#IndependenceDay 2019 : స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రత్యేక కార్యక్రమాలు...

73వ సాతంత్ర్య దినోత్సవం (Image - Twitter - Anil Chavan)

#IndependenceDay : 73వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా... సైన్యం, వివిధ సంస్థలు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి.

  • Share this:
#IndependenceDay 2019 : స్వాతంత్ర్య దినోత్సవం సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. బ్రిటిషర్ల బానిసత్వాన్ని వదిలించి... మనకు స్వేచ్ఛా ఊపిరులూదిన సమరయోధుల్ని స్మరించుకోవడానికీ, మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ... సరిహద్దుల్లో మన కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న సైన్యాన్ని కీర్తించుకోవడానికి సరైన సందర్భం స్వాతంత్ర్య దినోత్సవం. అందుకే ఈ రోజున భారతీయులంతా ఒక్కటై... స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కొన్ని మంచి పనులు చేస్తున్నారు. పేదలకు ఉచిత పంపిణీ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, దేశభక్తిని పెంపొందించే సంప్రదాయ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. సరిహద్దుల్లో సైనికులు కూడా స్వాతంత్ర్య దినోత్సవాన్ని తమదైన శైలిలో నిర్వహిస్తున్నారు.

జమ్మూకాశ్మీర్‌లోని... పూంచ్ జిల్లాలో స్థానికులకు ఉచిత టెలిఫోన్ సౌకర్యం కల్పించిన భారత సైన్యంలోని రాష్ట్రీయ రైఫిల్స్ విభాగం.











First published: