Independence Day 2021: త్రివర్ణ పతాకం గురించి 13 ఆసక్తికర విషయాలు..తప్పక తెలుసుకోండి

త్రివర్ణ పతాకం

Independence Day 2021: రేపు భారత స్వాతంత్ర్య దినోత్సవం. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకం గురించి మనం తెలుసుకోవాల్సిన 13 ఇక్కడ విషయాలను చూడండి.

  • Share this:
75 స్వాతంత్ర్య దినోత్సవం వచ్చేస్తోంది. జెండా పండుగకు దేశమంతా ఎంతో ఉత్సాహంగా వేచి చూస్తోంది. బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి మన దేశం బయటపడిన రోజుగా ఆగస్టు 15న స్వతంత్ర్య దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. మనం స్వేచ్ఛగా ఆనందంగా ఉండేందుకు కారణమైన స్వాతంత్ర్య సమరయోధులను ఆ రోజు గుర్తు చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఎర్ర కోట పై ప్రధాన మంత్రి తివర్ణ పతాకాన్ని ఎగరేసి ఈ వేడుకలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సైనిక దళాల విన్యాసాలు ఆకట్టుకుంటాయి. మువ్వన్నెల జెండా అంటే స్వేచ్ఛకు చిహ్నం అని మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చెప్పారు. ఈ సందర్భంగా భారత జాతీయ పతాకం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలను చూడండి.

1. భారత జాతీయ పతాకాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య డిజైన్ చేశారు.

2. భారతీయ పతాకాన్ని 1947 జులై 22న గుర్తించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15న దీన్ని ఎగరేశారు.

3. మొదటిసారి జాతీయ జెండాను 1906 ఆగస్టు 7న ఎగరేశారు. కలకత్తాలోని పార్సీ బగాన్ స్క్వేర్ లో దీన్ని ఎగరేశారు. అయితే అందులో కేవలం మూడు అడ్డు గీతలు (ఆకుపచ్చ, పసుపు, ఎరుపు) మాత్రమే ఉండేవి.

4. చట్ట ప్రకారం భారత జాతీయ పతాకాన్ని ఖాదీ వస్త్రంతో మాత్రమే తయారు చేయాలి. కాటన్, సిల్క్ రెండూ కలిపిన ఈ వస్త్రాన్ని గాంధీజీ పాపులర్ చేశారు.

5. కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం (KKGSS) మాత్రమే జెండాకి సంబంధించిన క్లాత్ తయారుచేస్తుంది. ఈ సంస్థ మాత్రమే భారతీయ పతాకం తయారుచేయడానికి లైసెన్స్ పొందిన సంస్థ.

6. మన జెండాలోని కాషాయం రంగు శక్తి, పరాక్రమానికి చిహ్నం. తెలుపు స్వచ్ఛతకు, శాంతికి, సత్యానికి చిహ్నం. ఇక ఆకు పచ్చ రంగు ప్రజల శ్రేయస్సుకు చిహ్నం. అశోక చక్రం ధర్మానికి చిహ్నం.

7. జెండా మధ్యలో ఉన్న అశోక చక్రం నేవీ బ్లూ రంగులో ఉంటుంది. అందులో 24 చువ్వలు ఉంటాయి.

8. భీకాజీ రుస్తుం కామా విదేశాల్లో భారతీయ పతాకాన్ని ఎగరేసిన మొదటి వ్యక్తి.

9. టెన్సింగ్ నార్గే అనే వ్యక్తి ఎవరెస్ట్ పైన భారతీయ పతాకాన్ని ఎగరేసిన మొదటి వ్యక్తి. 1953 మే29న మన జాతీయ జెండాను నార్గే ఎవరెస్ట్‌పై ఎగరేశారు.

10. 2002 కంటే ముందు భారతీయ పౌరులు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో జెండా ఎగరేయడానికి వీలుండేది కాదు. కానీ 2002లో సుప్రీం కోర్టు ఫ్లాగ్ కోడ్‌ను మార్చింది. మిగిలిన రోజుల్లోనూ జెండా ఎగరేయవచ్చని పేర్కొంది.

11. ఫ్లాగ్ కోడ్ ప్రకారం జెండాను పగటి పూట మాత్రమే ఎగరేయాలి. జాతీయ జెండా పైన ఎలాంటి ఇతర జెండాలు ఉండకూడదు.

12. జెండాను తిరగేసి ఎగరేయడం, కింద పడుకోబెట్టడం వంటివి చేయకూడదు.

13. ఒకవేళ విదేశాల నుంచి ఎవరైనా వ్యక్తులు ప్రభుత్వ కారులో ప్రయాణం చేస్తే భారత జెండా కుడి వైపు, ఆ దేశపు జాతీయ జెండా ఎడమ వైపు ఉంచాలి.

ఇవి కూడా చదవండి:

స్వాతంత్య్ర దినోత్సవం, రాఖీ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లు..ఫ్రీగా గోవా, మాల్దీవులు వెళ్లండిలా


1947 postage stamp: మళ్లీ వైరల్ అయిన మొదటి స్టాంప్..!
Published by:Shiva Kumar Addula
First published: