India and States : దేశవ్యాప్తంగా న్యూస్ అప్‌డేట్స్... రాష్ట్రాల్లో టాప్ న్యూస్

దేశవ్యాప్తంగా న్యూస్ అప్‌డేట్స్... రాష్ట్రాల్లో టాప్ న్యూస్

దేశవ్యాప్తంగా ఏం జరుగుతోంది? ఇవాళ టాప్ న్యూస్ ఏంటి? రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాజకీయంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి?

 • Share this:
  ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 38903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1077618కి పెరిగింది. అలాగే... గత 24 గంటల్లో దేశంలో... 543 మంది కరోనాతో చనిపోయారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 26816కి పెరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK

  కరోనా వైరస్ కారణంగా పెళ్లిళ్ల అనుమతుల విషయంలోనూ ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. పెళ్లిళ్ల కోసం ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలంటూ ఆదేశించింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK

  భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) కొత్త పరిశోధన చేయబోతోంది. ఇందులో BCG వ్యాక్సిన్... కరోనాను అడ్డుకోగలదా అనేది తెలుసుకోనుంది. 60 నుంచి 95 ఏళ్ల వయసు వారికి ఈ BCG వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా... కరోనా నుంచి వాళ్లను కాపాడవచ్చా అనే అంశంపై ICMR అధ్యయనం చేయబోతోంది. ఈ పరిశోధనలో మంచి ఫలితాలు వస్తే... కరోనా హాట్ స్పాట్‌లలో ముఖ్యంగా రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉండే ముసలివారికి BCG వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK

  రావణుడిపై పరిశోధన చేస్తూ శ్రీలంక ప్రభుత్వం పత్రికల్లో ఓ యాడ్ వేసింది. ఎవరి దగ్గరైనా రావణుడికి సంబంధించిన ఏవైనా పత్రాలు ఉంటే ఇవ్వాలని కోరింది. శ్రీలంక టూరిజం శాఖ, వైమానిక రంగ శాఖ కలిసి ఈ యాడ్ ఇచ్చాయి. రావణుడికి సంబంధించిన ఏవైనా పుస్తకాలు ఉంటే కూడా ఇవ్వాలని ఆ యాడ్‌లో కోరాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK

  తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో టాయిలెట్ ఆన్ వీల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతంలో ఆయన మేయర్ పాపాలాల్‌తో కలిసి షి మొబైల్ బయో-టాయిలెట్స్‌ను ప్రారంభించారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK

  గాలిలో తిరిగే దోమల వల్ల కరోనా వ్యాపిస్తుందా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. దోమలు కుడితే కరోనా వస్తుందని ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్‌లో ప్రచారంతో ఊదరగొడుతున్నారు. దీనిపై పరిశోధనల్లో ఓ విషయం తెలిసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK

  జింకోవిట్ అనేది... ఓ మల్టీ విటమిన్, మల్టీ మినలర్ టాబ్లెట్. ఇది కరోనా వైరస్ రాకుండా పూర్తిగా అడ్డుకోలేకపోవచ్చు గానీ... ఇది వాడితో... మనిషిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే... ఇది మన ఇమ్యూనిటీకి మరింత ఎనర్జీని ఇస్తుంది. కరోనా లాంటి వైరస్‌లు దాటిచేసేటప్పుడు... ఇమ్యూనిటీ పవర్ శక్తిమంతంగా అడ్డుకుంటుంది. జింక్ ఉండే మల్టీ విటమిన్ టాబ్లెట్లు వాడటం వల్ల కరోనా రాకుండా ఉంటుందా అనే ప్రశ్న తలెత్తింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK

  అతనో హ్యాకర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న ఓ వ్యక్తి నంబర్ సేకరించాడు. అతనికి కాల్ చేసి... వ్యక్తిగత వివరాలు సేకరించేందుకు యత్నించాడు. డబ్బు ఆశ చూపి... అడ్డగోలుగా మోసం చేద్దామని కుట్ర పన్నాడు. ఓ ఫోన్ కాల్ ద్వారానే ఈ మోసం చేసేందుకు రకరకాల డ్రామాలు ఆడాడు. గుంటూరుకు చెందిన ఆ బాధితుడు... హ్యాకర్ అడిగిన ఎన్నో విషయాలకు సమాధానాలు చెప్పాడు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK

  ఆమె ఓ నర్సింగ్ విద్యార్థిని. ఆమెను ఓ దెయ్యం చనిపోయేందుకు రావాలంటూ పిలుస్తోంది. ఈ విషయం ఇంటిలో ఎవరికైనా చెబితే.. అందరినీ చంపేస్తానంటూ బెదిరించింది. ఏంటీ ఇదంతా.. ఈ రోజుల్లో దెయ్యాలు.. భూతాలు ఏంటి.. అని అంటున్నారా?. అయితే ఇది మేం చెబుతున్న విషయం కాదండోయ్.. ఆమె అమ్మాయి సూసైడ్ నోట్‌లో ఈ విషయమంతా రాసి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK
  Published by:Krishna Kumar N
  First published: