#IndependenceDay 2019 : ప్రపంచవ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే సంబరాలు...

73వ స్వాతంత్య్ర దినోత్సవం (Image - Twitter - BharatSpandan)

#IndependenceDay : 73వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా... భారతీయులకు ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

  • Share this:
#IndependenceDay 2019 : బ్రిటీష్ బానిసత్వ సంకెళ్లను వదిలించుకొని... స్వాతంత్ర్యం సిద్ధించి 72 ఏళ్లు పూర్తై... 73వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది భారతదేశం. ఈ సందర్భంగా 130 కోట్ల మంది భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. వీధి వీధిలో... వాడ వాడలో... మూడు రంగుల జాతీయ జెండా రెపరెపలాడుతోంది. ట్విట్టర్లో సెలబ్రిటీలు, ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అధికారిక భవనాలు, చారిత్రక కట్టడాలపై భారత జాతీయ జెండా రంగులు మెరుస్తున్నాయి. న్యూయార్క్ నుంచీ నేపాల్ వరకూ... అంతటా భారతీయుల స్వాతంత్ర్య దినోత్సవాల సందడి కనిపిస్తోంది.

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు...


 



మువ్వన్నెల రంగులు అద్దుకున్న పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం.



ఆగస్ట్ 15 సందర్భంగా మెరుస్తున్న పంజాబ్ లోని అత్తారీ సరిహద్దు



మూడు రంగుల్లో మెరుస్తున్న బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజి భవనం



ఇండిపెండెన్స్ డే సంబరాల్లో నెటిజన్లు















First published: