Coronavirus:లాక్ డౌన్‌తో పెరిగిన గాలి నాణ్యత.. ఆ ప్రాంత వాసులకు కాస్తంత ఊరట..

దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో గాలిలో నాణ్యత ప్రమాణాలు పెరిగాయి. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుండడంతో గాలిలో మరింతగా నాణ్యత పెరిగే అవకాశం ఉంది.

news18-telugu
Updated: March 26, 2020, 4:23 PM IST
Coronavirus:లాక్ డౌన్‌తో పెరిగిన గాలి నాణ్యత.. ఆ ప్రాంత వాసులకు కాస్తంత ఊరట..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నోయిడా, ఘజియాబాద్.. ఈ పేర్లు వినగానే అందరికీ గుర్తొచ్చేది గాలి కాలుష్యం. ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సమయంలో గాలి కాలుష్యంతో ఆ ప్రాంత ప్రజలతో పాటు దేశ రాజధానిలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీఇన్నీ కావనే చెప్పాలి. ఎందుకంటే.. నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన రోడ్డు మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల మీదుగా నిత్యం వేలసంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో గాలిలో నాణ్యత తగ్గి వాయుకాలుష్యం ఏర్పడుతుంది. అయితే కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

అత్యవసరమైతే తప్ప వాహనాలు రోడ్డెక్కకపోవడంతో ఘజియాబాద్, నోయిడా ప్రాంతాల్లో వాయుకాలుష్యం పూర్తిగా తగ్గి గాలిలో నాణ్యత ప్రమాణాలు పెరిగాయి. ఘజియాబాద్ ప్రాంతంలో 92తో మధ్యస్థంగా ఉండగా, నోయిడాలో మాత్రం 76తో సంతృప్తికరంగా ఉంది. అయితే ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో మరింతగా ఆయా ప్రాంతాల్లో వాయు కాలుష్యం తగ్గనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు