ఒక్క దశలోనే ఎన్నికలు జరిగిపోతే అవి అనూహ్యం. అదే దశలవారీగా జరిగితే... జరిగిన ప్రతీసారీ ట్రెండ్ ఎలా ఉందో అంచనా వెయ్యొచ్చు. ఉత్తరప్రదేశ్ విషయంలో ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో ఎన్నికలు జరిపించడమంటే అదో పెద్ద క్రతువు. ఈసారి అక్కడ ఏకంగా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. చివరి దశను మే మధ్యలో బీహార్‌తో కలిపి జరపబోతున్నారు. గత 15 ఏళ్లుగా చూస్తే... ఉత్తరప్రదేశ్‌లోని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు... ఎన్నికలు... పశ్చిమం నుంచీ తూర్పుకీ... లేదా తూర్పు నుంచీ పశ్చిమం వైపు జరుగుతున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ అగ్రనాయకత్వం... యూపీ పోల్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈసారి యూపీలో ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండటంతో... బీజేపీ కాస్త ఊపిరి పీల్చుకుంది. మొదటి దశ పశ్చిమ దిశలోని రాష్ట్రాల నుంచీ మొదలవ్వబోతోంది.
గత సాధారణ ఎన్నికల్లో పోలింగ్... వెస్ట్ నుంచీ ఈస్ట్ వైపు నడిచింది. పూర్వాంచల్ ప్రాంతంలో ప్రధానంగా వారణాసి (నరేంద్ర మోదీ), అజంఘర్ (ములాయం సింగ్ యాదవ్) స్థానాలు కీలకంగా మారాయి. బహుళ దశలో ఎన్నికలు జరిగేటప్పుడు పార్టీలు కనీసం సగం దశల్లోనైనా అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలి. పశ్చిమ యూపీ తమ కంచుకోటగా మారిందంటున్న బీజేపీ నేతలు... అక్కడ మొదటి దశలో మంచి మార్కులతో మొదలుపెట్టి... క్రమంగా మిగతా దశల్లోనూ అదే ఉత్సాహం కలబరుస్తామంటున్నా్రు. ఎక్కడ తాము వీక్‌గా ఉన్నామో అక్కడ ఎక్కువ దృష్టి సారిస్తామని చెబుతున్నారు.
చివరి దశల్లో మైనార్టీ ఓట్లు ఎటు చీలుతాయన్నది ముందే అంచనా వెయ్యలేని పరిస్థితి. అందువల్ల ముందు దశల్లోనే వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి. తద్వారా చివరి దశల్లో తక్కువ స్థానాలు దక్కినా గెలిచే అవకాశాలు తమకే ఉంటాయని బీజేపీ భావిస్తోంది.
సాధారణంగా పోలింగ్ దశలు పశ్చిమం నుంచీ మొదలైతే తమకు కలిసొస్తాయనీ, తూర్పు నుంచీ మొదలైతే సమాజ్ వాదీ పార్టీకి కలిసొస్తాయని బీజేపీ నమ్ముతోంది. బీఎస్పీకి మాత్రం ఎటు నుంచీ ఎటు జరిగినా ఫలితం ఒకేలా ఉంటోంది. అలాగని ఈసారీ అలాగే జరుగుతుందని అనుకోలేం. ప్రతీ ఎన్నికా... రాజకీయ, సామాజిక అంశాలతో ముడిపడి ఉంటుంది. 2014తో పోల్చితే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి అంత సానుకూల పరిస్థితులు లేవు. పైగా ఇప్పుడక్కడ ప్రతిపక్షాలన్నీ (ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్) జట్టుకట్టాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీ ఉన్నా... ఆ పార్టీ దాన్ని క్యాష్ చేసుకోలేకపోయింది. కేంద్రంలో ఐదేళ్ల బీజేపీ పాలన, రాష్ట్రంలో రెండేళ్ల యోగి పాలన ప్రభావం ఈ ఎన్నికలపై తప్పక ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
ఈసారి ఎన్నికల్లో కొత్తదనం ఏముంది? కొత్తగా ఏ రూల్స్ తెచ్చారు?
టీడీపీ - వైసీపీ ... ఏ పార్టీ పథకాలు గొప్పవి ... విజయం ఎవరిది?
Lok Sabha Election 2019: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా... లేదా? 3 నిమిషాల్లో తెలుసుకోండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Election Commission of India, Lok Sabha Election 2019