్ల పౌండ్లకు పెంచుతుందని అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ వాణిజ్య కార్యదర్శి, విదేశాంగ కార్యదర్శిగా ట్రస్ గతంలో భారతదేశంతో సన్నిహిత ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించారు. ఆమె 2021 మేలో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం తరఫున భారతదేశం-యూకే మెరుగైన వాణిజ్య భాగస్వామ్యంపై సంతకం చేశారు. దీపావళికి ముందే FTA ముగించడంపై భారతదేశం, యూకే నమ్మకంగా ఉన్నాయని, ఇరు ప్రధానుల సమక్షంలో వాణిజ్య మంత్రులు ఈ ఒప్పందంపై సంతకం చేస్తారని భావిస్తున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. సందర్శన, లాజిస్టిక్స్‌పై అక్టోబర్ మొదటి వారంలోపు తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

* ఒక్క ఒప్పందం కోసమే..

మోదీ టూర్ ఖరారు అయితే, దీపావళి సమయంలో మోదీ లండన్‌లో పర్యటించే అవకాశం ఉంది. కేవలం FTAపై సంతకం చేయడానికి ఈ పర్యటన పరిమితం అవుతుందని చెబుతున్నారు. ఈ విషయమై ఇరు దేశాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ అంశంపై వివరాలు కోరుతూ PMO, వాణిజ్య మంత్రిత్వ శాఖకు న్యూస్ ఏజెన్సీలు పంపిన ఈమెయిల్‌కు కూడా ఎటువంటి రిప్లై రాలేదు.

ఇది కూడా చదవండి : ఆ రూల్ దెబ్బకి తుక్కు తుక్కుగా మారనున్న 20 లక్షల వాహనాలు.. ఎక్కడంటే..

* ఎగుమతులు పెంచడంపై దృష్టి

ఇరుపక్షాలు ఇంకా ఖరారు చేయని అంశాలలో ఆటోమొబైల్స్ , మొబిలిటీ, వలసలకు సంబంధించిన FTA అధ్యాయాలు ఉన్నాయి. యూకే- ఆస్ట్రేలియా ఒప్పందం ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్‌ సహా అనేక రంగాల నుంచి ఆస్ట్రేలియన్ నిపుణులను నియమించుకోవడానికి బ్రిటిష్ సంస్థలకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఆఫర్‌పై భారతదేశం ఇంకా స్పందించలేదని సమాచారం. 26 అధ్యాయాలపై విస్తృత ఒప్పందం ఉందని మరో అధికారి తెలిపారు. అక్టోబరులో మిగిలిన సమస్యలను పరిష్కరించేందుకు రెండు పక్షాలు ఫాస్ట్ ట్రాక్‌పై సంప్రదింపులు జరుపుతున్నాయని అధికార వర్గాల సమాచారం.

* ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్‌

యూరోపియన్ యూనియన్(EU) నుంచి బ్రిటన్ నిష్క్రమించిన తరువాత, భారతదేశం వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో వాణిజ్య ఒప్పందాలపై యూకే ఆసక్తి చూపిస్తోంది. ఇటీవల ఇండియా బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. యూకే 69 దేశాలతో, ఈయూతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారతదేశం ఈ సంవత్సరం ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసింది. ఈయూ, కెనడా, ఇతర దేశాలతో చర్చలు జరుపుతోంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Britain, International news, National News, PM Narendra Modi, Uk

ఉత్తమ కథలు