Mann ki Baat: కోవిడ్ వ్యాక్సినేషన్ సక్సెస్‌కు వారే ప్రధాన కారణం.. ప్రధాని మోదీ మన్ కీ బాత్‌

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

PM Mann ki baat: మన దేశం 100 కోట్ల మైలు రాయిని అధిగమించిన నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌కు చెందిన మహిళా ఆరోగ్య కార్యకర్త పూనం నౌటియాల్‌తో ప్రధాని మాట్లాడారు.

 • Share this:
  కరోనా వ్యాక్సినేషన్ 100 కోట్ల (100 Crore covid-19 vaccination) మైలురాయిని అధిగమించిన తర్వాత.. భారత్ కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తోందని ప్రధాని  నరేంద్ర మోదీ(PM Narendra Modi) అన్నారు. ఈ విజయంతో భారత్ శక్తి సామర్థ్యాలు, సమిష్టి కృషి గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందని కొనియాడారు. కరోనా వ్యాక్సినేషన్‌లో లక్షలాది మంది హెల్త్ కేర్ వర్కర్లు  (Healthcare workers) అద్భుతంగా పనిచేశారని, ఈ ఘనత వారికే ప్రశంసలు కురిపించారు. రేడియో కార్యక్రమం మన్‌కీ బాత్‌ (Mann ki Baat) 82వ ఎడిషన్‌లో జాతినుద్దేశించి ప్రసగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు.

  మన దేశం 100 కోట్ల మైలు రాయిని అధిగమించిన నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ.  ఈ సందర్భంగా  ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌కు చెందిన మహిళా ఆరోగ్య కార్యకర్త పూనం నౌటియాల్‌తో ప్రధాని మాట్లాడారు. టీకా సమయంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బాగేశ్వర్‌లో 100శాతం వ్యాక్సినేషన్‌ను అమలు చేసినందుకు ప్రధాని మోదీ అభినందలు తెలిపారు.

  INDvPAK: ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌పై రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు

  ''అక్టోబరు 31న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.  ఆయనకే మనకు ఐక్యత సందేశాన్ని అందించారు.  ఐక్యతతోనే దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలమని సర్దార్ చెప్పేవారు. మనలో ఐక్యత లేకపోతే కొత్త విపత్తుల్లో చిక్కుకున్నట్లే భావించాలని ఆయన సూచించారు. మనమంతా ఐక్యంగా ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు. '' అని మోదీ పేర్కొన్నారు.

  India Corona Updates: తగ్గిన కరోనా కేసులు.. ఆందోళన కలిగిస్తున్న మరణాలు.. తాజా బులెటిన్ ఇదే

  వచ్చే నెల మనం భగవాన్ బిస్రా ముండా జయంతిని జరుపుకోబోతున్నామని.. మన సంస్కృతి పట్ల ఎలా గర్వపడాలో,  ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో, అసమానత్వంపై ఎలా పోరాడాలో ఆయన జీవితం మనకు నేర్పుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన జీవిత గాథను ప్రతి యువతీ యువకుడు చదవాలని చెప్పారు.

  Petrol Price Today: ఏడాదిలో రూ.27 పెరిగిన పెట్రోల్ రేటు.. ఆల్ టైమ్ రికార్డు

  మన దేశంలో డ్రోన్ల వినియోగం పెరిగిందని ప్రధాని మోదీ చెప్పారు. వస్తువుల డెలివరీతో పాటు అత్యవసర సమయాల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ డెలివరీకి కూడా డ్రోన్లు తోడ్పడ్డాయని పేర్కొన్నారు. కొత్త డ్రోన్ పాలిసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని అన్నారు. ఇప్పటికే పలు కంపెనీలకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రూ.500 కోట్ల ఆర్డర్‌లు ఇచ్చినట్లు చెప్పారు ప్రధాని మోదీ.


  Matchbox : అమ్మ బాబోయ్.. అగ్గి పెట్టె ధర మండింది -14ఏళ్ల తర్వాత రేటు ఇదే తొలిసారి

  మన దేశంలో పోలీస్, ఆర్మీ విభాగాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు ప్రధాని మోదీ. 2014లో 1.04 లక్షల మంది మహిళలు ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య 2 లక్షల పైనే ఉందని చెప్పారు. ఇక పండగ వేళ అందరూ స్వదేశీ ఉత్పత్తులన కొని.. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
  Published by:Shiva Kumar Addula
  First published: