Home /News /national /

IN MAMATA BANERJEE VS GOVERNOR BENGAL FRESH MOVE MAY BE NEW FLASHPOINT PVN

Mamata Vs Governor : గవర్నర్ కు మమత బిగ్ షాక్..ఇకపై ఆ అధికారం లేదు!

బెంగాల్ గవర్నర్-సీఎం మమత(ఫైల్ ఫొటో)

బెంగాల్ గవర్నర్-సీఎం మమత(ఫైల్ ఫొటో)

Mamata Vs Governor : వెస్ట్ బెంగాల్​(West Bengal)లో సీఎం, గవర్నర్ మధ్య నెలకొన్న వివాదం మరో స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee),గవర్నర్ జగ్​దీప్​ ధన్​కర్ మధ్య తీవ్ర అభిప్రాయభేదాలు నెలకొన్న నేపథ్యంలో బెంగాల్ కేబినెట్ కీలక బిల్లును ప్రతిపాదించింది.

ఇంకా చదవండి ...
Mamata Vs Governor : వెస్ట్ బెంగాల్​(West Bengal)లో సీఎం, గవర్నర్ మధ్య నెలకొన్న వివాదం మరో స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee),గవర్నర్ జగ్​దీప్​ ధన్​కర్ మధ్య తీవ్ర అభిప్రాయభేదాలు నెలకొన్న నేపథ్యంలో బెంగాల్ కేబినెట్ కీలక బిల్లును ప్రతిపాదించింది. ఇక‌పై యూనివ‌ర్శిటీల ఛాన్స‌ల‌ర్‌గా గ‌వ‌ర్న‌ర్ కాకుండా.. ముఖ్య‌మంత్రే ఛాన్స‌ల‌ర్‌గా ఉండేలా ముసాయిదా బిల్లు రూపొందించింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపిందని బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు తెలిపారు. త్వరలో అసెంబ్లీలో ఈ బిల్లును ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని విద్యాశాఖ మంత్రి ప్ర‌క‌టించారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఛాన్స్​లర్​గా ఉంటున్నారు. ఈ బిల్లుకు అసెంబ్లీతో పాటు గవర్నర్ ఆమోదం లభిస్తే అమలులోకి వస్తుంది. ఆ తర్వాత యూనివర్సిటీలకు ఛాన్స్​లర్​గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. దీంతో యూనివర్సిటీలపై గవర్నర్ తన అధికారం కోల్పోనున్నారు. యూనివర్శిటీల ఛాన్స‌ల‌ర్ వ్య‌వ‌స్థపై బెంగాల్‌ లో కొన్ని రోజులుగా తీవ్ర వివాదం సాగుతున్న విష‌యం తెలిసిందే. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌కుండానే ఛాన్స‌ల‌ర్ హోదాలో గ‌వ‌ర్న‌ర్ కొన్ని యూనివ‌ర్శిటీల‌కు వీసీల‌ను నియ‌మించార‌ని సీఎం మ‌మ‌తా తీవ్రంగా మండిప‌డ్డారు. ఈ కార‌ణంగానే గ‌వ‌ర్న‌ర్ అధికారాల్లో కోత విధించ‌డానికి గానూ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ALSO READ Gutka stain inside aircraft : విమానంలో గుట్కా మరక..చొక్కా విప్పించి తుడిపించాలంటూ నెటిజన్లు ఫైర్

మరోవైపు,ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌ను ఇప్పటికే తన ట్విట్టర్ ఖాతాలో బ్లాక్ చేశారు, ''దానికి నేను ముందుగా క్షమాపణలు చెబుతున్నాను. అతను (జగ్‌దీప్ ధంఖర్) ప్రతిరోజూ నన్ను లేదా నా అధికారులను దుర్భాషలాడుతూ ఏదో ఒక ట్వీట్ చేస్తాడు. రాజ్యాంగ విరుద్ధమైన, అనైతికమైన విషయాలు మాట్లాడతాడు. అతను సలహా ఇవ్వడు. ఏ సూచనలు చేయడు. ఎన్నికైన ప్రభుత్వాన్ని బంధిత కార్మికుల్లా చూస్తాడు. అందుకే అతనిని నా ట్విట్టర్ ఖాతా నుండి తొలగిస్తున్నాను'' అంటూ మమతా బెనర్జీ ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, పోలీసు చీఫ్‌ను గవర్నర్ బెదిరించారని బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. ధన్‌ఖర్‌ను తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి పలుమార్లు లేఖలు రాసినా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె అన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Mamata Banarjee, West Bengal

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు