నెహ్రూకు బదులు జిన్నా ప్రధాని అయి ఉంటే?: దలైలామా

news18-telugu
Updated: August 8, 2018, 4:09 PM IST
నెహ్రూకు బదులు జిన్నా ప్రధాని అయి ఉంటే?: దలైలామా
బౌద్ద గురువు దలైలామా(File)
  • Share this:
బౌద్ద గురువు దలైలామా సంచలన వ్యాఖ్యలు చేశారు. జవహర్‌లాల్ నెహ్రూకు బదులు జిన్నా ప్రధాని అయి ఉంటే అవిభాజ్య భారత్ ముక్కలై ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. బుధవారం గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విద్యార్థులతో ముచ్చటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులతో ముచ్చటిస్తున్న క్రమంలో.. తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఓ విద్యార్థి ఆయన్ను ప్రశ్నించారు. దీనికి నెహ్రూను ఉదహరణగా చెబుతూ.. కొన్నిసార్లు తప్పులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. నిజానికి మహమ్మద్ అలీ జిన్నానే ప్రధాని చేయాలని గాంధీ సైతం భావించారని, కానీ తానే ప్రధాని కావాలనుకున్న నెహ్రూ అందుకు ఒప్పుకోలేదని దలైలామా చెప్పారు. ఆనాడు నెహ్రూ గనుక తాను ప్రధాని కావాలని పట్టుబట్టకపోయి ఉంటే.. ఈనాడు భారత్-పాక్ విడిపోయి ఉండేది కాదని అన్నారు. కొన్నిసార్లు తప్పులు అలా జరిగిపోతూ ఉంటాయని, అవి సహజమేనని చెప్పుకొచ్చారు.
Published by: Srinivas Mittapalli
First published: August 8, 2018, 4:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading