నేడు దేశవ్యాప్తంగా 75 స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాం. బ్రిటిష్ పాలన నుంచి భారత ప్రజలు స్వేచ్ఛ పొందిన రోజు ఇది. ఈ రోజు వాడవాడలా మువ్వన్నెల జెండా ఎగరవేసి.. పండగ జరుపుకుంటారు. అయితే భారత జాతీయ పతాకం రూపకల్పనలో చాలా చరిత్ర ఉంది. త్యాగాన్ని తెలిపే కాషాయం, శాంతిని చూపే తెల్లదనం, పంట పొలాను తెలిపే పచ్చదనం, ధర్మం నిలిపే అశోకచక్రం… ఇవన్నీ కలగలిపిందే మన జాతీయ పతాకం. జాతీయ పతాకం గురించి మన రాజ్యాంగం ఏమి చెబుతుందో చూద్దాం.. జాతీయ గౌరవచిహ్నాల పరిరక్షణ (అవమాన నిరోధక) చట్టం -1971లోని నిబంధనల ప్రకారంజాతీయజెండాను, జాతీయగీతాన్ని, జాతీయ గౌరవ చిహ్మాలను, స్వాతంత్ర్యయోధులను గౌరవించడం పౌరుల ప్రాధమిక విధి.
1. జాతీయ జెండా పొడవు వెడల్పు మూడు: రెండు నిష్పత్తిలో ఉండాలి. జెండాకు తొమ్మిది రకాల కొలతలున్నాయి. 1) 6300×4200 మిల్లీమీటర్లు. 2) 3600×2400 మిల్లీమీటర్లు. 3) 2700×1800 మిల్లీమీటర్లు. 4) 1800×1200 మిల్లీమీటర్లు. 5) 1350×900 మిల్లీమీటర్లు. 6) 900×600 మిల్లీమీటర్లు. 7) 450×300 మిల్లీమీటర్లు. 8) 225×150 మిల్లీమీటర్లు. 9) 150×100 మిల్లీమీటర్లు. ఇందులో చాలా పెద్ద సైజు 6300×4200 మిల్లీమీటర్లు. చిన్న సైజు 150×100 మిల్లీమీటర్లు.
2. సూర్యోదయం కంటే ముందు జాతీయ పతాకాన్ని ఎగురవేయరాదు. జాతీయ పతాకం ఎట్టి పరిస్థితులలో నేలను తారరాదు, తగలకూడదు. అలాగే తిరగేసి ఎగరేయడం ఎగురనీయరాదు.
3. జాతీయ పతాకాన్ని అలంకరణంగా గాని, తోరణాలుగా గాని, దుస్తులుగా గాని కుట్టించుకోకూడదు. జాతీయ పతాకం పై ఎలాంటి రాతలు రాయకూడదు. దీనిని సంచిలా వాడుకొనరాదు. అలగే ఏదైనా సమావేశాల వేదికపై కప్పరాదు. ఏదైనా కంపెని వాణిజ్య పరమైనలాభాల కోసం జాతీయ పతాకాన్ని వాడరాదు.
4. జాతీయ జెండా ఉపయోగానికి పనికి రాకుండా పోతే క్వాషీ జ్యుడిషియల్ అధికారికి తెలిపి వారి అనుమతి పొంది జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులను విడదీయాలి. వారి పరిశీలనకు అప్పగించాలి.
5. జాతీయ పతాకం ఎగుర వేసే ప్రాంతాలలో ఆదేశాలు, నియమాలు పాటిస్తున్నారో లేదో అధికారులు పరిశీలించాలి. ఎవరైనా నియమావళిని అతిక్రమిస్తే అవసరమైన చర్యలు తీసుకోవాలి.
6. జాతీయ జెండాను అవమానపరిచే వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష. లేదా జరిమానా లేదా రెండింటితో కూడిన శిక్షలు వేయవచ్చు.
7. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన భవనాల మీద అనగా హైకోర్టు, గవర్నర్ సచివాలయం, ముఖ్యమంత్రి, సచివాలయం, కమీషనర్ల కార్యాలయాలు, పోలిస్ కమీషనరేట్ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు, జిల్లా పోలిస్ కార్యాలయాలు, జిల్లా ప్రజా పరిషత్తులు,మున్సిపాలిటీలు…మెదలైన ప్రభుత్వ భవనాలపై ప్రతి రోజు జాతీయ పతాకం ఎగురవేయాలి.
8. దేశానికి చెందిన ప్రముఖ నాయకులు, ఉన్నత పదవులలో విధులు నిర్వహించే వ్యక్తులలో ఎవ్వరైనామృతి చెందితే వారి మృతికి గౌరవంగా సంతాపం తెలపడానికి సగానికి దించాలి. అవనతం చేయాలి. అది కూడా ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాల వరకే.
9. ఇతర జెండాను జాతీయ జెండాకు ఎక్కువ ఎత్తులో గానీ, పక్కపక్కనే ఉంచడం కానీ చేయరాదు. జాతీయ జెండా ఎగరవేసే స్థంభానికి వేరే ఇతర చిహ్నాలు, వస్తువులు ఉంచరాదు.
10. వేడుకల తరువాత కాగితపు జెండాలను నేలపై వదిలివేయకూడదు. పారేయకూడదు. సాధ్యమైనంత వరకు జాతీయ పతాక గౌరవానికి ఎటువంటి భంగం కలుగని ప్రత్యేక ప్రదేశాలలో వాటిని ఉంచాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.