India and States : దేశవ్యాప్తంగా న్యూస్ అప్‌డేట్స్... రాష్ట్రాల్లో టాప్ న్యూస్

దేశవ్యాప్తంగా న్యూస్ అప్‌డేట్స్... రాష్ట్రాల్లో టాప్ న్యూస్

దేశవ్యాప్తంగా ఏం జరుగుతోంది? ఇవాళ టాప్ న్యూస్ ఏంటి? రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాజకీయంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి?

 • Share this:
  టీటీడీని కరోనా వైరస్ కుదిపేస్తోంది. ఇప్పటికే 18 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ రావడంతో శ్రీనివాసం క్వారంటైన్‌ కేంద్రానికి వారిని తరలించారు. ఆలయ పెద్దజీయర్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. మెరుగైన చికిత్స కోసం ఆయన్ని చెన్నై అపోలో హాస్పిటల్‌కి తరలించారు. చిన్న జీయర్‌కి కూడా కరోనా పాజిటివ్ అని తెలిసింది. ఈ పరిస్థితుల్లో తాత్కాలికంగా శ్రీవారి దర్శనాలు నిలిపివేసే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK

  భారత్‌లో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. తాజాగా... గత 24 గంటల్లో 34884 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1038716కి చేరింది. అలాగే... నిన్న ఒక్క రోజే 671 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 26273కి పెరిగింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK

  దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల మేరకు నిన్న ఒక్క రోజే దేశంలో 671 మంది కరోనా రక్కసి కాటుకు మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 26,273కి చేరింది. దేశంలో కరోనా మరణాల రేటు 2.5 శాతంగా ఉంది. ప్రపంచం కరోనా మరణాల రేటు(4.22 శాతం)ను పోల్చితే దేశంలో మరణాల రేటు తక్కువగా ఉన్నా...రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకలిగిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK

  దేశవ్యాప్తంగా నీటి సమస్యను అధిగమించేందుకు మేధావులు, నిపుణులు, ఆయా రాష్ట్రాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు ఇంటింటికీ నీటి సరఫరా చేసే సమయంలో కొంతమంది నల్లాలకు మోటార్లు బిగించి అధిక నీటిని తోడుకుంటున్నారు. ప్రజలకు తాగు నీటి సమస్యను తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. Link

  బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆవు మూత్రంతో కరోనా రాదంటున్నాడు. ప్రజలంతా ఏ టెన్షన్లూ పెట్టుకోకుండా... రోగనిరోధక శక్తని పెంచుకోవడానికి గోమూత్రం (cow urine) తాగాలని చెప్పాడు. అది తాగితే చాలట. ఇక కరోనా మన జోలికి రాదట. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK

  చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ వచ్చింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలగానే... ఆయన అప్రమత్తం అయ్యారు. తనతో తిరిగిన వారు, తనను కలిసివారు అందరూ టెస్ట్ చేయించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK

  ఆంధ్రపదేశ్ ప్రభుత్వం మహిళలకు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వ పింఛన్ తీసుకుంటున్న మహిళలకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. దీంతో చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయిన మహిళలందరూ అప్లై చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK

  విద్యార్థినులకు శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా స్కాలర్‌షిప్స్ ప్రకటించింది. అమ్మాయిలకు రూ.1,86,000 స్కాలర్‌షిప్... రేపటి నుంచి అప్లికేషన్స్... పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK

  ఇండియాలో రకరకాల చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడి... దేశవ్యాప్త నిషేధాన్ని పొందిన షార్ట్ వీడియో మెసేజ్ యాప్ టిక్‌టాక్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ముఖ్యంగా... అమెరికా ఈ యాప్‌ని బ్యాన్ చేసేందుకు రెడీ అవుతోంది. కారణం... ఈ యాప్‌ని నిర్వహిస్తున్న కంపెనీ బైట్ డాన్స్... చైనాలో ఉండటమే. ఈ తలనొప్పిని భరించేకంటే... బైట్ డాన్స్‌కి గుడ్‌బై చెప్పడం బెటరనే ఆలోచనలో ఉంది టిక్ టాక్. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK

  తెలంగాణ ప్రభుత్వం... కొత్త సచివాలయం ఎలా ఉండాలి? ఏం చెయ్యాలనే అంశంపై దృష్టిసారిస్తోంది. జస్ట్ 10 నెలల్లో కొత్త సచివాలయం పూర్తవ్వాలని సీఎం కేసీఆర్... అధికారుల్ని ఆదేశించారు. ఆ రకంగా చూస్తే... వచ్చే ఏడాది మే కల్లా సచివాలయ నిర్మాణం పూర్తైపోయినట్లే. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK

  ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు తయారుచేస్తున్న వ్యాక్సిన్... సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనుషులపై జరిపిన మొదటి ట్రయల్స్ విజయవంతం అయినట్లు వారు తెలిపారు. తమ వ్యాక్సిన్... మనుషుల్లో యాంటీబాడీస్, కిల్లర్ టి సెల్స్‌ని బాగా ఉత్పత్తి చేసిందని వివరించారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. LINK
  Published by:Krishna Kumar N
  First published: