కరోనా ఎఫెక్ట్.. ఆ వీడియోలకు మస్తు డిమాండ్.. 20 శాతం పెరిగిన ట్రాఫిక్..

కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల పోర్న్ వీడియో సైట్లలో రద్దీ పెరుగుతోంది. సదరు సైట్లకు ఫిబ్రవరితో పోల్చుకుంటే.. మార్చిలో 20 శాతం ట్రాఫిక్ పెరిగినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: March 26, 2020, 3:46 PM IST
కరోనా ఎఫెక్ట్.. ఆ వీడియోలకు మస్తు డిమాండ్.. 20 శాతం పెరిగిన ట్రాఫిక్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో అన్నిరంగాలు దాదాపు స్తంభించిపోయాయి. కొన్ని సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించగా, మరికొన్ని సంస్థలు చేసేదేం లేక ఉద్యోగులకు సెలవులు ప్రకటించారు. కాలేజీలు, స్కూల్స్‌కు సైతం సెలవులే కావడం.. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావొద్దన్న ఆదేశాలు ఉండడంతో అంతా తమ గదులకే పరిమితమైపోయారు. దీంట్లో ఇంట్లో నుంచి బయటకు రాకుండా అదేపనిగా ఉండడంతో చాలామంది బోర్‌గా ఫీలవుతున్నారు.

కొంతమంది సినిమాలు, టీవీలు, మొబైల్స్‌కు అతుక్కుపోగా, మరికొంతమంది మాత్ర పోర్న్ వీడియోల వైపు మళ్లారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఒక్కసారిగా పోర్న్ వీడియోలను చూసే వారి సంఖ్య సాధారణ రోజుల్లో కంటే 20 శాతం పెరిగింది. ప్రధానంగా దేశీ పోర్న్ కంటెంట్ కోసం అనేక వెబ్‌సైట్లలో వెతుకుతున్నారు. ఓ అడల్ట్ సంస్థ సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో సాధారణ రోజుల్లో పోర్న్ సైట్ల ట్రాఫిక్‌తో పోల్చితే..మార్చిలో ఆ ట్రాఫిక్ 20 శాతం పెరిగినట్టు తేలింది. రెండు వారాలుగా ట్రాఫిక్ మరింతగా పెరుగుతూ వస్తోంది.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు