Home /News /national /

IN THAT ZOO FEMALE TIGERS DONT LIKE TO MATE YOU WILL BE SURPRISED IF YOU KNOW THE REASONS UMG GH

Tigers Reproduction: ఆ జూలో ఆడ పులులు సంభోగానికి.. ఇష్ట పడటం లేదంటా ? కారణాలు తెలిస్తే అవాక్కవుతారు..!

ఆ జూలో ఆడ పులులు సంభోగానికి.. ఇష్ట పడటం లేదంటా ? కారణాలు తెలిస్తే అవాక్కవుతారు.. !

ఆ జూలో ఆడ పులులు సంభోగానికి.. ఇష్ట పడటం లేదంటా ? కారణాలు తెలిస్తే అవాక్కవుతారు.. !

కర్ణాటకలోని బన్నెరఘట్ట బయోలాజికల్ పార్క్ (Bannerghatta Biological Park) జూలోని పులులు తమ మగతనాన్ని (Virility) ఎక్కువగా చూపించడం లేదు. ఫలితంగా పులులలో పునరుత్పత్తి అనేది అసాధ్యంగా మారింది. దీంతో బన్నెరఘట్ట జూ నిర్వాహకులు కర్నాటకలోని ఇతర జూలలోని పులులను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర?

ఇంకా చదవండి ...
కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని ఒక జూ అథారిటీ (Zoo Authority) అధికారులకు కొత్త సమస్య తలెత్తింది. అక్కడి పులులను సంతానోత్పత్తి (Reproduction) సమస్యలు వేధిస్తున్నాయి. బన్నెరఘట్ట బయోలాజికల్ పార్క్ (Bannerghatta Biological Park) జూలోని పులులు తమ మగతనాన్ని (Virility) ఎక్కువగా చూపించడం లేదు. ఫలితంగా పులులలో పునరుత్పత్తి అనేది అసాధ్యంగా మారింది. దీంతో బన్నెరఘట్ట జూ నిర్వాహకులు కర్నాటకలోని ఇతర జూలలోని పులులను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలానే రెస్క్యూ టైగర్స్‌ను కూడా వీరు అన్వేషించాల్సి వస్తోంది.

గత కొద్ది రోజులుగా బన్నెరఘట్ట పార్క్‌లోని పశువైద్యులు, జంతు సంరక్షకులు, సిబ్బంది పులులు ఇతర పులులతో సంభోగంలో పాల్గొనడానికి ఇష్టపడటం లేదన్న విషయాన్ని గమనించారు. కలయికకు అనుకూలమైన ఆడ పులులు ఈ జూలోని మగ పులులకు దొరకకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుకే జూలోని కొన్ని పులులను వేరే జూలకు అందించి అక్కడి నుంచి కొత్త పులులను తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకో సమస్య ఏంటంటే.. మగ, ఆడ పులులు జతకట్టినా.. గర్భం దాల్చే శాతం తగ్గుతోందట. ఇందుకు వాటిలోని అనేక పులులు ఒకే వంశానికి చెందినవై (Inbred) ఉండటమే కారణమని అంటున్నారు. ఇన్-బ్రీడ్ అవ్వడం వల్ల ఆడపులులు గర్భం దాల్చలేకపోతున్నాయని చెబుతున్నారు.

ఇదీ చదవండి:  Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?

ముసలి వయస్సు, బలహీనత సమస్యల కారణంగా కూడా ఆడ పులులు మగ పులులను ఆకర్షించలేకపోతున్నాయి. అంతేకాకుండా, జూ పరిధిలోని పేలవమైన జీవనశైలి కూడా పులుల సహజ ఆరోగ్యాన్ని చెడుగా ప్రభావితం చేస్తోందని, ఇది కూడా వాటి పునరుత్పత్తిపై ప్రభావం చూపుతుందని నిర్వాహకులు అన్నారు. పులులు మానవులతో సన్నిహితంగా ఉండటం మరొక కారణమని అధికారులు అంటున్నారు. రెండవ లేదా మూడవ తరం పులులు మానవుల సంరక్షణలో పెంచడం వల్ల కూడా వాటి పునరుత్పత్తిపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని కనుగొన్నారు. ఈ నిజాన్ని ఇంతకు ముందు గమనించలేదని.. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని అధికారులు చెబుతున్నారు. సంతానోత్పత్తి సమస్యలను ఎన్నడూ అంత తీవ్రంగా పరిశీలించకపోవడం కూడా ఓ కారణం కావచ్చని జూ నిర్వాహకులు పేర్కొన్నారు.



"పులుల ప్రవర్తన, వైఖరిలో మార్పును సిబ్బంది గమనించారు. వాటి కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే జూలో గత కొంతకాలంగా కొత్త పిల్లలు పుట్టలేదు. పులులలో కొన్నిటికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి" అని ఒక అధికారి చెప్పారు. సంతాన సమస్యను పరిష్కరించడానికి అధికారులు రెస్క్యూ టైగర్స్‌తో పాటు కొన్ని అడవి మగ లేదా ఆడ పులులను తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. లేదా ఇతర జూలలోని కొన్ని పులులను ఎక్స్చేంజ్ చేయాలని యోచిస్తున్నారు. అలానే, ఇతర జూలలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయా.. దీనికి పరిష్కారం ఏమిటని ఆరా తీస్తున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Karnataka, Tiger Attack, Tigers, Zoo park

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు