Home /News /national /

INCOME TAX DEPARTMENT OFFCIALS DRESSED AS BAARAATIRAIDS IN MAHARASHTRA JALNA 58 CRORE CASH AND 32 KG GOLD RECOVERED SK

IT Raids: పెళ్లి ఊరేగింపుగా వచ్చి.. 390 కోట్లను పట్టుకున్న ఐటీ అధికారులు.. సినిమా స్టైల్లో ట్విస్ట్

IT Raids: ఆగస్టు 3న జల్నా పట్టణంలోకి పెద్ద ఎత్తున కార్లు వచ్చాయి.  ఏకంగా 100కి పైగా కార్లు పట్టణంలో చక్కర్లు కొట్టాయి. వాటిపై 'రాహుల్ వెడ్స్ అంజలి' అని స్టిక్కర్స్ అంటించి ఉన్నాయి

IT Raids: ఆగస్టు 3న జల్నా పట్టణంలోకి పెద్ద ఎత్తున కార్లు వచ్చాయి.  ఏకంగా 100కి పైగా కార్లు పట్టణంలో చక్కర్లు కొట్టాయి. వాటిపై 'రాహుల్ వెడ్స్ అంజలి' అని స్టిక్కర్స్ అంటించి ఉన్నాయి

IT Raids: ఆగస్టు 3న జల్నా పట్టణంలోకి పెద్ద ఎత్తున కార్లు వచ్చాయి.  ఏకంగా 100కి పైగా కార్లు పట్టణంలో చక్కర్లు కొట్టాయి. వాటిపై 'రాహుల్ వెడ్స్ అంజలి' అని స్టిక్కర్స్ అంటించి ఉన్నాయి

  ఇటీవల దేశవ్యాప్తంగా ఐటీ రైడ్స్ (Income Tax) బాగా పెరిగాయి. అక్రమంగా డబ్బు సంపాదించారని.. పన్ను ఎగ్గొట్టి కోట్లు కూడబెట్టారని సమాచారం వస్తే చాలు.. వెంటనే ఆదాయపన్ను శాఖ అధికారులు అక్కడ వాలిపోతున్నారు. ఉన్నపళంగా తనిఖీలు చేసి.. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర (Maharashtra IT Raids)లో జరిగిన ఐటీ సోదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పలువురి వ్యాపారుల ఇళ్లల్లో తనిఖీలు చేసిన అధికారులు.. వందల కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. ఐతే వారు సోదాలకు వెళ్లిన తీరు.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఐటీ అధికారులు.. సినిమాల్లో చూపించినట్లుగా.. వేషధారణ మార్చేసి.. పెళ్లి ఊరేగింపుగా వెళ్లి.. సోదాలు చేశారు. పక్కా స్కెచ్‌తో.. అక్రమార్కులకు తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా.. గట్టిగా దెబ్బకొట్టారు.

   రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. సికింద్రాబాద్, నల్గొండ, విజయవాడ మీదుగా స్పెషల్ ట్రైన్స్

  మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఉక్కు, వస్త్ర వ్యాపారి, రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. మొత్తం నాలుగు కంపెనీల యజమానుల నివాసాల్లో సోదాలు చేశారు. తమ తనిఖీల్లో భారీగా నగదు, ఆభరణాలను ఆదాయ పన్నుశాఖ గుర్తించింది. ఆగస్టు 1 నుంచి 8 వరకు ఈ సోదాలు చాలా రహస్యంగా జరిగాయి. ఐతే ఈ ఆపరేషన్ మొత్తం సినీ ఫక్కీలో జరిగింది. చాలా నాటకీయ పరిణామాల మధ్య ఐటీ అధికారులు అక్రమాస్తులను పట్టుకున్నారు.

  అసలేం జరిగిందంటే..?

  ఆగస్టు 3న జల్నా పట్టణంలోకి పెద్ద ఎత్తున కార్లు వచ్చాయి.  ఏకంగా 100కి పైగా కార్లు పట్టణంలో చక్కర్లు కొట్టాయి. వాటిపై 'రాహుల్ వెడ్స్ అంజలి' అని స్టిక్కర్స్ అంటించి ఉన్నాయి. ఆ వాహనాలను చూసి.. ఎవరో బాగా డబ్బున్న వ్యక్తి ఇంట్లో పెళ్లి జరుగుతుందని స్థానికులు అనుకున్నారు. కానీ నిజానికి అక్కడ ఎలాంటి పెళ్లి జరగలేదు. ఆ కార్లలో ఉన్న వారు అతిథులూ కారు. అవి ఆదాయ పన్నుశాఖకు చెందినవి కార్లు. దాదాపు 160 మంది అధికారులు, సిబ్బంది, పోలీసులు 5 బృందాలుగా విడిపోయి.. జల్నా పట్టణంలో సోదాలు చేశారు.

  iframe class="nw_webstory_embed" src="https://telugu.news18.com/web-stories/lifestyle/Independence-day-2022-follow-these-rule-while-hoisting-national-flag-sk-sk/index.html" data-img="https://cdn2.storyasset.link/a300ccc5-585d-48b3-8b9b-0b6d3b7f7c77/ms-kvwfrhmmlz.jpg" data-title="ఇంటిపై జెండా.. ఈ రూల్స్ పాటించాలి తప్పకుండా..">

  పీటీ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కాళికా స్టీల్ అల్లాయ్స్‌, సాయిరామ్ స్టీల్‌తో పాటు మరో కంపెనీకి చెందిన యజమానుల నివాసాలు, ఆఫీసులు, ఫ్యాక్టరీల్లో ఆదాయ పన్నుశాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సోదాల్లో 58 కోట్ల నగదు, 32 కిలోల బంగారం, వజ్రాలు, ముత్యాలు, పలు ఆస్తుల పత్రాలతో కలిపి మొత్తం రూ. 390 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. దొరికిన నగదును సమీపంలోని ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లి లెక్కించారు. ఆ డబ్బును లెక్క పెట్టేందు దాదాపు 13 గంటల సమయం పట్టింది. జల్నాకు చెందిన నాలుగు స్టీల్ కంపెనీల వ్యవహారశైలిలో అవకతవకలు జరిగాయని ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందడంతో తనిఖీలు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఆదాయ పన్ను విభాగం ఈ సోదాలు చేపట్టింది. ఆపరేషన్‌లో ఆదాయపు పన్ను శాఖ స్థానిక పోలీసుల సహాయాన్ని కూడా తీసుకుంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Income tax, IT raids, Maharashtra

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు