August 15 No Holiday : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని అధికార బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు, కార్యాలయాలు, సంస్థలకు సెలవు రద్దు చేస్తున్నట్లు యోగి సర్కార్ ప్రకటించింది. ఆ రోజున ప్రతి ఒక్కరూ విద్యార్థులు విద్యాసంస్థల్లో.. అధికారులు విధుల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని యోగి ప్రభుత్వం(Yogi Govt) వివరించింది.
ఆజాది కా అమృత్ మహోత్సవ్( Azadi Ka Amrit Mahotsav)పేరుతో 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని (75th Independence Day)దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ రోజున ఎప్పటిలాగే జెండా వందనం చేసి వెళ్లిపోవడం కాకుండా ఒక ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతోనే సెలవు రద్దు చేసినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నందున ప్రతి జిల్లాలో ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమంగా ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ డి.ఎస్.మిశ్రా మాట్లాడుతూ.. దీపావళి పండుగ రోజు మాదిరిగానే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపడతామని, దీనిని జాతీయ ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులతో ముడిపడిన చోట్ల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వారోత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కేవలం అధికారిక కార్యక్రమంగా పరిమితం చేయకూడదు.. ప్రజలు అందులో భాగస్వాములు అవ్వాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు సామాజిక సంస్థలు, ప్రజాప్రతినిధులు, ఎన్సిసి, ఎన్ఎస్ఓ క్యాడెట్ల మాదిరిగానే వాణిజ్య సంస్థలను దానితో అనుసంధానం చేయాలి అని ఆయన అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Azadi Ka Amrit Mahotsav, Independence Day, Uttar pradesh, Yogi adityanath